మన శరీరంలో ఇంద్రియాలను తన చైతన్యశక్తితో జీవాత్మ నడిపిస్తుంటాడు. అందుకనే నీ ఇంద్రియాలని మంచి విషయమార్గంలో ప్రవేశపెట్టు అదే ధ్యానమార్గం.
పరమాత్మ చైతన్య స్వరూపడు అయినా సాక్షీభూతుడుగా మాత్రమే వుంటు అంతా గమనిస్తాడు.
జీవాత్మ కనుక మంచి పనులే చేస్తూ మంచి విషయాలే వింటుంటే అదే మార్గంలో వుండు. గురువు చెప్పినది శ్రద్ధగా ఆచరించు. ఇంద్రియాలని అదుపులో వుంచు అప్పుడు జీవాత్మ యీ స్థూలశరీరాన్ని దాటి పరమాత్మలో కలిసిపోతాడు.