SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
కె.యి.వి. రాజేంద్రప్రసాద్ మరియు కొల్లి రమాదేవి, విజయవాడ (K.E.V. Rajendra Prasad and KolliRamadevi)

గురువు యొక్క మార్గాలు వివరించలేనివి. ఆయన మొదట నుండి పుట్టినప్పటి నుండి మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటారు అని నేను యిప్పుడు భావిస్తాను. నాకు చెప్పబడిన నా ప్రారంభ అనుభవం; నేను రెండు సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు నేను మా తాతగారి వెనక ప్రాకుతుండగా ఒక ప్రక్క ప్రవాహంలో పడిపోయాను. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఆసుపత్రులలో ఏ ఐ.సి.యులు, వెంటిలేటరుల లేదా ఏవైనా సరైన పరికరాలు లేవు. నేను పదిరొజుల పాటు కోమాలు ఉన్నాను. స్పృహలోకి వచ్చిన తరువాత నాకు ఇంజెక్షన్ యిచ్చారు. కానీ సూది తొలగించేలోపే నేను మళ్ళీ పదిరోజులపాటు కోమాలోకి వెళ్ళడం జరిగింది.

డిసెంబరు 1969లో నేను తొమ్మిది సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు, నా తల్లిదండ్రులతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని కలుసుకున్నాను. ఆ తరువాత నేను, వారి పట్ల ఆకర్షితుడనయ్యాను. అన్ని మంత్రాల ప్రవాహం యొక్క మూలం వారే అనే స్ఫూర్తి నాకు కలిగింది. దీని కారణంగా నేను ‘ఓం నమఃశివాయ’ అని నిరంతరం ఆ వయస్సునుండే పఠించడం మొదలుపెట్టాను. సమయం గడిచేకొద్దీ నేను వారితో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాను. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను వారిని చూడవచ్చును. వారితో గడిపిన ఆ రోజులు అద్భుతమైనవి.

నాకు సుమారు పదమూడు సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు మైసూరు ఆశ్రమం సందర్శించినపుడు, శ్రీ స్వామీజీ ఆశ్రమ బహిరంగ ప్రదేశాలలో, యితర పిల్లలతో పాటూ నాకూ డ్రయివింగ్ చేయడం నేర్పించారు. కొన్ని సార్లు మమ్మల్ని ఆశ్రమం నుండి బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు నేను నిద్రపోయేవాడిని. మేము తిరిగి వచ్చిన అనంతరం చాలా చక్కగా నిద్రపోయావు అని చాలా సాధారణంగా చెప్పేవారు. వారు చేయవలసిన పని చేసేసేవారు.

కొన్నిసార్లు కేవలం మేమిద్దరమే చాముండి కొండకు వేళ్లేవాళ్లము. ఆలయ ప్రధాన ప్రవేశం ముందు కారు ఆపేసి నన్ను త్వరగా దర్శనం చేసుకుని రమ్మనేవారు. నేను వారిని నాతో పాటుగా రమ్మని అడుగగా వారు ‘‘యోగిగా నేను ఆలయంలోకి ఆహ్వానింపబడాలి. సాధువులు కొన్ని నియమాలను అనుసరించ వలసి వుంటుంది. నీవు త్వరగా వెళ్ళి దర్శనం చేసుకుని రా’’ అని తెలిపారు. నేను వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తరువాత యిద్దరం వెనుదిరిగి వచ్చేవాళ్లము. చాలా కాలం తరువాత నేను మైసూరు మెడికల్ కాలేజీలో ప్రవేశ పరీక్ష వ్రాశాను. కానీ నాకు సీటు దొరుకుతుందని నమ్మకం లేదు. నాకు సీటు దొరికింది. ఆశ్రమం నుండి మెడికల్ కాలేజీలో చేరిన మొట్టమొదటి బాలుణ్ణి నేను.

నాకు పదహారు సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు, జ్వరం ఎక్కువగా వుండడంతో నా శరీరంలో ఒక వైపున ఫిట్స్ వచ్చాయి. మలేరియా వ్యాధి అని నిర్ధారణ అయినది. నా తల్లిదండ్రులు యింట్లో లేనందున నాకు ఏమి చేయాలో తోచలేదు. నేను లేవడానికి ప్రయత్నం చేశాను. నాకు చాలా నెప్పిగా అనిపించింది. కొద్ది క్షణాల అనంతరం, ఏదో మార్పు జరిగింది. నేను ఎత్తునుండి కిందనున్న నా శరీరం వైపుకు చూశాను. నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కొద్దిసేపటి తరువాత నేను శరీరంలోకి వెనుదిరిగి ప్రవేశించాను. నా శరీరం తీవ్రంగా వణుకుతున్నది. నేను నా తల్లిదండ్రులను చూశాను. మా నాన్నగారు ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన స్వామీజీ వారికి ఫోన్లో నా పరిస్థితిని గురించి చెబుతున్నారన్న విషయం నాకు అర్ధం అయింది. ఆయన స్వామీజీ వారిని నా పరిస్థితిని మరియు వ్యాధినిరూపణ గురించి తెలుపగా స్వామీజీ వారు ఆందోళన చెందవద్దని తాను వున్నానని తెలిపారు. నాకు వైద్యం నిమిత్తం ఒక డాక్టరును పిలిపించారు. ఆయన వైద్యం చేయగా నాకు ఫిట్స్ తగ్గాయి. కొన్ని నెలల తరువాత మేము మైసూరు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నా అనారోగ్యం సంగతి విన్న వెంటనే స్వామీజీ వారు కొద్దిమంది భక్తులను భజనలు చేయమని చెప్పి వారు ధ్యానంలోకి వెళ్ళారన్న విషయం మాకు అక్కడ తెలిసింది. నేను డాక్టరునయిన పిదప నాకు సెరిబ్రల్ మలేరియా వచ్చిందని, అప్పుడు ఆ వ్యాధి పరీక్షింపబడలేదు.

మెడికల్ స్కూలులో నేను మూడు సంవత్సరాలు చదువు కొనసాగిస్తున్నప్పుడు నేను అక్కడి ఫేకల్టి ఎన్నికలలో పోటీ చేశాను. 1977-79లో నేను ఆశ్రమానికి వెళ్ళి శ్రీ స్వామీజీ వారిని నాకోసం శివాభిషేకం చేయమని కోరాను. ఏదయినా కోర్కెను నెరవేర్చుకోవాలంటే దానిని మంచి సమయంలో కోరుకోవాలన్న విషయం తెలుసును కనుక, నాకు ఆ ఎన్నికలలో గెలవాలనే కోరిక వుండడంతో అభిషేకం జరగడం చేత నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. నా చదువు ఆఖరి సంవత్సరంలో కూడా పోటీ చేశాను. ఒకరోజు కొద్దిమంది విద్యార్ధులతో కూడిన గుంపు నన్ను చుట్టుముట్టి ఎన్నికల గురించి నన్ను ప్రశ్నించసాగారు. అప్పుడు అటుగా ప్రిన్సిపాల్తో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అక్కడ పర్యవేక్షణ నిమిత్తమై వచ్చారు. ఆ గుంపు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ గుంపుకు నా పై దాడిచేయమని డబ్బులు యిచ్చి ఏర్పాటు చేసిన కిరాయి మూకలనీ, పోలీసు వారి రాకతో వారు ఏం చేయలేకపోయారని నాకు తరువాత తెలిసింది.

అప్పుడు నాకు గురు శిష్యుల మధ్యన గల అనుబంధం బోధపడింది. గురువుతో అనుబంధం కలిగిన శిష్యుడు ఎల్లప్పుడూ యీ జన్మలోనే కాక గతంలో, మరియు రాబోవు జన్మలలో కూడా గురువు యొక్క సంరక్షణ కలిగి వుంటాడు. వారి దృష్టి ఎల్లప్పుడూ వారి శిష్యులపై వుండి వారికి సమీపంలో గానీ, దూరాన వున్నా వారిని కాపాడుతూనే వుంటారు. వారి మార్గాలను వూహించలేము మరియు అంచనా వేయలేము. వారు మన పనికిమాలని ఆలోచనలపైననే గాక, మన భీతికర ప్రయాణాలపై కూడా శ్రద్ధ వహిస్తారు.

యువకుడిగా వారు అనేక విధాలుగా నాకు బోధించారు. ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రసంగాల ద్వారా, మానసిక సాంగత్యం ద్వారా మరియు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చేసేటప్పుడు కూడా. కొందరు బంధువులు అరవై లేదా అంతకు పైబడ్డ వయస్సు వున్న భక్తులు ఈ పర్యటనలు చేస్తారని సూచించారు. శ్రీ స్వామీజీ వారు శరీరం ఆరోగ్యకరంగా వున్నప్పుడే యీ పనులను చేయాలని తెలిపారు. శరీరం వృద్ధాప్యం మరియు వ్యాధికి గురయ్యే వరకు వేచి వుండకూడదు. యువకుడిగా వున్నప్పడు సాధన మరియు ఆధ్యాత్మిక అభ్యాసం చేయాలని అన్నారు.

నా ఆశ్రమ జీవితం సమయంలో, నేను వివాహం చేసుకోవాలనుకోవట్లేదని శ్రీ స్వామీజీతో చెప్పాను. ఈ విధంగా ఉండడం నాకు సంతోషంగా వుందని తెలిపాను. వారు ఆ మాటలకు ప్రతిస్పందిస్తూ ‘‘మీరు ఈ విధంగా సంతోషంగా వుండవచ్చు, కానీ మీ జీవితంలో ఎప్పుడయినా, ఏదో కోల్పోయానని అనుకున్నా, ఒక క్షణకాలమయినా వివాహం చేసుకుని వుండాలనే ఆలోచన వచ్చినా, మీరు వివాహం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆలోచన, మాటలు చేసే పనులు స్ఫటికం వలే స్వచ్ఛంగా వుండాలి’’ అని తెలిపారు.

నా తల్లిదండ్రులు శ్రీ స్వామీజీ వారికి రమాదేవి అనే ఒక యువతి ఫోటోను నా వివాహ విషయమై ఎంపిక చేసుకుని చూపించారు. స్వామీజీ వారు ఆ ఫోటోను తమ పూజా పెట్టెలో ఒక సంవత్సరం పాటు ఉంచారు. ఒకరోజు వారు ఆ ఫోటోను బయటకు తీసి ’’ఈ అమ్మాయి ఎవరు?’’ అని అడిగారు. మా అమ్మగారు నా కోసం ఎంపిక చేసిన అమ్మాయి అని తెలిపారు. వారు ఆమోదించి ఆ అమ్మాయిని తన వద్దకు తీసుకుని రావాలని అడిగారు. వారు ఆమెతో యిలా చెప్పారు. ’’మీరు ఆశ్రమానికి అనుసంధానించబడిన యితని కార్యకలాపాలను నిలిపి వేయాలని అనుకుంటే అప్పుడు మళ్లీ ఆలోచించండి లేదా మేము వేరే అమ్మాయిని వెతుకుతాము’’ అని అన్నారు

రమాదేవి కూడా ప్రసూతి సంబంధ వైద్య నిపుణురాలు. వివాహ అనంతరం మేము మా స్వంత ప్రాక్టీసు ఏర్పాటు చేసుకున్నాము. నేను మధుమేహ రోగులకు, ఆమె సంతానం లేని మహిళలకు వైద్యం చేసేవారము. మా ఆలోచనలన్నీ బాధలనుండి ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించాలా అనే. మేము రోజుకు పదహారు గంటలు, వారానికి ఏడు రోజులు పని చేశాము. నాలుగు సంవత్సరాలు మేము ఈ విధంగా కష్టపడి పనిచేశాము. ఆ సమయంలో మాకు యిద్దరు పిల్లలు కూడా పుట్టారు.

1992లో ఒకరోజున మేము ఆశ్రమంలో వున్నప్పుడు శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని పిలిపించి వీలైనంత త్వరగా మమ్మల్ని విజయవాడను వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్లవలసినదిగా చెప్పారు. మా ప్రాక్టీసు బాగా జరుగుతున్నందున, మా ధనార్జనకూడా అధికంగా వుండడం వలన మేము కొద్దిగా ఈ విషయమై వెనుకంజ వేశాము. నేను వారి మాటలకు నా అభ్యంతరం తెలుపుతూ స్వామీజీ మేము యిక్కడ బాగా స్థిరపడిపోయాము. మేము వేరే చోటికి ఎలా మారగలము? మేము మళ్ళీ అక్కడ స్థిరపడాలంటే కనీసం అయిదు సంవత్సరాలు పడుతుంది అని తెలిపాను. అప్పుడు వారు ఆ పని చేయకపోతే మీరు వున్న యింటి నుండి వేరొక యింటికి మారండి అని తెలిపారు. మళ్లీ నేను ‘‘లేదు స్వామీజీ అది కూడా కష్టమే, నేను నా పై ఆధారపడి వున్న నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాను అని అభ్యంతరం తెలిపాను.

చివరకు వారు సరే కనీసం మీ ఆసుపత్రిని మార్చండి అని చెప్పారు. నేను చాలా మొండిగా అది కూడా కుదరదని సమాధానం తెలిపాను. అప్పుడు వారు ‘‘మీకు ఏమి జరుగుతుందో తెలియదు. మీరు సమాజం నుండి తొలగింపబడ్డామని తొంభై ఎనిమిదవ సంవత్సరంలోపల ఒకరోజు నా దగ్గరకు వచ్చి వేడుకుంటారు. అప్పుడు స్వామీజీ వారు మీకు సహాయపడతారు’’ అని తెలిపారు. దానికి నేను స్వామీజీ నేను మిమ్మల్ని అడగడానికి తగిన స్వేచ్ఛను కలిగి వున్నాను అని మోటుగా సమాధానమిచ్చాను.

ఆ సమయంలో సంతాన లేమి కలిగిన వారు మా దగ్గరకు చికిత్సకై వచ్చేవారు. రమాదేవి యొక్క చికిత్స విజయాలు భారీ స్థాయి లో రికార్డులందుకున్నాయి. ఆమెకు విజయవాడ మరియు చుట్టు పక్కల జిల్లాలో మంచి పేరు వచ్చింది. సఫలీకృతులయిన యితర రోగులు వారి బంధువులకు, స్నేహితులకు రమాదేవిని సంప్రదించమని సూచించేవారు.

ఒకరోజు యిద్దరు మహిళా రోగులు చికిత్స నిమిత్తం మా వద్దకు వచ్చారు. వారు విజయవంతంగా చికిత్స జరిపించుకున్నారు. వారికి గర్భనిర్ధారణ కూడా జరిగింది. ఆ యిద్దరు తరువాత వారి పిండ విచ్చిత్తి గావించుకుని, నగరంలో యితర వైద్యలు సహాయంతో మాకు అపనిందలు తేవాలనే ఉద్దేశ్యంతో యిలా చేశారని తెలిసింది. గర్భస్రావాలు జరిగాయని ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మా ఆచరణ బోగస్ అని వారు వాదించి మాపై దుష్ప్రవర్తన దావా వేశారు.

మేము మా దావను లోయర్ కోర్టులలో కోల్పోయి, తరువాత మళ్లీ హైకోర్టులో వేశాము 2004లో హైదరాబాదులోని న్యాయస్థానంలో అప్పీల్స్ కోర్టులో దాఖలు చేశాము. విచారణ సమయంలో శ్రీ అప్పాజీ వారు వారి పర్యటనను కుదించుకుని హైదరాబాదుకు వచ్చారు. వారు ఉపవాసం వలన ఆహారం తీసుకోకపోవటం వలన చిరాకుపడుతున్నారు. వారు అప్పుడు ’’సరే యిది యిప్పటికే జరిగిపోయింది. దాని గురించి మర్చిపోండి’’ అని తెలిపారు. యిది చాలా కష్టమైన విషయం, పోలీసులకు కూడా వారు గర్భస్రావాలకు పాల్పడ్డారని తెలుసు, కానీ నిరూపింపబడలేదు.

అప్పీలు సమయంలో రమాదేవికి శ్రీ స్వామీజీ కూర్చొని ఉన్నట్లు గోచరమైనది. శ్రీ బాలస్వామీజీ ఈ సారి గెలుస్తామని తెలిపారు. రమాదేవి సంపూర్ణ యోగ్యతతో మరియు విశ్వాసంతో రెండు వైపుల వాదనలను వింటున్నది. ఈ రోగులు మాకు చాలా అన్యాయం చేశారని ఆమె నమ్మకం. ఆమె కదలిక లేకుండా కూర్చున్నది. తీర్పు మాకు అనుకూలంగా వచ్చినప్పుడు ఆమె సంతోషించింది. గురువు యొక్క మాటలు మరియు విశ్వవ్యాపక ఉనికి ఆమెకు సదా నిజమని, ఆమె ప్రతీకారతను సూచిస్తుందని ఆమెకు తెలుసు. మొదటి రెండు కోర్టులలో మాకు ఏ విధమయిన హామీలేదు. కానీ ఈ సారి ప్రతిదీ మాకు అనుకూలంగా జరిగింది మేము నిర్దోషులమని నిరూపితమైనది.

ఈ విధంగా గురువు మీ కర్మను ఎదుర్కోవటానికి మీకు అనుమతినిస్తారు. చిన్నపాటి అసూయ, మరియు రాజకీయ జోక్యం మా కీర్తిని అపవిత్రం చేయడానికి ప్రయత్నం జరిగిందని వారికి తెలుసు. అందుచేత మేము పన్నెండు సంవత్సరముల అనిశ్చితి మరియు హీనదశను అనుభవించేలా చేసారు. చివరకు స్వామీజీ వారు మా కష్టాల అగాధం నుండి మమ్మల్ని ఎత్తి, మమ్మల్ని సరిచేశారు. మేము మానసికంగా, సామాజికంగా మరియు ఆర్ధికపరంగా చాలా కోల్పోయాము కానీ ఆధ్యాత్మికంగా మేము చాలా అభివృద్ధి చెందాము.

శ్రీ స్వామీజీ వారు నన్ను ఆ ప్రదేశాన్ని, యింటిని, ఆసుపత్రిని విడిచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళమని చెప్పినా, నేను ప్రతి విషయంలో అభ్యంతరం తెలిపినా, వారు నన్ను కోప్పడలేదు. లేదా నన్ను వెంబడించ లేదు. వారు నా చేతులను మరింత గట్టిగా పట్టుకున్నారు. నా యీ విజయం, నా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం అవుతుందని వారు ఆ విజయాన్ని కట్టడి చేశారు. యిప్పుడు నా జీవితంలో ఒక సాధారణ జీవన శైలిని కలిగివుండి యిప్పటికీ నేను కోరుకున్నట్లుగా ప్రజలకు సేవ చేస్తున్నాను.

పునర్విమర్శ చేసుకుంటే, స్వామీజీ వారు బాల్యం నుండి నా గురించి శ్రద్ధ తీసుకుంటూనే వున్నారు. నాకు వివిధ మార్గాలను బోధించారు. నేను చేసిన ఒక వెఱ్ఱి తప్పును సరిదిద్దుకోవాడానికి ప్రయత్నం చేస్తూ పన్నెండు సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాను. వారు నన్ను ఎప్పుడూ వదలిపెట్టలేదు. వాస్తవానికి వారు నాతో పాటు నిలబడ్డారు. నా జీవితంలోని అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకున్నారు. నేను 1970 నుండి వారి ప్రత్యక్ష ఉనికిలో వున్నా కూడా ఈ మహాత్ముని యొక్క లక్షణాన్ని వివరించలేను. యిప్పటికీ కనుగొనే ప్రయత్నంలోనే నేను వున్నాను.

మరణానికి చేరువ అయిన సందర్భంలో నాకు శరీరము మరియు ఆత్మ భిన్నమనే అనుభవం తెలిసింది. నేను చిన్నప్పటినుండి ఓం నమఃశివాయ నిరంతరం పఠన చేస్తూండడం వలన నాకు ఆధ్యాత్మిక ఆలోచనలను నిశ్శబ్దంగా నేర్పించారు. నేను ఆధ్యాత్మిక పరంగా లబ్ధిని పొందినప్పటికీ వాటిని వ్యక్తపరిచే అధికారం లేనందున వ్యక్త పరచలేను. నేను ఈ భావాలను నా భార్యాపిల్లలకు గానీ మా తల్లితండ్రులతో గానీ ఎన్నడూ వెల్లడి చేయలేదు. కానీ యిప్పుడు ఎవరయినా దీనినుండి నేర్చుకోగలిగితే నా ఉద్దేశ్యం నెరవేరుతుందని అనుకుంటున్నాను. తన భక్తులకు మార్గదర్శకం కోసము స్వామీజీ వారు ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు. అది వారికి మాత్రమే తెలుసును.

శ్రీ గురుదత్త

Tags: