ముందు తెలుసుకోవలసినది ఎవరు గాలిపీలిస్తున్నారు. కోమాలో వున్న వ్యక్తి సంగతి- అతని బుద్ధి నిశ్చేతనమయింది. కాని గుండె కదులుతుంది. అదెలాగ.
కోమాలో వున్న వ్యక్తి, బాగా గాయపడి వ్యక్తి, బుద్ధిమాంద్యతను పొందిన వ్యక్తి అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నారు. వాళ్ళు అదే స్థితిలో చాలా కాలం వుంటారు.
బుద్ధి ఇంద్రియాలు కలిసి పనిచేస్తాయి. ఈ రెండూ మన కర్మానుసారంగా నడుస్తాయి. కోమాలో వ్యక్తికి ఈ రెండూ వెంటిలేటర్సు వుంచినంతసేపు జీవిస్తాయి. ఆ జీవికి చాలా బాధాకరం ఆ వెంటిలేటర్సు తీసేస్తే ఆ మనిషి జీవితం అయిపోతుంది. ఇది ఘోరమైనస్థితి. ఇక్కడే మనకు తెలుస్తుంది. ఆ స్థితిలో కూడా జీవాత్మ తన కర్మఫలం అనుభవిస్తుంది. తెలివిలో వున్నా, తెలివిలో లేకున్నా నీకు తెలియనిది. కనిపించనిది అదే నీ కర్మ. పరమాత్మ ఒక సాక్షి మాత్రమే. కర్మఫలం మనల్ని ఒకపక్కకు తోస్తుంది. మనం మన బుద్ధితో ఏది చెయ్యాలి. ఏది చెయ్యకూడదో ఆలోచించి చెయ్యాలి.
మనం వుండే పరిసరాలు మన మీద చాలా ప్రభావం చూపుతాయి. మంచి పరిసరాలలో వుంటే మంచి ఊహలు, మంచి గుణాలు వృద్ధి చెందుతాయి.
దుష్టుల సహవాసంతో నీవు కూడా దుష్టుడవైపోతావు. అంతే.