SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
ప్రభాకర్ అయ్యర్, హైదరాబాదు (Prabhakar Iyer, Hyderabad)

నేను శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మొట్టమొదట కొచ్చిన్ లో మా బావగారితో పాటు 1980లో కలిశాను. మా బావగారు చాలా ప్రగాఢ భక్తులు మరియు ట్రస్టీగా వుండేవారు. మొట్టమొదటి సారి వారిని కలిసినప్పుడు వారు నాతోటి నేను విజయవాడకు తరచూ వెళుతుంటాను. మీరు హైదరాబాదులో వున్నారు కనుక మీకు రావాలనిపించినప్పుడు అక్కడకు రావచ్చును అని చెప్పారు. అది వారితోటి నా మొదటి సంభాషణ. ఆ తరువాత నేను హైదరాబాదుకు తిరిగి వెళ్లి నా వ్యాపార వ్యవహారాలలో ఈ విషయాన్ని మరచిపోయాను. నేను మరల కొచ్చిన్ కి మా బావగారితో పాటుగా వెళ్లాను. శ్రీ స్వామీజీ వారు మీరు విజయవాడకు రాలేదు అని అడిగారు. నేను లేదు స్వామీజీ ఆ విషయాన్ని నేను మరచిపోయాను అని చెప్పాను. అప్పుడు వారు అక్కడికి వచ్చి నన్ను కలవండి అని చెప్పారు.

ఆ కాస్త సమయంలోనే, నాకు శ్రీ స్వామీజీ వారు భగవంతునిగా అనిపించారు. నేను తప్పక వారిని కలవాలనుకున్నాను. ఒక నవరాత్రి సమయంలో నేను వ్యాపార వ్యవహారమయి విజయవాడకు ఒక ముస్లిము స్నేహితునితో కలిసి వెళ్ళాను. నేను అతన్ని విజయవాడ అశ్రమానికి తీసుకుని వెళ్లమని కోరాను. మీకు ఆ స్వామిని చూడడానికి ఏమయినా అభ్యంతరమా అని నేను అతడ్ని అడిగాను. అతను లేదు నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పాడు. మేము అక్కడికి వెళ్లాము. అది సాయంకాల సమయం శ్రీ స్వామీజీ వారు భజనలను పాడుతున్నారు. నేను ఎవరి సిఫార్సుతోనే వారికి దగ్గరగా వెళుతూ మిగతా విషయాలను మరచిపోవడం సరయిన పని కాదు అని అనుకున్నాను. నేను వారికి నమస్కారం చేస్తూ మీరు నేను రావాలని అనుకున్నారు. నేను వచ్చాను. మీరు బిజీగా వున్నారు. మీరు మీ కార్యక్రమాలలో వున్నారు. నన్ను క్షమించండి అని చెప్పి నేను వెనుదిరిగి హైదరాబాదు చేరుకున్నాను.

యింతలో 1982లో హైదరాబాదులో ఆశ్రమాన్ని నిర్మించాలని వారు తలపోస్తున్న సందర్భంలో నాకు తెలిసిన ఒక ట్రస్టీ నన్ను అక్కడకు రమ్మని అడిగారు. శ్రీస్వామీజీ వారు కూడా వస్తున్నారని అతను తెలిపాడు. నేను ఆ బృందంలో ఒక సభ్యుడినయి ఆరుగురము ఆ నిర్మాణకార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నాము. నేను వంటలోను, భజనలను పాడడంలోను యింకా ఏమయినా పనులను చేయడంలో సహాయపడేవాడిని. నిర్మాణం పూర్తయ్యేలోపు ట్రస్టీలు నన్నూ మరి యింకొక వ్యక్తిని మద్రాసు వెళ్ళి దత్తమూర్తిని తీసుకుని రావలసినదని కోరారు.

ఆ సమయంలో మా అమ్మాయి ఆరోగ్యం సరిగా లేదు. ఆమెకు వాంతులు ఎడతెరిపి లేకుండా అవుతున్నాయి. నా భార్య ఆ వాంతులతో పాటు రక్తం కూడా పడుతున్నదని చెప్పింది. నేను భయపడుతూ వెళ్లి ఒక ద్రావకాన్ని మందనుకుని తీసుకుని వచ్చాను. కొంత ఆమె నోట్లో పోసాక అది కిరోసిన్ అని నేను గ్రహించాను. ఆమె యింకా పదిసార్లు వాంతులు చేసుకుని నిద్రపోయింది. ఆమె ఏ మాత్రం ఏడవలేదు. నేను ఆమెకు అర్ధరాత్రి సమయంలో యివ్వటం వలన ఆమెకు ఏదో జరిగిందని భయపడ్డాను. ఆ మరునాడు ఆమె లేచి చాలా ఉల్లాసంగా కనపడింది. నేను ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ వారికి నమస్కరించగా వారు నువ్వు నా దగ్గరకు రాలేదు కానీ నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేశావు.

నా వ్యాపరంలో నష్టం వచ్చినా కూడా శ్రీ స్వామీజీ వారు నా వ్యాపార స్ధలానికి వచ్చారు. వారు నువ్వు చాలా పెద్ద ప్రదర్శన యిస్తున్నావు అని అన్నారు. నష్టాలు విపరీతంగా రావడంతో రాష్ట్ర ఆర్థిక సంస్థవారు ఆస్తిని వేలం వేస్తామని తెలిపారు. నా వ్యాపార భాగస్వామి నన్ను రాజీనామా చేయమని తను వ్యాపారాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. నేను రాజీనామను నా భాగస్వామికి సమర్పించాను. శ్రీ నారాయణరావు మరి యితర ట్రస్టీలో ఆశ్రమ నిర్మాణంలో పనిచేస్తూ వున్నారు. ఆయమ నన్ను యింత నష్టాన్ని ఎలా భరించారు అని అడిగారు. నేను జరిగేదేదో జరుగుతుంది. జరిగేదాన్ని మనము ఆపలేము కదా అని అన్నాను. ఆ తరువాత నేను పూర్తిగా నిర్మాణ కార్యక్రమాలలో నిమగ్నమయ్యాను.

నేను చిన్న వ్యాపారం చేస్తూ ప్రతీ ఆదివారం నాడు కిచిడీ వండి ప్రసాదంగా అందరికీ పెట్టసాగాను. అప్పుడు శ్రీ స్వామీజీ వారు వచ్చారు. మూడు ఆలయాలు ప్రారంభమయ్యాయి. అకస్మాత్తుగా, నేను వారిని నేను నవగ్రహ మంటపాన్ని నిర్మించవచ్చా అని అడిగాను. దానికి వారు సరే మీరు చేయండి, కానీ నన్ను ఎందుకు అడుగుతున్నారు. అని అన్నారు. దానికి నేను ప్రతీ ఒక్కరు మా అమ్మగారితో సహా అక్కడికి ఎవరయినా వచ్చి ప్రదక్షిణ చేస్తే వారి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పగా విన్నాను అని సమాధానమిచ్చాను. అప్పుడు స్వామీజీ వారు అలా కాదు మీరు వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మూడు ఆలయాల సందర్శన అనంతరు వాళ్లు యిక్కడ పూజ చేసి ప్రదక్షిణలు చేస్తారు. మీకు వారికి పూజ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు అని అన్నారు.

అంతా పూర్తయిన తరువాత శ్రీ స్వామీజీ వారు కుంభాభిషేకానికి వచ్చారు. ఎందుచేతనో కొన్ని మూర్తులను పొరపాటుగా తప్పు స్ధానాలలో స్థాపించారు. రాహు కేతువులకు బదులుగా వారి స్థానంలో వేరే మూర్తులను వుంచారు. ఆశ్రమంలో బాగా శ్రద్ధ చూపిన కొందరికి చాలా సమస్యలు రాసాగాయి. ఆ పనులను చేయడానికి ఎవరైతో బాధ్యతను తీసుకున్నారో వారికి విపరీతమయిన సమస్యలు కలిగాయి.

యింతలో నా కుటుంబానికి ఒక దారి కనుగొనాలని నేను శ్రీ స్వామీజీ వారితో నా స్నేహితులు ఒకరు నాకు సహాయం చేస్తానని అంటున్నారు ఆ సహాయాన్ని అందుకోవచ్చునా అని అడిగాను. సరే నేను నవగ్రహమూర్తులని నిర్మూలించి పునర్నిర్మాణం చేయమని చెప్పాను. బాధపడవద్దు మీరు మీ వంతు చేశారు. వేరే వాళ్ళు మిగతా పనిని చేస్తారు. కనీసం ఆలయాలలో కూడా ఏదీ శాశ్వతం కాదు అని అన్నారు.

నేను వారిని వేరే కంపెనీ కొరకు యిస్తున్న దరఖాస్తును ముట్టుకోమని కోరాను. నేను నా యింటర్వ్యూలో ఆ యజమానికి ఏం చెప్పానో తెలియదు కానీ ఆమేనేజింగ్ డైరెక్టరుకు చాలా నచ్చి నేను పెద్ద పొజిషన్ లో వెంటనే చేరాలని కోరాడు. నేను యింటర్వ్యూ ఫలితాలు తెలిసిన అనంతరం, నాకు యిచ్చిన అధికారిక ఉత్తర్వులతో మైసూరు వెళ్లి శ్రీ స్వామీజీ వారిని ఆ ఉత్తర్వులను తాకమని కోరాను.

నేను ఒక నెల ట్రెయినింగు తరువాత విజయవాడలో పని చేయాలని నిర్ధారించారు. ఆ సమయంలో తుఫాను కారణాన విజయవాడ వెళ్ళవలసిన కొన్ని రైళ్ళు పూర్తిగా నిండిపోయి మరికొన్ని రైళ్ళు రద్దయినాయి. అందువలన నేను బస్ లో ప్రయాణం చేశాను. దారిలో ఆ ప్రాంతమంతా తుఫానుకు గురవటంతో వెళ్ళలేకపోయాను. నా పరిస్థితిని చూసి దగ్గరలోని శాఖకు నన్ను పంపారు. అక్కడ చాలామంది సహాయం కోరసాగారు. ఆ యజమాని చాలా ఉత్సాహవంతుడు. అతను నాకు దేవుడంటే నమ్మకం లేదు. ఎవరయినా పేదవాళ్ళు అవస్థలు పడుతున్న వారికి నేను సహాయం చేస్తాను. నేను అతనికి వెయ్యి రూపాయలను యిస్తాను అన్నాడు. నేను నాకు అన్నదానం బాధ్యతను యివ్వండి అని కోరాను.

చాలా మంది, చివరకవ భిక్షగాళ్ళు కూడా వచ్చారు. వారందరికీ మేము ఆహారం పెట్టాము. ఆ యజమాని చాలా సంతృప్తి చెందాడు. అప్పటినుండి అతను నా మీద దయ చూపసాగాడు. నేను వంటసేవను హైదరాబాదు ఆశ్రమంలో ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరం నిమిత్తం చేసేవాఢ్ని. నేను వంట చేస్తూ చాలా సంతోషించే వాడ్ని. ఆ రోజు శ్రీ స్వామీజీ వారు నాతో నీకోసం ఒక జాగా వుంచాను. వెళతావా అని అడిగారు. నేను వెంటనే అలాగే స్వామీజీ అని సమాధానమిచ్చాను. వారు నన్ను ఒక గంట తరువాత పిలుస్తానని చెప్పారు. వారు పిలిచి యికనుండి నీవు నాతోనే వుంటావు అని అన్నారు. నేను మీకు ఏ విధంగా కావాలన్నా నేను సిద్ధంగా వున్నాను అని సమాధానమిచ్చాను.

వారు నడుపళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వున్నది. నీకు ఆ భాష తెలుసును గనుక వారికి మేనేజరు అవసరం. నువ్వు వెళతావా అన్నారు. నేను మీరు నాకు శక్తినివ్వండి మీరు ఎక్కడికి వెళ్లమన్నా వెళతాను అని చెప్పాను. అప్పుడు వారు వంశీ వద్దనుండి అడ్రసు తీసుకోమన్నారు. అరగంట అనంతరం వంశీ నాతోటి శ్రీస్వామీజీ వారే నన్ను స్వయంగా నడుపళని తీసుకుని వెళతారని అందువలన నేను బెంగళూరు వెళ్లాలని చెప్పారు. వేరొక స్వామి ఆ ఆలయాన్ని నిర్మించారని వారు ఆసుపత్రిలో కోమాలో వుండడం వలన వారు స్వామీజీ వారీని ఆ ఆలయ నిర్వహణ చూడవలసిందిగా కోరారు.

శ్రీ స్వామీజీ వారు వారి చెవిలో ఏదో మంత్రమో మరేదో చెప్పగా వారు లేచి కూర్చోవడం నేను చూశాను. అప్పుడు శ్రీ స్వామీజీ వారితో మీకు మేనేజరు కావాలనుకున్నారు కదా యితనికి చాలా అనుభవం వున్నది అతను యిక్కడికి వచ్చాడు అని అన్నారు. వారు సరే అని అన్నారు. అప్పుడు స్వామీజీ వారు వారి పాదాలను తాకమని చెప్పారు. నేను వారికి నమస్కరిస్తూ దత్తా అని అన్నాను. నా గురువు దత్తుడు కనుక నేను ఎవరినయిననా కలిసినప్పుడు వారు ముందు నమస్కరిస్తూ నేను దత్త అని అనాలి అని అనుకున్నాను. నేను నిద్రలేవగానే దత్త అని అంటాను.

ఆ తరువాత వారు నన్ను నడుపళని తీసుకుని వెళుతూ దారిలో ఈ ప్రదేశానికి నువ్వు కొత్త అవడం చేత అక్కడ చాలా క్లిష్టమయిన పరిస్థితులను ఎదుర్కొన వలసి వుంటుందని, ఎవరూ నీకు మద్దతుగా వుండరు. నువ్వు ఒంటరిగా అన్నీ చూసుకోవాలి అని నాకు తెలియ చేయసాగారు. అక్కడ దాదాపు యిరవై అయిదు ఎకరాల స్థలం దాదాపు అడవి లాగా వున్నది. నేను నా భార్యను, మా అబ్బాయిని, అమ్మాయిని తీసుకుని రావడానికి తిరిగి వెళ్ళాను. నేను నా యజమానికి నా వుద్యోగం నుండి రాజీనామా చేస్తున్నాననీ, నాకు వేరే చేయవలసిన పని వున్నదని తెలిపాను. ఆయన ఆ యితరమయిన పని ఏమిటి అని అడిగారు. శ్రీ స్వామీజీ వారు నాకు వుద్యోగం వదిలి వారి దగ్గరకు వెళ్లడం అంత సులభం కాదని చెప్పారు. మా యజమాని నేను వెళ్ళడానికి యిష్టపడలేదు. అప్పుడు నేను అతనికి నేనూ మిమ్మల్ని వదలి వెళ్ళలేను. నేను మీతో వుండలేను. వారు చెప్పినది జరిగి తీరుతుంది. నాకు కొన్ని సమస్యలున్నాయి అందువలన శ్రీ స్వామీజీ వారు నన్ను అక్కడకి వెళ్లి వుండమని చెప్పారు. అని అన్నాను.

ఆ రోజున నేను అక్కడనుండి కొత్త ప్రదేశానికి చేరాను. యిక్కడ వున్న భక్తులు చాలా బీద వాళ్లు. వాళ్ళు డబ్బు విషయంలో నన్ను అనుమానించసాగారు. వాళ్లు ఆసుపత్రిలో వున్న వాళ్ల స్వామికి నా మీద కొన్ని కథలను అల్లి చెప్పారు. వారు వాళ్లకి నేను రెండు నెలలో తిరిగి వస్తాను. ఆ తరువాత మీరు వెళ్లవద్దు అని అన్నారు. అప్పుడు నేను వారికి శ్రీ స్వామీజీ వారు నన్ను యిక్కడ నుండి వెళ్లవద్దని చెప్పారు. ఏమయినా సరే నేను యిక్కడనుండి వెళ్ళను, నేను యిప్పుడు వెళ్లలేను అని చెప్పాను. అప్పుడు ఆయన శ్రీస్వామీజీ వారు ఏం చెబితే అది మీరు తప్పక చెయ్యాలి అని అన్నారు.

శ్రీ స్వామీజీ వారు భారతదేశంలో లేని కారణాన వారికి సమాచారం అందింది. దానికి సమాధానమిచ్చారు. ప్రసాదు గారు నన్ను స్వామీజీ వారు వచ్చే ఒకరోజు ముందుగా మైసూరుకు రావాలనీ నేను వెంటనే అక్కడినుండి తిరిగి రావాలని స్వామీజీ వారు తెలిపారని చెప్పారు. నేను అక్కడి వారందరికీ స్వామీజీ వారు నన్ను రమ్మన్నారు గనుక నేను తిరిగి వెళ్లిపోతున్నాను. నా కుటుంబానికి ఏమైనా జరిగితే అది చాలా ప్రమాదకరంగా వుంటుంది అని చెప్పాను. మైసూరులో శ్రీ స్వామీజీ వారు నాతో వచ్చావా, యిక్కడ కొన్ని రోజులు వుండు. నేను నీతో మాట్లాడతాను అని అన్నారు. ట్రస్టీలు కూడా నన్ను కలిశారు. నిజానికి సుబ్రహ్మణ్య స్వామీ నా యిష్ట దైవం. నేను వారిని పూజిస్తాను. శ్రీ స్వామీజీ ట్రస్టీలను నన్ను పిలిచి యితను అచ్చెరపాకంలో కొన్ని నెలలు వుంటాడు. నీకు తెలుసా నీవు ఎక్కడికి వెళ్లాలో నీవు వెళ్లవచ్చు అని అన్నారు.

అచ్చెరపాకంలో ఆలయం వెనుక ఒక పెద్ద కొండ వున్నది. ప్రతీ ఉదయం భక్తులు అక్కడకి వచ్చి భజనలు చేసి ఒక ప్రదక్షిణ చేసేవారు. అది ఏడుగంటల సమయం పట్టేది.ఒకరోజున నేను అన్న ప్రసాదం చేశాను. ఆ రోజున ఎక్కువ మంది భక్తులు రాలేదు. ఆ కారణంగా ఒక పాత్ర నిండుగా వుండిపోయింది. నేను అందులో కొంత ఒక పళ్లెంలో చెంచాతో పాటుగా శ్రీ స్వామీజీ వారి ఫోటో వద్ద నివేదించాను. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11.30 వరకు నేను అయిదు సార్లు లేచి చూడగా ప్రసాదం అలాగే వున్నది. కానీ మరునాడు ఉదయం అయిదు గంటలకు మాత్రం ప్రసాదం పూర్తిగా మాయం అయింది. ఎవ్వరూ రాలేదు కాని ప్రసాదం మాత్రం పూర్తయిపోయింది. శ్రీ స్వామీజీ వారు ఆది దేవత దత్తుడు అక్కడ వున్నాడు. ఎవరయిన వస్తారు భక్తులు మాత్రం వారిని చూడడానికి ప్రయత్నించరాదు. ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతమని తెలిపారు.

డిసెంబరు 31, 1999న వంశీ నన్ను పిలిచి నేను మైసూరుకు రావాలని తెలిపారు. శ్రీ స్వామీజీ వారు పర్యటనలకై వెళ్ళారు వారు రెండు నెలలో తిరిగి వస్తారు అందువలన మీకు దత్త ఆలయంలో పని వుంటుంది అని చెప్పారు. నేను దత్త ఆలయంలో పురోహితులయిన శ్రీ రామశాస్త్రి సహాయం చేయడం మొదలు పెట్టాను. నేను చేయగలిగినది చేశాను. అప్పుడు శ్రీ స్వామీజీ వారు తిరిగి వచ్చి అకౌంట్సు డిపార్ట్మెంటుకు వెళ్లు నీకోసం చాలా పని వున్నది అని చెప్పారు.

కొద్ది రోజుల అనంతరు నాకు విజయవాడ ఆశ్రమం సరిగా లేదని అక్కడ మేనేజరు అవసరమని సమాచారాన్ని యిచ్చారు. అక్కడ సమస్య ఏమిటంటే వాళ్ళు బ్రాహ్మణులను అసలు యిష్టపడేవారు కాదు. శ్రీ స్వామీజీ వారు నాతో ఒకవేళ నీవు అక్కడకి నిర్వాహకుడిగా వెళితే నీవు కూడా యిబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ అక్కడ నడుపళనిలో వున్నంతగా యిబ్బందులు వుండవు అన్నారు. జనవరి 2001లో శ్రీ స్వామీజీ వారు నన్ను పిలిచు నన్ను కారులో వెళ్లమని వారు విమానంలో వస్తున్నానని చెప్పారు. మేము అక్కడికి వెళ్లేసరికి వారు ప్రతి ఒక్కరినీ పిలిచి యితను నా మనిషి. నేను యితన్ని యిక్కడ మేనేజరుగా నియమిస్తున్నాను. అతను చెప్పినదంతా మీరు చేయాలి. ఒకవేళ ఏమయినా సమస్యలుంటే నాకు తెలియజేయండి. ఏదేమయినా వాళ్లు చెప్పేకన్నా, నేనే ప్రసాద్ గారికి ఫోన్ చేసి యిక్కడి వాళ్ళు నడుపళనిలోని వారికన్న దారుణంగా వున్నారని, వారు అప్పాజీ చెప్పేది అర్ధం చేసుకోరు అని చెప్పాను.

విజయవాడలో నా మొదటి పని అక్కడి వారికి అవగాహనను కలిపించడం. శ్రీ స్వామీజీ వారు నాతోటి నువ్వు చెడ్డవాడిగా ప్రవర్తించినా నేనేం పట్టించుకోను. నువ్వు వేరే అవ్వచ్చు కానీ వాళ్ళు విడిపోకూడదు. ఎలా నిర్వహిస్తావో నీకే వదిలేస్తాను అని చెప్పారు. వారితో మాట్లాడుతూ నేను శ్రీ స్వామీజీ వారికి కావలసినది ఒక్కటే, వాళ్లంతా నాతో సహకరించాలి, మేనేజరుతో చెప్పకుండా వారికి యిష్టం వచ్చినట్లు చేయకూడదు. వాళ్లంతా టేప్ చేసిన సందేశాన్ని శ్రీ స్వామీజీ వారికి పంపుతూ వారికి శ్రీ స్వామీజీ వారి స్పందన యొక్క నిరూపణ కావలసి వచ్చింది. వారికి సమాధానం వచ్చినప్పుడు వాళ్లంతా సహకరించడానికి ఒప్పుకున్నారు.

మూడునెలలు గడిచిన తరువాత అన్ని రకాల కార్యక్రమాలు జరగసాగాయి. నేను కొన్ని మంచి కార్యక్రమాలను పరిచయం చేశాను. హోమాలు, మరియు వివిధ రకాల పూజలు వంటివి. విజయవాడలోని ప్రజలు నన్ను అర్హత వున్నందున అంగీకరించారు. నేను కార్యక్రమాలను కొనసాగించాను. నేను అక్కడ మేనేజరుగా ఎనిమిది సంవత్సరాల పాటూ వున్నాను. ఆ తరువాత నాకు కిడ్నీ మరియు రక్తపోటు, న్యూరోపతి మరియు మధుమేహం వంటి సమస్యలు వచ్చాయి.

నేను అక్కడ వున్న సమయంలో నాపర్యవేక్షణలో మరకత రాజ రాజేశ్వరి ఆలయన నిర్మాణం జరిగింది. కళ్యాణమంటపం మరమ్మత్తులు జరిగాయి. పూజారి క్వార్టర్సు నిర్మాణం అయ్యాయి. నా మనసు అదుపు తప్పి ప్రతి ఒక్కరిపై పని జరగడానికి అరవసాగాను. నా భార్య కూడా అక్కడ లేదు. అప్పుడు శ్రీ స్వామీజీ వారు కొంత సమయం నీవు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. అందువలన జూన్ 16, 2009 లో నేను విజయవాడ నుండి వెనుదిరిగి వచ్చాను. మా అబ్బాయి హైదరాబాదులో వున్నాడు. అతను శ్రీ స్వామీజీ వారిని నా బాగోగులను గురించి చూసుకోవలసిందని కోరాడు. అప్పుడు శ్రీ స్వామీజీ వారు అతను నా కుమారుడు అని చెప్పారు. శ్రీ స్వామీజీ వారు నాతో వారికి నన్ను ఎప్పుడు తిరిగి పిలవాలో వారికి తెలుసుననీ అంత వరకు సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకోవలసినదని అన్నారు.

ఆధ్యాత్మిక విషయానికి వస్తే, నేను విజయవాడలో ఎగ్జిక్యూటివ్ మెంబరుగా వున్నప్పుడు ప్రజలు పూజల కొరకు ఏ విధంగా డబ్బులు కట్టాలని అడిగేవారు. ఆ మరునాడు శ్రీ స్వామీజీ వారు నాకు కలలో ఒక సాధువు రూపంలో కనిపింటి “భవతి భిక్షాందేహి” అని అన్నారు. నా భార్య నన్ను పిలిచి ఎవరో వచ్చారు. వారెవరో చూడండి అని చెప్పంది. తను బయటకు పిలిచి శ్రీ స్వామీజీ వారు వచ్చారని తెలిపింది. నేను నా కలలో లేచి నా పూజాదికాలు ముగించుకున్నాను. ఆ తరువాత శ్రీ స్వామీజీ వారిని చూసి వారికి నమస్కరించాను. వారు వారి చేతులను నా భుజాలపై వుంచి రా నేను చెబుతాను అని అన్నారు. వారు ఏదో చదవసాగారు నాకు అది గుర్తులేదు. కానీ వారు నా దగ్గర డబ్బు వున్నా లేకపోయినా వారు నా దగ్గరకు వస్తానని, నేను ఈ విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. వారు నాకు యితరులు డబ్బు కట్టి పాద పూజకై వేచి వుంటారని, కాని నేను డబ్బు కట్టనవసరం లేదని నాకు అవసరమయినప్పుడు వారు వస్తారనీ. “ఏమీ కట్టకుండానే నేను నీ దగ్గరకు వస్తాను. ఇది గుర్తుంచుకో"అని నాకు చూపించారు.

జయ గురు దత్త

Tags: