SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on
కె. శ్రీధరన్ వైద్యార్, కొచ్చి (K.Shreedharan Vaidyar, Kochi)

మా కుటుంబంలో గత నాలుగు సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. మా మామయ్యగారు శ్రీ నారాయణ వైద్యార్, మా కుటుంబంలోని వైద్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, మైసూరు, కర్నాటక రాష్ట్రం వారి శిష్యులు. 1970వ సంవత్సరంలో మా మామయ్యగారు మరొక పదిమంది భక్తులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని శ్రీ స్వామీజీ వారి మొట్టమొదటి కేరళ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. నేను కూడా వారితో పాటుగా వెళ్ళాను. ఆ కమిటీలోని ఎవరకీ శ్రీ స్వామీజీ వారిని ఎలా ఆహ్వానించాలో తెలియదు. మేము వారికోసం చిన్న స్వాగత సభను ఏర్పాటు చేసాము.

మేము వారికోసం వీధిలో దండలను తయారు చేసే అతని దగ్గరు పూలమాలనుకొని వారికి యిచ్చాము. వారు ఆ పుష్పహారం తీసుకుని కుర్చీమీద వుంచారు. మేము యిచ్చిన ఆ మాల ఎలాగో అదృశ్యమయి ఆ స్థానంలో ఒక అందమైన తులసి మాల ఏర్పడింది. వారు దానిని మా మామయ్యకు యిచ్చారు. ఆ సమయంలో మేము శ్రీ స్వామీజీ వారి శక్తిని అనుభవించగలిగాము. శ్రీ స్వామీజీ వారు ఆ శివరాత్రి మాతో గడిపారు. అక్కడ దాదాపు యిరవై అయిదు మంది భక్తులు వున్నారు. మేము రాత్రంతా భజనలు పాడాము. ఆ మరునాడు శ్రీ స్వామీజీ వారు భిక్ష తీసుకుని మా పట్టణం విడిచి వెళ్లారు. మా మామయ్య శ్రీ సత్య సాయిబాబా వారి భక్తులు. శ్రీ స్వామీజీ వారు అక్కడికి వచ్చి వెళ్లిన దగ్గర నుండి ఆయన వారి భక్తులు అయ్యారు.

కేరళలో జనాభా ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువగా వుండడంతో భక్తులు కూడా చాలా కొద్దిమంది వున్నాకూడా వారంతా స్వామీజీ వారి కోసం ఏమయినా చేయడానికి సిద్ధంగా వుండేవారు. సమయం గడిచే కొద్దీ భక్తుల సంఖ్య క్రమంగా పెరిగి, శివన్ పిళ్లయ్ అనే భక్తుడు, పెరియార్ నది ఒడ్డున కొన్ని స్థలాలను స్వామీజీ వారికి బహుకరించారు. కొచ్చి ఆశ్రమం వున్న ప్రాంతం. చాలా దివ్యమైన ఆశ్రమం ప్రాంతం, అక్కడ ఒక ఆయుర్వేదిక వైద్యశాల కూడా వున్నది.

స్వామీజీ వారితో నా అనుబంధం నాకు వృత్తిపరంగా చాలా ప్రత్యేక శక్తిని, విస్తారమైన సామర్ధ్యాన్ని కలగజేసింది. వారు ఒకసారి గిరినగర్ వచ్చినప్పుడు శ్రీ రామస్వామిగారి యింట్లో బస చేసి వుండగా, నన్ను కూడా అక్కడకు ఆహ్వానించారు. వారు నన్ను పిలిచి అందరి ముందూ నాతోటి నాకు ఒంట్లో నలతగా వుంది నాకు మందు కావాలి అని అడిగారు. ఆ తరువాత వారు ఒక యింటికి భిక్షకై వెళ్ళి వచ్చిన సందర్భంలో వారికి నేను మందులివ్వడం జరిగింది. నేను యిలా మొట్టమొదటి సారిగా చేశాను. వారు ఎప్పుడు వచ్చినా నన్ను మందుల కోసం అడిగేవారు. అప్పుడు వారు భక్తులకు నేను ఒక మంచి ఆయుర్వేద వైద్యుడనని నాకు వారు కొన్ని ప్రత్యేక అధికారాలు యిచ్చానని చెప్పేవారు.

యిది నిజంగా నిర్ధారణ అయింది, ఒకోసారి నేను రోగులకు మందులు యిచ్చినప్పుడు వారు వారి అనారోగ్యం పూర్తిగా నయమయిందని తెలిపేవారు. నేను యిదంతా స్వామీజీ వారి అనుగ్రహమని వారే నా ద్వారా నయం చేస్తున్నారని తెలిపేవాడిని. స్వామీజీ వారి సూచనలద్వారా నేను ధన్వంతరి భగవానుడు, ఆరోగ్య దేవునికి మైసూరులో పూజలు చేసేవాడిని. పూజల అనంతరం ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచేవాడిని.

శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో నేను పి.ఎన్.వి.ఎమ్. హాస్పటిల్ మరియు రిసెర్చ్ సెంటర్లో ఆయుర్వేద ఫిజీషియన్ గా పనిచేస్తున్నాను మా అబ్బాయి తన సొంత ఆయుర్వేద ఫార్మసీని నిర్వహిస్తున్నాడు. వారి దయ వలన, మేము నెల నెలా మెడికల్ కాంప్స్ నిర్వహిస్తూ నాలుగువందల మంది రోగులకు చికిత్స చేస్తూ మందులను వుచితంగా పంపిణీ చేస్తున్నాము. ప్రస్తుతం నా వయసు ఎనభై సంవత్సరాలు. నేను మునుపటిలాగా ఎక్కడికీ వెళ్లడంలేదు. కానీ నేను వారి ఆశ్రమానికి మెడికల్ కాంపుల నిమిత్తం వెళుతుంటాను.

శ్రీ స్వామీజీ వారి ప్రేరణతో నేను ఒక ఆయుర్వేదిక మందును తయారు చేశాను. అది కొత్తరకమయినది ఎక్కడా దొరకదు. నేను ఈ మందును రోగులకు ఉచితంగా సరఫరా చేసి వారికి గల అనేక రకాలైన అనారోగ్యాలు, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం వంటివి నయమయ్యాయి. శ్రీ స్వామీజీ వారే తమ పిల్లలకు మా ద్వారా స్వస్థతను చేకూరుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే నేను ఈ మందును ఉచితంగా రోగులకు యిస్తాను. నాకు నివసించడానికి అవసరమయినంత ధనం లభిస్తుంది. ఈ డబ్బు రోగుల నుండి విరాళాల రూపంలోనూ, విచిత్రమైన మార్గాలలోను వస్తూంటుంది. శ్రీ స్వామీజీ వారు నాకూ, నా కుటుంబానికి అవసరమైన అర్ధికపరమైన వ్యవహారాలను గురించి కూడా శ్రద్ధ వహిస్తారు.

చాలా కాలం క్రితం నేను మైసూరు ఆశ్రమానికి వెళ్లాను. శ్రీ స్వామీజీ వారు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం కోసం నేను హాలులో కూర్చున్నాను. వారు వచ్చినప్పుడు హోమకుండం దగ్గరకు వెళ్లకుండా నా వంకకు చూసి ‘‘వైద్యార్ యిక్కడకు రండి‘‘ అని పిలిచారు. నేను వారి వద్దకు వెళ్లగానే వారు నాకు రక్షను నా మెడకు వేసుకోమని ‘‘మీరు యిది వేసుకోవాలి ఎందుచేతనంటే మీకు ప్రమాదం కలగబోతోంది’’ అని తెలిపారు. నేను ఆ రక్షను ధరించిన వెంటనే నాకు ఏదయినా చేయగలననే ధైర్యం కలిగింది. అంతకు ముందు నేను చాలా బలహీనంగా వుండడంతో ఏ పని చేయాలనిపించేదికాదు. యిప్పుడు నేను కోలుకున్నాను. ఆరోగ్యంగా వుండి దేనికీ చింతచేయడం లేదు.

ఆ తరువాత శ్రీ స్వామీజీ వారు కొచ్చిన్ ఆశ్రమానికి వచ్చారు. నేను వారికి పాదపూజ చేస్తూ వారితో నాకు చెప్పటానికి కాని కోరుకోవడానికి కానీ ఏమీ లేదని అంతా వారికి తెలుసునని చెప్పాను. వారు తాను యిక్కడ అక్కడా అంతటా వున్నానని తెలిపారు. శ్రీ స్వామీజీ వారికి నాకు జరగబోయే ప్రమాదం గురించి తెలుసును అందుచేత నాకు తెలియకుండానే నాకు రక్షణ కల్పించారు. వారు నా జీవితాన్ని పొడిగించారు. నాకు కావలసినదల్లా వారికి సేవ చేయడమే. వారి దీవెనల వలన నాకు పనిచేయడానికి కావలసిన శక్తి కలిగి ప్రస్తుతం నేను ఒక పుస్తకాన్ని వేరే భాషలోకి అనువాదం చేస్తున్నాను.

ఒకసారి శ్రీ స్వామీజీ వారు కొచ్చిన్ వచ్చినప్పుడు వారు ఒక ప్రారంభోత్సం కార్యక్రమంలో వుండగా వారు నన్ను నా ఆఫీసుకు వద్దకు రమ్మనమని కబురు పంపారు. వారు నన్ను సభలో చాలా వృద్ధ భక్తునిగా ప్రశంసించారు. నేను ఈ మధ్యనే శ్రీ స్వామీజీ వారిని దర్శించుకుని వారి సంగీత కచేరిలో పాల్గొన్నాను. వారు నన్ను వేదకి పైకి పిలిచి నన్ను పొగడ్తలతో అభినందించారు. నేను అక్కడ వారితోనూ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారితో దాదాపు రెండు గంటల పాటు గడిపాను. మాకు ఫోటోలు కూడా తీశారు. శ్రీ స్వామీజీ వారు వారి ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు నా కోసం వున్నారు. నేను శ్రీ స్వామీజీ వారు నా గురించి నా కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తున్నారని రూఢిగా నమ్ముతాను. మేము వారి హృదయంలో వున్నాము వారు మా హృదయాలలో వున్నారు. నేను వారిని నమ్ముతాను. ‘‘నేను మీతోనే వున్నాను మీరు చింతించకండి’’ అని నాతో చెప్పారు. నేను ఆపదలకు గురయిన సందర్భాలలో, నేను నిద్రలో వున్నప్పుడు శ్రీ స్వామీజీ వారు నాకు కలలో కనపడి నాకోసం పూజలు నిర్వహిస్తారు. మరునాడు పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి.

శ్రీ స్వామీజీ వారిని విశదీకరించలేము. వారిని అనుభవించాలి. నేను పుస్తకాలను చదివేవాడిని, భజనలను పాడేవాడిని, కాని నాకు శ్రీ స్వామీజీ వారితో ఆధ్యాత్మిక అనుబంధం కలగలేదు. నేను తెల్లవారు ఝామున మౌనంగా కూర్చుని వారి గురించి ఆలోచించేవాడిని. వారి దయ వలన నాకు ఆధ్యాత్మిక అనుబంధం కలిగింది. సమయం గడిచేకొద్దీ నేను కూర్చుని వారి గురించి ఆలోచించి వారితో అనుసంధానం కలగజేసుకోవాలసిన అవసరం లేదు. నేను నా జీవితంలో వారిని అనుక్షణం తలుస్తాను. అందువలన నేను ఆలోచించినపుడు వారు ఆలోచిస్తారు. నేను పని చేసినపుడు వారు పని చేస్తారు. నేనెవరు? వారెవరు? మేమిద్దరమూ ఒకటే.

జయ గురు దత్త

Tags: