SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 28 Jun 2019
భగవంతుని చేరడానికి ఏది సులభమైన మార్గము?

ఒక రాజు ఉండేవాడు. ఏ మతము ఉత్కృష్టమో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. తమతమ మత విషయాలు మాటలాడడానికి ఆ రాజ్యం లోని అన్ని మతాల అధిపతులను అవ్హాఆనించేడు. ఒకరి తరువాత ఒకరు ఆ మత అధిపతులు తమతమ మత విషయాలను చెప్పేరు.

మొదట, ఒకరినొక్కరు మర్యాదగా విన్నారు. కొంచం సేపుతరువాత వాదనలు ప్రారంభం అయ్యేయి. మరి కొంచం సేపటికి గట్టిగా ఒకరిమీద ఇంకొకరు అరిచేరు ; ఇంకొంచంసేపులో దెబ్బలాటలు ప్రారంభమయ్యేయి.

ఆ రాజుకి ఏమి అర్ధం కాలేదు. మూడు దినములలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని రాజు వారికి చెప్పేరు. కానీ మూడు దినముల తరువాత ఇంకా గొడవలు కోనసాగుతూనే ఉన్నాయి. ఆ రాజు విసిగిపోయి తన గృహములోకి వెళ్ళిపోయేడు.

అదే సమయంలో భగవంతుడు ఒక వృద్ధిది రూపంలో రాజుదెగ్గిరికి వచ్చి తానూ ఏది గొప్ప మతంమొ చెప్తాను అని రాజుకి చెప్పేడు. తనతో రమ్మన్నాడు. వాళ్లిదరు చాలా దూరం నడిచి ఒక నది తీరానికి చేరేరు.

ఆ ముసిలివాడు అన్నాడు, ‘ఓ రాజా! మనము ఈ నది దాటాలి. ఆవలి తీరములో ఒక వృక్షమున్నది. దాని దెగ్గిర నేను నీకు ఏ మతము గొప్పదో చెపుతాను. ఒక మంచి తెప్పను తీసుకురా’ అన్నాడు.

ఆ రాజు ఒక తెప్పకై ఆజ్ఞాపించెడు. ఆ తెచ్చిన తెప్ప సరిలేదు అని వృద్ధుడు అన్నాడు.

ఆ రాజు ఇంకొక తెప్పతెప్పించేడు. అది కూడా వృద్ధుడికి నచ్చలేదు. ఇలా ఎన్ని తెప్పలు తెప్పించినా, వృద్ధుడు అంగీకరించలేదు. అప్పుడు రాజు విసిగిపోయి, ‘ఓ ముసిలివాడ! మనము నది దాటాలి అంతే. ఏ తెప్ప అయితే ఏంటి? నాకు నచ్చిన తెప్ప నేను ఎక్కుతాను. నీకు ఎందుకు?'- అన్నాడు.

అప్పుడు ఆ వృద్ధుడు, ‘రాజా, నేను చెప్పవలసిన పాఠము అయిపొయింది. మనము ఈ సంసారము దాటడానికి ఏ మతమైతే ఏమిటి? మనకి నచ్చినది పట్టుకుంటే చాలు’- అన్నాడు.

(తెలుగు భక్తిమాల నవంబర్ 1980)

Tags: