1970 సంవత్సరంలో మొట్టమొదట శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ప్రతిబింబిచే దివ్యత్వ దర్శన భాగ్యం నాకు కలిగింది. నేను విజయవాడకు చెందిన నా బంధువయిన కీ.శే.శివన్ కు ఋణపడి వుంటాను. ఆయన నా కన్నా వయసులో చాలా సంవత్సరాలు పెద్దవారు. వారికి నాపై పితృపూరిత వాత్సల్యం వుండేది అందువలన మేమిద్దరమూ చాలా సన్నిహితంగా వుండేవాళ్ళము. వృత్తిపరమయిన బలవంతంతో అతనికి క్లబ్బుల అలవాటయి, మాన్పశక్యం కాని మద్యపానానికి బానిస అయినాడు. విజయవాడలో అతనికి శ్రీ స్వామీజీ వారిని కలిసే అవకాశం కలిగి కేవలం శ్రీ స్వామీజీ వారి స్పర్శ మరియూ వారి దీవెనల ద్వారా విచిత్రంగా అతను ఘోరప్రమాదం నుండి రక్షించబడ్డాడు.
నేను ఈ విషయం తెలుసుకుని చాలా సంతోషించాను. అతను నన్ను అతనితో పాటూ మైసూరుకు రావలసిందిగా సూచన చేసినా నేను వెంటనే స్పందించలేదు. కొన్ని నెలల అనంతరం అతను నా దగ్గరకు వచ్చి మైలపూర్ లోని కచ్చేరిరోడ్డు వద్దకు శ్రీ స్వామీజీ వారు సందర్శించనున్నారనీ నన్ను అతనితో పాటూ రమ్మనమని కోరాడు. నేను సంతోషంతో శ్రీ స్వామీజీ వారిని దర్శించుకునేందుకై ఆయనను కచ్చేరి రోడ్డులోని వేంకటాచలం గారి యింటికి తీసుకుని వెళ్ళాను.
అక్కడ కార్యక్రమం ఒక మేడ మీద వున్న ఖాళీప్రదేశంలో టెంట్ వేసి ఏర్పాటు చేశారు. స్వామీజీ వారు ఆలపించిన భజనలు విని మంత్రముగ్ధలమయాము.ఆ తరువాత ఒక్కొక్కరిని స్వామీజీ వారిని కలవడానికి అనుమతించారు. నేను వారి సమీపానికి చేరుకోగానే నేను అయస్కాంతంలాగా ఒక అద్భుత శక్తి నా శరీరంలో ప్రవహించింది. శ్రీస్వామీజీ వారు కేవలం “స్వామీజీ వారిపై విశ్వాసం కలిగి వుండండి” అన్న మాటలు మొదటగా పలికారు. అప్పటినుండి నాకు మైసూరుకు వెళ్లి వారిని దర్శించాలనే బలీయమయిన కోరిక కలిగింది. కొన్ని నెలల తరువాత నా బంధువు వచ్చి నన్ను మైసూరుకు తీసుకుని వెళ్ళారు.
నేను 1971లో మొట్టమొదటిసారిగా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నాను అప్పటి నుండి నేను ఏ ఒక్క ఉత్సవాన్నీ కూడా వదలకుండా హాజరయ్యాను. ఇదంతా స్వామీజీ వారి ఆశీస్సుల వల్లనే జరిగింది. మేము అక్కడికి చేరుకున్నప్పడు ఆశ్రమంలో అందమయిన మరియు అద్భుత వాతావరణం నెలకొని వున్నది. ప్రేయర్ హాలు మరియు శ్రీస్వామీజీ వారి గది పై కప్పు వెదురుతో నిర్మింపబడి వున్నది. ప్రేయర్ హాల్ గది గోడలు వెదురుతో నిర్మింపబడి వుంది. ఆ ప్రక్కన రెండు గదులు వున్నాయి. శ్రీ చంద్రారావు, చెన్నయ్, విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తి, మరియు మచిలీపట్నానికి చెందిన శ్రీ రాజారావు గార్లతో పాటు వుండడానికి బస యిచ్చారు. అప్పటినుండి నేను ప్రతి కార్రక్రమానికి హాజరవుతూ తరచూ వెళ్ళసాగాను.
అయితే నేను ఎల్లప్పుడు వేచి వుండి శ్రీస్వామీజీ వారితో ఇంటర్వ్యూ తీసుకునేవాడిని, నాకు ప్రత్యేకించి సమస్యలు లేనందున నేను మౌనంగా వుండేవాడిని. సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు సమస్యలు ప్రారంభమయ్యాయి. మొదటిగా నా భార్యకు దీర్ఘకాల అల్సర్ వ్యాధితో బాధపడుతూ వెంటనే శస్త్రచికిత్స అవసరమయింది. నేను శ్రీ స్వామీజీ వారిని శ్రీ చంద్రరావు గారి యింట్లో దర్శనం చేసుకున్నాను. స్వామీజీ వారు మరో మూడు రోజుల తరువాత కలవమని తెలిపారు. నాకు వారిని మరలా కలవడానికి అవకాశం ఎలా దొరుకుతుందా అని కలవరపడసాగాను. సరిగ్గా మూడురోజుల తరువాత శ్రీ స్వామీజీ వారు కచేరీ రోడ్డులోని ఆశ్రమానికి వచ్చారు. నేను ఆ సమయంలో కార్యక్రమల నిమిత్తం బయట వేచి వున్నాను. వారు లోపలకు వెళుతూ నన్ను పిలిచి ఆపరేషన్ చేయించమని “నేను మీతోనే ఉన్నాను” అని తెలిపారు.
కొన్ని సంవత్సరాల తరువాత ఆమె గర్భాశయంలో కంతి బాగా పెరిగినందువలన శస్త్రచికిత్స చేసి తొలగించాలనీ ఆ సర్జన్ శస్త్రచికిత్సకై నాలుగు తేదీలను తెలిపి మమ్నల్ని నిర్ణయించుకోమని తెలిపారు. నేనూ నా భార్య విజయవాడకు శ్రీస్వామీజీ వారిని సంప్రదించటానిరి బయలుదేరాము. మే 3వ తారీఖున మేము ఆశ్రమ ఆవరణలోకి అడుగుపెట్టగానే శ్రీస్వామీజీ వారు గురునిలయం నుండి హాలులోకి వస్తూండడం చూశాము. ఆశ్చర్యకరంగా వారు మా వైపునకు తిరిగి నన్ను రమ్మని సౌంజ్ఞలు చేశారు. నేను సమస్యను వారికి విన్నవించాము. వారు శస్త్రచికిత్స మే 8న చేయించమని తెలిపారు.
ఆ మరునాడు నేను మద్రాసుకు వచ్చి మే 5వ తారీఖున డాక్టరును కలిశాను. డాక్టరుగారిని నేను శాసించలేని కారణాన నేను ఆయనకు ఒక కాగితం మీద నాలుగు తారీఖులను మే 8తో కలిపి వ్రాసి యిచ్చాను. నాకు ఆశ్చర్యం కలగచేస్తూ డాక్టరు గారు తన డయిరీ తీసి వారు మే 8వ తేదీని అంటే స్వామీజీ వారు తెలిపిన తేదీ నాడు ఆపరేషన్ చేస్తానని తెలిపారు. నాకు యింకా ఆశ్చర్యం కలగజేస్తూ ఆసుపత్రి వారు ఆపరేషన్ కోసం ఆ రోజు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. మూడు అవయవాలకు సంబంధించిన క్లిష్టతరమయిన శస్త్రచికిత్స ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా విజయవంతమయింది.
మూడవది, నా భార్యకు విపరీతమయిన చిగుళ్ల సమస్య వచ్చి ఆమె బుగ్గలు వాచిపోయాయి. ఆ సమయంలో నేను ఆఫీసు పని వలన బెంగుళూరులో వున్నాను. వెంటనే ఆపరేషన్ కోసం వెనుదిరిగి వెళ్లాను. అది దాదాపు రాత్రి 8 గంటలకు మొదలయి గంటపాటూ కొనసాగింది. మత్తుమందు ప్రభావం చాలా తక్కువగా వుండడం వలన ఆమె నొప్పిని భరిస్తూ కంట నీరు కారుస్తూ స్వామీజీ వారిని తలచసాగింది. శస్త్రచికిత్స అనంతరం నేను బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయాను. కానీ ఈ సమయంలో శ్రీ స్వామీజీ వారు ఒక భక్తుల యింటిని సందర్శించడానికై చెన్నయ్ రావడంతో నా భార్య మా అమ్మాయితో కలిసి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. ప్రసాదం పంచుతున్న సమయంలో తను ఆ ప్రసాదం తీసుకోలేకపోవడాన్ని శ్రీమతి రామాంజనేయులు గారు, ఆ ఆశ్రమం పి.ఆర్.వో గారి భార్య గమనించారు.
ఆవిడ మా అమ్మాయిని సమస్యను గురించిన వివరాలు అడుగగా మా అమ్మాయి ఆమెకు జరిగినదంతా వివరించింది. ఆమె అన్ని వివరాలను తేదీ, సమయంతో సహా తెలుసుకోసాగారు. మా అమ్మాయి ఆమెకు ఈ వివరాలు ఎందుకో అని మనసులో అనుకుంటూ అన్నీ తెలిపింది. అప్పుడు ఆవిడ సరిగ్గా ఆ సమయంలోనే శ్రీస్వామీజీ వారు విజయవాడలోని హాలులోనికి సాయంత్రం భజనలకై వచ్చి శ్రీ గణేశాయనమః అని మొదలుపెట్టి, వారు పాడలేననీ, ఒక భక్తురాలు అనారోగ్యం వలన తాను బాధపడుతున్నాననీ తెలిపీ భక్తులందరినీ ఒక గంటసేపూ భజనలను ఆలపించమని వారు మౌనంగా కూర్చున్నారు. ఆ సమయంలో ఆమెకు ఆ భక్తులు ఎవరూ అనే ఆలోచన వచ్చింది.
ఆ రోజులలో ఢిల్లీ భక్తులు మైసూరు నుండి తమ ప్రయాణం మధ్యలో చెన్నయ్ లో ఆగి మా యింటికి వచ్చేవారు. ఒక సందర్భంలో శ్రీ పంత్, ఆనాటి ఢిల్లీ సభ ప్రెసిడెంటు, మైసూరు నుండి తిరిగి వెళుతూ నా వద్దకు వచ్చారు. ఆయన ఆ మరునాడు ఢిల్లీ చేరాలని తొందరపడసాగాడు. నేను అతణ్ని మరునాడు వెళ్లమని కోరగా అతను త్వరగా వెళ్లాలనీ స్వామీజీ వారి కేదార్నాథ్, బదరీనాథ్ పర్యటనల ఏర్పాట్లను చూడాలని తెలిపారు. నేను వారితో ఈ విషయం నాకు తెలియదనీ, నాకు కూడా రావడానికి అవకాశం దొరుకుతుందా అని అడిగాను. దానికి అతను అది స్వామీజీ వారు కొద్దిమందిని ఎంపిక చేసి నిర్ణయించారనీ, నన్ను శ్రీ కృష్ణకుమార్ గారిని సంప్రదించవలసినదనీ వారే ఈ ఏర్పాట్లు చూస్తున్నారనీ తెలిపారు.
నేను శ్రీ కృష్ణకుమార్ గారిని కోరిన వెంటనే వారి వద్దనుండి నాకు మరియు నా భార్యకు పాల్గొనడానికి అనుమతి తెలుపుతూ డబ్బులు చెల్లించవలసినదని ఉత్తరం అందింది. ఆ మరునాడే నేను ఆ డబ్బును పంపడం జరిగింది. ఆ వెంటనే శ్రీ స్వామీజీ వారు జన్మదిన వేడుకలు జరిగాయి కానీ నేను వెళ్లలేకపోయాను. ఆ తరువాత మేము ఢిల్లీ యాత్రలలో పాల్గొనడానికి ఢిల్లీ చేరాము. నేను శ్రీ స్వామీజీ వారి అనుమతి లభించిందనుకున్నాను. ఆ మరునాడు శ్రీ స్వామీజీ వారు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ హాలులో శ్రీస్వామీజీ వారికి స్వాగత సభ ఏర్పాటయింది. అక్కడ క్యూలో వారిని దర్శించేందుకు అనుమతినిచ్చారు. నేను వారికి వంగి నమస్కారం చేసి నా తలను పైకి ఎత్తగా వారు “జన్మదిన వేడుకలకు మీరు రాలేదు కానీ నన్ను యిక్కడ కలుస్తున్నారా” అని అన్నారు. నేను స్తబ్ధుడనయి ఏమీ మాట్లాడలేకపోయాను. స్వామీజీ వారు నన్ను చూచి మానసికంగా ప్రతీదీ ఏర్పాటయిందనీ వారి అనుమతి వున్నదనీ చిరునవ్వు నవ్వారు. నా భార్యకు శస్త్ర చికిత్స జరిగిన కొద్దినెలలకే ఈ కార్యక్రమం ఖరారు అయింది.
మా బృందమంతా హిమాలయాలకు బస్సులో శ్రీస్వామీజీ వారి కారుతో పాటు బయలుదేరాము. గయా, ప్రయాగలను దాటుకుంటూ గౌరికుండ్ చేరుకున్నాము. అక్కడ నుండి కేదార్ నాథ్ కు పద్దెనిమిది కిలోమీటర్ల ప్రయాణం. శ్రీస్వామీజీ వారు గుంపులుగా వెళ్లమనీ గుఱ్ఖాలపై కానీ దండీపైన కానీ ప్రయాణం చేయమని అనుమతినిచ్చారు. నా భార్య దండీని ఎక్కింది. శ్రీస్వామీజీ వారు నన్ను ఆమెను అనుసరించి రమ్మని తెలిపారు. నేను షెర్పా సహాయంతో ఎక్కసాగాను. నేను ఎత్తయిన ప్రాంతాన్ని చేరుకునే కొద్దీ చలి ఎక్కువయి ఆ ప్రాంతమంతా మంచుతో కూడికుని వుంది. అక్కడ శ్రీ స్వామీజీ వారి బాల్యస్నేహితుడయిన ద్వారక నా శాలువాను యివ్వమని అడిగారు. కొద్ది దూరం చేరుకునే సరికి నాకు చలి ఎక్కువగా అనిపించి, ద్వారకా వంకకు వెనక్కి తిరిగి చూడగా శ్రీస్వామీజీ వారు గుఱ్ఱంమీద కూర్చుని రావడం గమనించాను. శాలువా గుఱ్ఱం వెనుక భాగాన చుట్టి వుండగా దాని మీద స్వామీజీ వారు ఆసీనులయి నన్ను చూసి నవ్వారు. అప్పటి నుండి నాకు ఏ మాత్రం చలి అనిపించక కేదార్ నాథ్ కు సుఖంగా ప్రయాణం కొనసాగించాను. ఆ మరునాడు శ్రీస్వామీజీ వారు అందరినీ ఆలయానికి వెళ్ళడానికి సిద్ధంగా వున్నారా అని అడిగారు.
ఆలయంలో శ్రీస్వామీజీ వారు గర్భాలయంలో లింగానికి పూజ చేయడానికి ప్రక్కగా నిలబడి పండా తెలిపిన ప్రకారం పూజ చేశారు. మేమంతా యింకొక వైపునకు నిలబడ్డాము, అంతలో మా అందరినీ వారి వైపుకు రావలసిందిగా తెలిపారు. గర్భగృహంలోపలి నుండి బయటకు వస్తూ వారు తమ చేతిని నా భుజాల చుట్టూ వేసి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుని నా భార్యను పిలిచి మా యిద్దరినీ వారి పాదాల వద్ద కూర్చోమని ఫోటొ తీయించారు. రుద్రప్రయాగలో శ్రీస్వామీజీ వారు వారి పాదాలను నీటిలో వుంచి ఒకరాతిమీద కూర్చుని మమ్మల్ని వారి పాదాలను తాకటానికి అనుమతించారు. మేమంతా ఆ పవిత్ర నదిలో ఆ అనుభవానికి పులకించాము. ఈ అనుభవాన్ని మాటలలో వివరించలేము.
బద్రీనాథ్ మార్గంలో, మేము ఆఖరి రోజు రాత్రి మేము జోషీ మఠంలో బసచేశాము. అక్కడ నా భార్యకు నెలసరి ప్రారంభమయింది. మాకు ఏం చేయాలో తెలియక చింతించాము. నేను శ్రీ స్వామీజీ వారి వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకుని, నేను స్వామీజీ వారి గదిలోకి పరుగున వెళ్ళాను. నేను వారికి విషయం తెలిపినప్పుడు వారు మౌనంగా దాని గురించి పట్టించుకోవద్దు. ఆమె ఎక్కడికయినా రావచ్చును. ఒక ఆత్మకు చెప్పవద్దు. ఏమయినా శ్రీ శంకరాచార్య మఠానికి నీవు వెళ్లు. కానీ అమ్మను తీసుకు వెళ్లవద్దు” అని చెప్పారు. నేను శంకరమఠం వదలి వెళ్లిన అనంతరం ఆమె కిందకూ వచ్చి నిలబడి చుట్టూ చూసింది. యింతలో ఆమె తల మీద కొన్ని పొడిపండ్లు పడసాగాయి. ఆమె పైకి చూడగా శ్రీస్వామీజీ వారు బాల్కనీలో నిలబడి వున్నారు. ఆ పండ్లను వారే ఆమె తలపై చల్లుతూ ఆమె ప్రదక్షిణ చేసినందు వలన అని తెలిపారు. ఎంతటి గొప్ప ఆశీస్సులు.
బద్రీనాథ్ లో శ్రీ స్వామీజీ వారు బ్రహ్మకపాలం వద్ద శ్రాద్ధకర్మలు చేసే వారికోసం ఏర్పాట్లు చేశారనీ, యిది గయకన్న పెద్ద స్థలమనీ తెలిపి వారి గదిలోకి వెళ్లిపోయారు. నేను మళ్లీ వారి గదిలోకి పరుగున చేరుకుని “స్వామీజీ ఆరు నెలల క్రిందట మా నాన్నగారు గతించారనీ, నేను పెద్దకొడుకును కాకపోవడం వలన, నేనేం చేయాలో తెలపండి అని అడిగాను. వారు వెళ్లి ఈ శ్రాద్ధకర్మ చెయ్యి, యిది నీకు మంచి అవకాశము అని చెప్పారు. నేను ఆలయానికి వెళ్లి అక్కడ మూడు నీటి బుగ్గలలో మునకలు వేసి శ్రాద్ధానికి స్నానం చేశాను.
ఆ రోజులలో శ్రీ స్వామీజీ వారు `పరమ శివ హంస´ను కలిగి వుండడం చేత వారిని సులభంగా చేరుకోలేకపోయేవారు. వారిని కలిసినప్పుడు విపరీతమయిన భయం వేసేది, కానీ వారు చిరు నవ్వు చిందిస్తున్నప్పుడు, మా సమస్యలన్నీ అదృశ్యమయ్యేవి.
నవరాత్రులు ఒక అద్భుతమయిన అనుభవం. అవి వివరించ తరము కాదు. ఒక సారి నవరాత్రులప్పుడు మేము రామ శంకర కుటీరంలో వున్నప్పుడు మమ్మల్ని రాత్రి 11 గంటలకు ప్రేయర్ హాలుకు రావలసిందిగా తెలిపారు. అది చాలా ప్రత్యేకమయిన పూజ. విచిత్రమయిన ముగ్గులతో నేలంతా అలంకరింపబడి పెద్ద పెద్ద్ బుట్టల నిండా కొబ్బరికాయలు వుంచబడ్డాయి. ఈ పూజలో శ్రీస్వామీజీ వారు కొబ్బరికాయలను తీసుకుని నడుం ఎత్తునుండి ప్రతీ కొబ్బరికాయను బంతిని విసిరినట్లుగా కొట్టసాగారు. అది గంధర్వలోక పూజ అని ఎవరయితే పూజను చూశారో వాళ్లు అదృష్టవంతులు అనీ, ఈ పూజను గురించి భూమీపైన ఎవరికీ తెలియదనీచెప్పారు.
మరొక సందర్భంలో మమ్మల్ని ప్రేయర్ హాల్లో కొత్తగా జరుగుతున్న నిర్మాణ పనులను చూడమని పిలిచారు. మేము ఆశ్చర్యపోయాము మరియు చాలా సంతోషించాము. శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళి మెట్లు ఎక్కారు. మేము పైకి చేరుకోగానే వారు వారి పాదుకలను తీసివేసి వాటిని నాకు యిచ్చారు. వారు మమ్మల్ని ప్రతీ చోటికి తీసుకుని వెళ్లి ప్రతీ గదిని గురించి వివరించి తెలిపారు. అప్పుడు వారు నన్ను వారి పాత నివాసమయిన భూగృహాన్ని చూశావా అని అడిగారు. నేను లేదు అని సమాధానమివ్వగానే, వారు ఇంజనీరుని పిలిపించి ఆ భూగృహం తలుపులు తెరిపించారు. వారు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ వివరించి చెప్పారు.
వారు ఒక ప్రదేశాన్ని చూపుతూ ఈ స్థలాన్ని చూడండి. ఒక చతురస్రాకార ప్రదేశాన్ని దాని చుట్టూతా చెక్కతో చేసిన చట్రం వుంది. అదే భూగర్భ గది అని, ప్రస్తుతు అర్కగణపతి వున్న ప్రాంతం. పూర్వము శ్రీ స్వామీజీ వారు యిక్కడే ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్లేవారని తెలిపారు. అక్కడ చెక్కతో చేసిన మెట్లు వుండేవని అక్కడ ఏ మాత్రం గాలీ, వెలుతురూ లేవనీ, కీటకాలు కూడా అందులోకి చేరితే చనిపోతాయి.
అయితే నవరాత్రి సమయంలో గంగాదేవి ప్రతీరోజూ వచ్చి దశమి నాడు అంతర్ధానమవుతుందనీ, ఎక్కడా కనీసం తడి కూడా కనపడదు. ఒకరోజున వేళాకోళం చేస్తూ వారు యింజనీరును నీళ్ళను బయటకు తోడమనగా యిరవయి నాలుగు గంటలపాటూ తోడిన ఆ నీళ్ళస్థాయి అలానే వుంది. మరుసటి సంవత్సరం నవరాత్రి సమయంలో నాకు స్వామీజీ వారి వద్ద ఈ తీర్థాన్ని తీసుకునే అదృష్ట భాగ్యం కలిగింది.
అక్కడ యింకొక గది తలుపు కేవలం అయిదు అడుగుల ఎత్తే వుంది. శ్రీ స్వామీజీ వారు ఆ తలుపు ఒక గుడ్డివానిగా జన్మించిన ఒక మంచి భక్తుడు బహుకరించాడని తెలిపారు. ఈ భక్తుడు శ్రీ స్వామీజీ వారు అంగీకరించి ఈ తలుపును అమర్చినట్లయితే తనకు కంటి చూపు వస్తుందనే నమ్మకంతో యిచ్చాడని తెలిపారు. ఈ తలుపు అమర్చిన అనంతరం అతనకి చూపు వచ్చిందనీ, శ్రీస్వామీజీ వారు అతనికి ఏం కావాలి అని అడిగినప్పుడు అతను స్వామీజీ నేను మిమ్మల్ని చూశాను. నాకు యింక ఏమీ అవసరం లేదు అని, తనను తీర్థయాత్రలు చేయడానికి అనుమతించవలసిందిగా కోరాడు. ఆ తరువాత అతను మరొక అయిదు సంవత్సరాలపాటూ జీవించి చాలా పవిత్రమయిన దేశాలను సందర్శించాడు.
శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని రామ-శంకర-కుటీరంలోని క్రియాయోగ హాలుకు తీసుకుని వెళ్లారు. అక్కడ భక్తులు స్వామీజీ వారికి సమర్పించిన కానుకలను చూపించారు. వాటిలో కొన్ని నేటి మ్యూజియంలో వున్నాయి. శ్రీ స్వామీజీ వారికి అవి అవసరం లేదనీ, యీ వస్తువులన్నీ భక్తులు తమ కోరికలు నేరవేరడానికి యిస్తారనీ, యివన్నీ ఒకరోజున ఆశ్రమంలోని మ్యూజియంలో ప్రదర్శింపబడతాయని తెలిపారు.
నేను ఆశ్రమానికి మొట్టమొదట మా పిల్లలను తీసుకుని వెళ్లినప్పుడు నేను కొద్దిరోజులపాటూ అక్కడ ఉండాలని అనుకున్నాను. కానీ ఆ మరునాడు శ్రీ స్వామీజీ వారు నన్ను ఆశ్రమం విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపించారు. నేను ఆశ్చర్యపోయి నేను ఎందువలన వెనుదిరిగి యింటికి వెళ్లాలి అని అడుగగా, ఒక దివ్యమయిన చిరునవ్వును చిందిస్తూ పిల్లలను తిసుకుని లాడ్జిలో సౌకర్యంగా వుండి వాళ్ళకి సందర్శించదగిన ప్రదేశాలను చూపించి యింటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆశ్రమానికి వచ్చి వెళ్లమని చెప్పారు.
మేము శ్రీ స్వామీజీ వారు సాక్షాత్తు పరమ శివుడని, అమ్మవారనీ, ఊహించుకునేవారము. దత్త ఆలయ నిర్మాణానికి కొద్దిరోజుల ముందు వారు దత్తాత్రేయుణ్ని గురించి తెలిపారు. ఆలయ నిర్మాణానికి ముందు వారు కొన్ని విచిత్రమయిన నియమాలను పాటించసాగారు. వారు కొన్నినెలలు మౌనవ్రతాన్ని ఆచరించి రామశంకర కుటీరానికి పక్కగా స్నానాల గది దారి వద్ద వారి కోసం ఒక పాకను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పాకకు పైన ఒక పెద్ద ఔదుంబర వృక్షం వుంది. ఒకరోజున మేము పాదముద్రలు అక్కడక్కడ వుండి ఆ వృక్షం యొక్క కాండం పైవైపు వరకు వుండటం గమనించాము. ఆ పాదముద్రలు శ్రీ స్వామీజీ వారివని గుర్తించాము. ఆ తరువాత వారు తమకు ఒకరోజు రాత్రి ఆ వృక్షం పైకి ఎక్కాలనే తలంపు కలిగిందనీ ఆ చిహ్నాలు అవే అని కొద్దిమంది భక్తులకు తెలిపారు.
ఒకసారి పూర్ణిమ నాడు మా కుటుంబం మరియూ శ్రీ కృష్ణపిళ్ళయ్ కుటుంబం మేకెదాటులో ఒకవారం రోజులపాటూ వున్నాము. శ్రీ రాంబాబు గారు అక్కడ అర్చకులు, వారు మా వసతి ఏర్పాట్లు చాలా బాగా చూశారు. నేను రాంబాబును పూర్ణిమ పూజ ఏ విధంగా చేస్తారని అడిగాను. దానికి ఆయన చుట్టుపక్కల గ్రామాల వారి వద్దనుండి విరాళాలను సేకరించి నిర్వహించగలిగామని తెలిపారు. ఈసారి ఖర్చులను మేము ఏర్పాటు చేస్తామని తెలిపాము. దానికి ఆయన అంగీకారం తెలిపారు. ఆ మరునాడు నేను పిళ్ళయ్ గారు కారులో కనకపురానికి పూజకు సామాను కావలసిన సరకులకు బయలుదేరాము. మిట్టమధ్యాహ్నానికి మేము ఆశ్రమానికి వెనుదిరిగి వస్తుండగా శ్రీ పిళ్ళయ్ కారును నడుపుతున్నారు. మేము కారును నిదానంగా నడుపుతున్న సమయాన నేను శ్రీ స్వామిజీ వారు పొలాల గట్లమీద కొద్దిమంది విదేశీయులతో రావడం గమనించాను. వారు కారును సమీపించి కిటికీ అద్దంలోంచి పరికించి నన్ను చూసి పెద్దగా నవ్వారు.
అప్పుడు వారు సంగమంలో స్నానం చేశారు. ఆ తరువాత నేను వారిని తడిబట్టలతో దత్తుని గర్భాలయంలోనికి రావడం నేను గమనించాను. వారి పవిత్ర పాదాలను బయటకు చూపుతూ త్వరగా పాదాలను తాకమని తెలిపారు. ఆ సమయంలో నేను బిగ్గరగా ఏడవసాగాను. కృష్ణపిళ్ళయ్ నన్ను గట్టిగా కుదపసాగారు. నేను కనులు తెరిచి జరిగినది వివరించాను. నేను ఈ విషయం రాంబాబు గారికి తెలిపాను. అతను అది కల కాదనీ, నేను శ్రీస్వామీజీని దర్శించుకున్నానని తెలిపారు. ఆయన మేకెదాటులో యిలాంటివి జరుగుతుంటాయనీ, గత వారంలోనే ఒక విచిత్రమయిన వ్యక్తి సంగమంలో స్నానమాచరించి ఆతృతతో నదీమార్గం గుండా యిక్కడికి వచ్చాడని చెప్పారు. అతను స్వామీజీ వారి ఫొటోను చూసి తాను సంగమంలో వారిని స్నానం చేస్తుండగా చూశానని తెలిపాడన్న విషయం చెప్పారు.
ఒకసారి మేకెదాటు వెళ్ళినపుడు నేను ఎనిమిది యించుల పొడవున్న శివలింగం భూమిలో నుండి వస్తుండడం చూశాను. అంతకు మునుపు కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పిక్నిక్ రిసార్ట్గా చేయాలనీ తలపోస్తూ అక్కడ ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో శ్రీ స్వామీజీ వారు పరమపవిత్రమయిన దత్త ఆలయాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నారు. ఆశ్రమం నుండి ప్రభుత్వ నిర్ణయంపై నిరశన ప్రదర్శనలు జరిగి ఆపివేయబడ్డాయి. ఆ పని ప్రారంభమయినప్పుడు ఆ లింగము అక్కడ కనపడడంతో ఆ పనులను ఆపివేశారు. నేను మరల మేకెదాటుకు శ్రీ స్వామిజీ వారితో పాటుగా వెళ్ళినప్పుడు ఆ శివలింగం రెండు అడుగులకు ఎత్తుదాకా పెరగడం గమనించాను. భూమిలో వున్నప్పుడే శ్రీస్వామీజీ వారు ఆ లింగానికి పూజలు చేశారు. దత్తప్రతిష్ఠ జరిగిన సమయంలో, శ్రీ స్వామీజీ వారు ఆ లింగాన్ని బయటకు తీసి దత్తుని ముందర ప్రతిష్ఠించారు. గోపుర విమానం నుండి యిక్కడ సంగమంలో స్నానం చేసి ఈ లింగానికి అభిషేకము చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని ప్రకటించారు. ఈ విధానాన్ని యిప్పటికీ అందరూ అమలు చేస్తున్నారు.
కుంభాభిషేకానికై నేను మేకెదాటు వెళ్ళి బస్సు దిగినప్పుడు ఎవరో నాకు శ్రీ స్వామీజీ వారు నది అవతల ఒడ్డున ఉన్నారని తెలిపారు. ఏ విధంగా జంకకుండా నేను ఆ నీటిలో ఈదుకుంటూ నది అవతలి తీరం చేరుకున్నాను. నేను శ్రీ స్వామీజీ వారు కొద్దిమందితో వుండి సూర్యునిలా ప్రకాశించడం గమనించాను. అప్పుడు నేను స్నానం చేయలేదని గ్రహించి కొద్దిదూరంలో నిలబడ్డాను. నేను ఒక గులాబీ పూల మాలను చేతిలో పెట్టుకుని వున్నాను కానీ వాటి రేకులు ఆ కవరులో రాలిపోయినాయి. శ్రీస్వామీజీ వారు నన్ను వారి దగ్గరకు రమ్మని సైగ చేశారు. నేను అక్కడకు వెళ్లి ఆ గులాబీ రేకులను వారి పాదాలపై వుంచాను. వెనుతిరిగి వస్తుండగా, నేను ఆ పూలను నేలమీద గుమ్మరించానని గ్రహించి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ ఆలోచన నా మనసులో మెదలగానే శ్రీ స్వామీజీ వారు ఆ రేకులను అక్కడి వారిని ఏరివేసి నీటిలో వేయమని తెలిపారు.
మా యింట్లో శ్రీస్వామీజీ వారి అరుదయిన ఒక ఫోటో వారి చేతిలో దండం వుండి ఎతైయిన కొండ ప్రాంతంలో నుంచుని వున్నది వారు శివునిలా అనిపిస్తున్నట్లనిపించేది వున్నది. వారు చాపిన చేతులనుండి కారుబీమ్ నుండి వచ్చే కాంతుల మాదిరి కనిపించేవి. ఆ కాంతి చాలా శక్తివంతంగా మరియు ఆ బీముల స్పష్టంగా పగటి వెలుగులో కూడా ఆ ఫొటోలో కనిపించేవి. ఈ సంఘటన వారు ఒకరోజున నునుపైన చాముండీ కొండలను దిగుతున్నప్పుడు జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీ స్వామీజీ వారితో పాటు వున్నారు. వారికి బాగా దాహం వేసింది, సమీపంలో ఎక్కడా నీటి చుక్క లేదు. శ్రీ స్వామీజీ వారు తమ కుడి చేయిని ఆ బీమ్ లైటుతో పాటు పైకి ఎత్తారు. సూర్యకాంతికన్నా ఎక్కువ శక్తిగల కిరణాలు ఆ రాయిని తాకాయి. ఆ రాయి ముక్కలయ్యి అక్కడ నీటిధార బయటకు వచ్చింది దీంతో ఆ భక్తుల దాహం తీరింది. వారు యింతటి అద్భుతాన్ని తమ కన్నులతో చూడగలిగారు.
ఆ సమయంలో ఒక వ్యక్తి తన చేతిలోని కెమెరాతో ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆ కెమెరా బూడిద అయిపోయింది. అప్పుడు వారంతా స్వామీజీ వారి పాదాలపైపడి ఆ అద్భుత దృశ్యం యొక్క ఫోటో కొరకు వారి అనుమతిని అర్ధించారు. శ్రీ స్వామీజీ వారు వాళ్ళకి అనుమతినిచ్చి ఒకటి గాని రెండు కానీ కాపీలకన్నా ఎక్కువ తీసుకోవద్దని తెలిపారు. ఒక కాపీ నా దగ్గర వున్నది. ఈ ఫోటో యొక్క సంఘటనను శ్రీ స్వామీజీ వారే స్వయంగా మా యింటికి పాదపూజకు మరియు భిక్షకు విచ్చేసినప్పుడు తెలిపారు. అక్కడ విజయవాడకు చెందిన ఒక మహిళా భక్తురాలు ఫణి అనే ఆవిడ స్వతంత్రించి శ్రీ స్వామీజీ వారిని ఆమె కొరకు నన్ను ఆ ఫోటో కాపీ యివ్వవలసిందిగా చెప్పమని కోరింది. శ్రీ స్వామీజీ వారు ఆమె వైపు చూసి ఒక చిత్రమయి నవ్వు నవ్వి ఏమీ చెప్పలేదు.
నెలలు గడిచిపోయాయి. నేను ఎవరినీ ఈ ఫోటోను తాకనీయలేదు. ఆ తరువాత ఒకరోజు శ్రీ నాగేశ్వరారవు, ఆడిటరు విజయవాడకు చెందిన సన్నిహిత భక్తులు మైసూరు నుండి మైసూరు ఆశ్రమంలో ఆడిట్ ముగించుకుని తిరిగి వెళుతూ మా యింటికి వచ్చారు. వారు ఆ ఫోటోను చూసి నన్ను తన చేతిలో కెమోరా వున్నందును ఆ ఫోటో ఒక కాపీ తీసుకోవచ్చునా అని అడిగారు. నేను అతన్ని తీసుకోమని ఆ ఫోటోను టీవి మీద పెట్టి వెళ్ళాను. కొంత కాలం తరువాత ఆయన నన్ను మైసూరు ఆశ్రమంలో కలిసి కంపిస్తూ ఆందోళన పడసాగారు.
ఆయన నన్ను వారి వద్ద నుండి జాబును అందుకున్నారా అని అడిగారు. నేను లేదు అని సమాధానం యిచ్చాను. ఆయన నాతో ఫోనులో సంప్రదించటానికి ప్రయత్నం చేశానని కుదరలేదనీ తెలిపారు. నేను అతన్ని విషయం ఏమిటి అని అడగ్గా, అప్పుడు అతను యిలా తెలిపాడు. నేను ఆ ఫిల్మ్ ను డెవలప్ చెయ్యబోతూ కెమెరాను తెరవగా, ఆ కెమెరాలో రీలు కనపడలేదని, నేను భయపడి మైసూరుకు ఫోన్ చేశాననీ నేను జరిగినది చెప్పేలేపో నాకు అక్కడ నుండి నేను ఆ ఫోటో తీయడానికి ప్రయత్నించకుండా వుండి వుండవలసినదని, ఏమయినా నేను చాలా సన్నిహిత భక్తుడనవడం చేత నా కెమెరా రక్షింపబడిందని సమాధానం వచ్చింది.
1991లో మా అమ్మాయి వివాహం మైసూరు ఆశ్రమంలో జరిగింది. అది ఒక కొత్త భక్తుని చేత ఏర్పాటు చేయబడి కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆ పెళ్లికొడుకు మాన్పశక్యం కాని మద్యానికి బానిస. చాలా కాలం ప్రయత్నం చేసి నేను మా అమ్మాయిని యింటికి తీసుకుని వెళ్ళిపోయి యింక తిరిగి అత్తవారింటికి పంపలేదు. శ్రీ స్వామీజీ వారు అనంతమైన కృపతో మా యింటికి వచ్చి నాతోటి వారు మాకు మద్దతు తెలుపుతూ విడాకులకై కేసు వేయమని తెలిపారు. సంవత్సరాలు గడిచాయి. మేకెదాటు కుంభాభిషేకా ప్రారంభమయే ముందు నన్ను మైసూరు దత్తజయంతి ఉత్సవాలకు ముందుగానే రావలసినదని కబురు వచ్చింది. శ్రీ స్వామీజీ వారి అనుగ్రహంతో మా అమ్మాయికి న్యూ జెర్సీకి చెందిన ఇండో-అమెరికన్ అయిన శ్రీ శేఖర్ తోటి వివాహం జరిగింది. ఇది చాలా అపూర్వమైన వివాహం శ్రీ స్వామీజీ వారు స్వయంగా మంగళసూత్రాలను ఈ వివాహంకోసమై బహూకరించారు.
ప్రార్ధనా మందిరమంతా నిండిపోయింది. శ్రీ స్వామీజీ వారు అన్నీ లెక్కించుకుని యిన్ని సంవత్సరులుగా ఈ కుటంబం ఏ విధమయిన సమస్యలను , కనీసం నా ఫోటో ముందర కూడా తెలుపలేదు అని చెప్పారు. రెండు రోజులల మేకెదాటులో కుంభాభిషేకం జరుగనున్న కారణాన నేను ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి చాలా శ్రద్ధ వహించాను. నిజానికి శ్రీ స్వామీజీ వారు మేకెదాటులో వుండడానికి ఏ విధమయిన ఏర్పాట్లు లేవనీ, కానీ భక్తులు బస్సులలో ఉదయం వచ్చి రాత్రికి మైసూరు తిరిగి వెళ్ళాలని తెలిపారు. వారు దత్త జయంతిలో పాల్గొన్న దానితో సంతోషించాలనీ, మేకెదాటుకు వెళ్లడానికి ప్రయత్నం చేయవద్దనీ తెలిపారు.
నేను ఈ సందేశం నాకు సంబంధించి కాదనీ ఒక బస్సులో ఎక్కాను. మా కుటుంబం వారు వేరే బస్సులో వున్నారు. దారిలో నేను ఎక్కిన బస్సుకు మేకెదాటుకు సమీపంలో ప్రమాదానికి గురయి బస్సు లోయలోకి పడిపోయింది. యిది ఆశ్రమానికి చాలా దగ్గరగా జరిగింది. అందులో దాదాపు ముప్ఫయి అయిదు మంది ప్రయాణికులు వున్నారు. నాకు శ్రీ యాదేశ్వర్కి తప్ప ఎవ్వరికీ ఏ ప్రమాదం సంభవించలేదు. మా యిద్దరికీ ఒకే విధంగా గాయాలయి కుడి చేయి విరిగి గాయాలయ్యాయి.
బస్సు అవశేషాలనుండి నేను ఆఖరికి బయటకు లాగబడ్డాను. నన్ను ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి మిగతా వారితో పాటు మంచం మీద పడుకోబెట్టారు. కొంత సమయానికి శ్రీ స్వామీజీ వారు వచ్చి తీర్థం యిచ్చి నన్ను తాకి నాతోటి చికిత్స అనంతరం అంతా సవ్యంగా వుంటుంది అని చెప్పారు. నన్ను ఆంబులెన్సులో తక్షణ చికిత్సకోసం ఆశ్రమ డాక్టర్లతోపాటుగా బెంగళూరు తీసకుని వెళ్లారు. ఆ మరునాడు మమ్మల్ని మైసూరుకి తీసుకుని వెళ్ళి ప్రేయర్ హాల్లో మమ్మల్ని కుర్చీ వేసి కూర్చోబెట్టారు. శ్రీ స్వామీజీ వారు ముఖ్యంగా నాతోటి వారు నాకు పునర్జన్మనిచ్చానని తెలిపారు. అప్పుడు వారు నన్ను మద్రాసు తిరిగి వెళ్ళడానికి అనుమతినిచ్చి వైద్యం కొనసాగించమని తెలిపారు. నేను త్వరగా కోలుకుని యోగాతో సహా అన్ని పనులను చేయ ప్రారంభించాను.
మనపై శ్రీస్వామీజీ వారికి అపారమైన కృప మన కష్ట సమయాలలో వారు మనల్ని రక్షిస్తారు. వారు సర్వవ్యాపి. శ్రీ స్వామీజీ వారు మన జీవితాలలోవుండడం కన్న మించిన దీవెన ఏదీలేదు. యిదంతా మన పూర్వజన్మల పుణ్య ఫలం. వారే మన శరీరంలోని ఆత్మ. మా కుంటుంబమంతా వారి రక్షణ మరియు ప్రతివిషయంలోనూ వారి మార్గదర్శకత్వంలోనే నడుస్తుంటాము.
జయ గురు దత్త