SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
లిన్నే బిందు జోర్డాన్, బటాన్ రూజ్ (Lynne Bindu Jordan,USA)

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని గురించిన మొట్టమొదటి స్మృతి నా జీవితంలో నాకు మూడు సంవత్సరాల వయసు వున్నప్పుడు కలిగింది. నేను ఒక మూడు చక్రాల వాహనం మీద కూర్చుని వారిని “మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఎందుకు ఇక్కడ విసరబడ్డాను? మీరు నా కోసం తిరిగి రాబోతున్నారా?” అని అడిగిన నా ఈ జ్ఞాపకం నాకు వారిపైన ఆపార ప్రేమ మరియు సన్నిహితత్వం కలిగి నేను వారి సమక్షంలో వుండాలనే కోరిక వుండటం, నన్ను ఈ కుటుంబంలో ఈ జీవితాన్ని కలిగి వుండేలా చేసింది. సాంప్రదాయకమైన క్రైస్తవ చర్చిలో పెరుగుతూ, లోతైన ఆధ్యాత్మిక సత్యాలుఏ మతానికి చెందినవయినా నాకు అత్యంత బలమైన ఆసక్తి కలిగించేవి. ఎక్కడయినా పద్ధతులు, సమాధానాలు మరియు ప్రేరేపణ కలుగుతూ వుంటే ఆ ప్రదేశాల్లో నేను విషయాన్వేషణ చేసేదాన్ని. పదిహేడు సంవత్సారాల వయస్సులో నేను ఉపవాసం చేయడం ప్రారంభించాను. యేసు చేసిన విధంగా మనము కూడా ఉపవాసం యొక్క ప్రయోజనం పొందాలి. అదే సంవత్సరం ఆహార నియమాలు వాటి ప్రభావాలను, ప్రయోజనాలను గురించి వివరించి నేర్పించిన ఒక మతాధికారిని నేను కలిసాను. మా అమ్మగారి ప్రేరణతో నేను శాఖాహారిగా మారాను. యిది ఆమె తరువాత సహజ ఆరోగ్య విషయాలలో బాగా అధ్యయనం చేయడానికి ఆమెకు ఒక ఆశీర్వాదమయింది.

హైస్కూలులో వుండగా నాకు తరచు కలలు ఒక అసాధారణ భాషలో గోచరమయ్యేవి. వాటి జ్ఞాపకాలు నాకు పరిశోధన చేయడానికి సులభతరమయ్యింది. అది సంస్కృతభాషతో కూడి వుండి ఆ పదాలకు లోతయిన ఆధ్యాత్మికపరమయిన అర్థాలు కలిగి వుండేవి. సంస్కృతం, మరియు యోగసూత్రాలను చదవటం వలన నాకు భారతదేశంపైన ఆసక్తీ ఎక్కువయింది. భారతదేశం ఆధ్యాత్మిక గురువులకు నివాసమని తెలుసుకున్న తరువాత నేను ఎవరితోనయినా కలిసి అధ్యయనం చేయగల వ్యక్తిని కలవాలనే వ్యక్తిగతమయిన జిజ్ఞాస నాలో కలిగింది. నా ఈ ప్రార్ధనకు సమాధానం లభించి న్యూయార్కుకు ఒక సంవత్సరంలో మూడుసార్లు పర్యటించవలసి వచ్చింది. NYCలోని రామకృష్ణ-వివేకానంద ఆర్గనైజేషన్తో అనుబంధంగా ఉన్న స్వామి, నాకుధ్యానం మరియు జ్ఞాన యోగం గురించి వివరంగా తెలిపారు. నాకు ఆశీస్సులు కలిగి నేను అదృష్టవంతురాలినని పొంగిపోతున్న నాకు జీవీతంలో మొట్టమొదటగా నా స్మృతికి వచ్చిన “ఒకరు”, ఆ స్వామివారే నా ఆధ్యాత్మికపరమయిన సందేహాలను నివృత్తి చేసి నా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని నిర్దేశించేది వారేనని నాకు తెలుసును. వారిని కలవాలనే నా నెరవేరని నిర్ణయం నా అంతరంగంలో నిలిచిపోయింది.

న్యూయార్కు లోని థౌజండు ఐలాండ్ పార్కులో రామకృష్ణ వివేకానంద పరంపరలోని స్వామివారితో పాటూ ఉదయం ధ్యానం చేస్తున్నసమయంలో మాకు గది మధ్యన బిగ్గరగా లయతో కూడిన శ్వాస శబ్దం వినపడింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ ధ్వని వినపడుతున్న స్థలంలో ఎవరూ కనపడలేదు. నా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. నేను ఈ ఉపరితల రూపానికి “యోగులకే యోగి” అని పేరు పెట్టాను. నేను వారు సమీపంలోనే వున్నందున చాలా సంతోషించాను. ఆ స్వామివారు సాయంత్రం ధ్యాన సమయంలో పాల్గొన్నప్పుడు బిగ్గరగా లయతో కూడిన శ్వాస శబ్దము విని ఆశ్చర్యపోయాడు. ఈ ప్రాణాయామము ఉదయము మరియు సాయంకాలాలు మూడు రోజులపాటు యిలాగే భౌతికమయిన రూపం కనబడకుండా ఈ ధ్వని పదినిమిషాల పాటు కొనసాగింది. ప్రతిసారీ ప్రతి ఒక్కరికీ యిదే విధమయిన దైవిక అనుభవం కలిగింది.

కొన్ని సంవత్సరాల అనంతరం, 1992లో ఒక భారతీయ మానసిక వైద్యులయిన డాక్టరు కృష్ణ యలమంచిలి గారి ఆఫీసులో నేను మానసిక వైద్యురాలిగా పని చేస్తున్నప్పుడు ఆయన నా డెస్క్ వద్ద ఒక పుస్తకం వుంచారు. నేను ఆ భక్తిమాల పుస్తకాన్ని చదువుతున్న సమయంలో ఆ సందేశం స్ధిరమయిన, స్వచ్ఛమయిన మరియు యోగ పరమయినదని గుర్తించాను. శ్రీ యలమంచిలి గారు దత్త సంప్రదాయానికి చెందిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి గురించి చెప్పగా నేను సంతోషంగా విన్నాను. ఆరు నెలల అనంతరం ఆ డాక్టరు గారు నన్ను ఈ సద్గురువును బాటన్ రూజ్ లో కలవడానికి సిద్ధమవమని తెలిపారు. నేను క్రియాయోగ తరగతులలో పాల్గొన్నాను. నా రెండు అనుభవాలు రూఢీ అయ్యాయి. నా మూడవ సంవత్సరంలో కలిగిన స్ఫురణ మరియు లయబద్ధంగా అందరికీ థౌజెండు ఐలాండ్ పార్క్లో అందరికీ వినపడిన ప్రాణాయామ ధ్వని. నాకు స్వామీజీ వారితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కలిగినప్పుడు ఈ రెండు సంఘటనలను ప్రస్తావించే ముందుగానే వారి నోటివెంట “అది నేనే” అనే మాటలు వచ్చాయి.

నేను ఎక్కువగా జ్ఞానయోగము మరియు రాజయోగము చదవడంతో, శ్రీ స్వామీజీ వారు నాదయోగి అనే విషయం తెలుసుకోవాలని నాకు ఆసక్తి పెరిగింది. వారిని దర్శించుకున్న అనంతరం స్వామీజీ వారి చిరకాల భక్తులు కొంతమంది నన్ను అట్లాంటాలో జరిగే కచేరికీ రావలసిందిగా కోరారు. నాకు ఆ కచేరిలో పాల్గొన్న అనంతరం చాలా సంతృప్తి కలిగింది. ఒక చిరోప్రాక్టర్(స్వస్థత పరిచే ఒక ప్రత్యేక విధానం) ద్వారా అనారోగ్యాన్ని సరిచేసినట్లుగా, ఆ నాదకచేరిలోని ప్రతి స్వరం నా శరీరంలోకి భౌతికంగా చేరిన భావన కలిగింది. నా భౌతిక శాస్త్రవేత్త మరియు నన్ను దత్తత తీసుకున్న తాతగారు, ఒక అద్భుతమైన మేధావి, అమెరికా సైన్యంలో కల్నల్ గా పదవీవిరమణ ఛేసిన వారు చెప్పిన మాటలు ‘‘ మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి! L-ఫీల్డ్ కు అనుగుణంగా - ఒక జీవి లేదా అణువు యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం మరియు ఒక L- ఫీల్డ్ ఆలోచన ద్వారా మార్పు చెందుతుంది.” అన్న మాటలు స్పష్టంగా అర్ధమయ్యాయి. శ్రీ స్వామీజీ వారి కచేరి అనంతరం నాలో మార్పులు కొనసాగడం గమనించాను. నేను వాస్తవాన్ని గమనిస్తూ, జీవన ప్రయోగ శాలలో పదార్ధం యొక్క కదలిక ప్రకంపనల ప్రభావంతో ప్రభావితం కాబడి దానికి అనుగుణంగా మార్పు జరుగుతుందని గ్రహించాను. ఈ సత్యం యొక్క పరిపూర్ణత ఎలా వుంటుందంటే హెచ్చుస్థాయి స్వరాలకు గాజు అద్దం బద్దలయినట్లుగా శ్రీ స్వామీజీ వారి సంగీతం యొక్క కదలిక పరమాణు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది.

శ్రీ స్వామీజీ వారిని మొట్టమొదటిసారి భౌతికంగా దర్శనం చేసుకున్నప్పటి నుండి నాకు ఆధ్యాత్మిక పరమయిన మార్గదర్శకత్వం కలల రూపంలో మరియు దర్శనరూపంలో మొదలయింది. ఈ వియయాన్ని యిదివరకే విని వుండడం చేత, ఒక మానసిక వైద్యురాలిగా కలలు చికిత్స చేయడానికి ఒక అవగాహన ఏర్పరుచుకునేందుకు ఉపయోగపడేవి. ఈ స్వప్నాలు విలక్షణంగా వుండి, అద్వితీయంగానూ. స్పష్టంగాను వుండి మన ప్రగతికి స్పష్టమైన జ్ఞాపకాలుగా వుండి తక్షణమే ఆధ్యాత్మికపరమయిన బహుమతులుగా శ్రీ స్వామీజీ వారు సిద్ధం చేసేవారు. యివి ఎంతో ప్రోత్సాహకరంగా, ఉత్తేజవంతంగా, విద్యావంతంగా సహాయకారిగా వుండేవి. ఒక చిన్న సామాన్యమైన దృశ్యం శ్రీ స్వామీజీ వారి ముఖం దర్శనమయి వివిధ రకాల ముఖాలుగా మారుతూ అగుపించిది. అవి ఒక దానికంటే మరొకటి భయాన్నిగొలుపుతూ వుండేవి. నాకు ప్రశాంతంగా, భయం అనిపించకుండా, అవి స్వామీజీ వారి ముఖాలు వివిధ రకాలైన ముఖాలుగా సంతోషంతో కూడిన ఆటలాగా తోచింది. ఈ సందేశం చాలా అందంగా స్పష్టంగా వారు ప్రేమస్వరూపులనీ, వారి అధీనంలో ప్రతిదీ వుంటుందనీ, మంచీ చెడూ, అందం, వికృతం కలిగి వుంటుందనీ. వారే సృష్టికర్త అనీ, స్థితికారకులనీ, లయకారకులని తెలుపుతుంది. అమెరికాలో ఒక మానసిక వైద్యురాలుని కావడంతో, కలలను విశ్లేషించి, సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించాలని కోరుకునేదానిని. ఈ దృక్పధాలన్నీ క్రైస్తవ నమ్మకాలతో ఏకీభవించడంతో, ఒక ఆధ్యాత్మిక సత్యం కూడా బైబిల్ నందు వున్నది.

ఆ తరువాత 1987వ సంవత్సరం అనంతరం విడాకులు తీసుకుని యిద్దరు కుమార్తెలను పెంచడం వంటి కష్టాలు కలిగాయి. మానసిక సమతుల్యతను పాటిస్తూ తగిన శక్తిని కూడదీసుకని ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ వుండడమనేది శ్రీ స్వామీజీ వారి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం, క్రియాయోగ సాధన మరియు ధ్యానం వలన సాధ్యమయ్యింది. ఈ సమయంలోనే మా అమ్మాయికి అటోమొబైల్ కన్వర్టర్లో ఆమె తల చీరుకుని పెద్ద ప్రమాదం సంభవించింది. ఆమెను వాహనంలో నుండి తీసుకుని వెళ్లేటప్పుడు ఆమెకు నాడి అందలేదు. ఒక భక్తుడు శ్రీ స్వామీజీ వారికి భారతదేశానికి ఫోన్ చేసి ఆమె పరిస్థితిని తెలిపారు. దానికి వారి ఓదార్పుతో కూడిన సమాధానం కంగారు పడవలసిన అవసరం లేదని ఆమె కోలుకుంటుందని తెలిపారు. ఆసుప్రతికి చేరుకునేసరికి ఆమె ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత శ్రీ స్వామీజీ వారు ఆమెకు పునర్జన్మనిచ్చానని నాకు తెలిపారు. నా కుటుంబం గురించి వారు ప్రేమతో శ్రద్ధ తీసుకున్నారు ప్రతిరోజూ అలాగే కొనసాగిస్తున్నారు. నా యిద్దరు పిల్లలు అమెరికా జీవన విధానంలో పెరిగి, శ్రీ స్వామీజీ వారి యొక్క వుద్దేశ్యపూర్వక, ఆశ్చర్యకర అనుభవాలకు లోనవుతూ వుంటారు.

డాక్టరు యలమంచిలి, ఒక మానసిక వైద్యులు, శ్రీస్వామీజీ వారి న్యూయార్కులోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ నేను శ్రీస్వామీజీ వారికి నేను లేఖను వ్రాసే అవకాశం కలిగించారు. ఆ వైద్యుడు తిరిగి వచ్చినప్పుడు శ్రీ స్వామీజీ వారు ఆ వుత్తరాన్ని తీసుకుని నాకు ఒక స్ఫటికాన్ని వారు యిద్దరు కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న సందర్భంలో సృష్టించి యిచ్చారని, అతను దానిని తన భార్యకు యిచ్చానని ఆమె హూస్టన్ వెళ్లిందని తెలిపారు. నేను ఆ స్ఫటికాన్ని పొందలేకపోయినందుకు కొంత నిరాశ చెంది అతని భార్య తిరిగి వచ్చే వరకు ఆ బహుమతి కోసం ఎదురుచూశాను. నా నిరాశ, ఆ బహుమానం నాకు నా పుట్టిన రోజున అందడంతో మటుమాయమయింది. ఆ రోజు నాకు స్వామీజీ వారి స్వప్న దర్శనం వారు ట్రినిడాడ్లో వున్నట్లుగా అగుపడడంతో నాకు మెలకువ వచ్చింది. యిది నా పుట్టిన రోజున అందిన మొదటి బహుమతిని తెరిచి చూసే అద్భుత ఘడియ అని అనిపించింది. ఆ స్ఫటికాన్ని నా మెడలో చాలా నెలల పాటు అది అదృశ్యమయ్యేవరకు ధరించాను. నేను దానికోసం పిచ్చిగా చాలా చోట్ల వెతికాను. నేను యీ విషయాన్ని చాలా బాధతో ఒక భక్తునితో తెలపగా స్వామీజీ వారు ఒక వుద్దేశ్యం కోసం అలా సృష్టించి యిస్తారని అది పూర్తవ్వగానే అవి అదృశ్యమవుతాయని తెలిపారు. సరి అయిన భక్తుని ద్వారా సరయిన సమయంలో తెలపడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత కాలమలో స్వామీజీ వారి మాటలను తెలపడానికి యిది ఒక ఉదాహరణగా చెప్పడానికి అవకాశం కలిగింది. ఎల్లప్పడు యిలాగే భగవంతుని అనుగ్రహం సంభవించి, ప్రవహిస్తూ, యీ సృష్టి యొక్క వాస్తవ సత్యాన్ని తెలుపుతుంది.

శ్రీ స్వామీజీ వారిని చూసిన మొదటివారంలో, ‘‘భారతదేశానికి రండి. శ్రీ స్వామీజీ వారు ఎప్పుడు రావాలి అనేది చెబుతారు’’ అని అన్నారు. ఒక సంవత్సరం తరువాత డాక్టర్ యలమంచిలి ఆసుపత్రి తరపున భారతదేశంలో ‘‘విద్యాశిక్షణ’’ కు డబ్బు చెల్లించగలిగారు. నాకు రెండు వారాల జీతం కూడా యివ్వడం జరిగింది. ఒంటరి తల్లినవడం చేత భారత దేశ పర్యటన సమీప భవిష్యత్తులో వీలవుతుందని నేను అనుకోలేదు. భగవంతుని సృష్టి అనంతమైనది. బయలుదేరే ముందర నేను నెలవారీ బిల్లులను చెల్లించడానికి నా చెక్కులను వ్రాశాను, కానీ నేను పొరపాటుగా వాటిని అన్నింటినీ కలిపి మెయిల్లో వేశాను. తక్షణమే నాకు నా ఖాతాలో తగినంత నిధులు లేకపోవడంతో నేను ఒక సంతకం చేసి రుణాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ధ్యానంలో నాకు ఆ రాత్రి శ్రీ స్వామీజీ వారు నా మనోదృష్టిలోకి వచ్చి నా యిల్లును, కారును, నా పిల్లలను, మరియు నా డబ్బును తీసేసుకుని అవేవి నావి కాదని చెపుతూ అంతరిక్షంలోకి విసిరారు. ఈ సందేశం నన్ను అన్ని ఆందోళలను విడిచి సృష్టికర్త మీద ఆధారపడమని స్పష్టంగా తెలిపింది. ఆ మరునాడు నేను అనుకున్న ప్రకారం 1500 డాలర్ల రుణ దరఖాస్తు ఆమోదించబడింది. నా విశ్వాసంలో ఒక స్వచ్ఛంద సంస్థకు ఈ డబ్బును విరాళంగా యివ్వాలని ధర్మ సంకేతంలా కనిపించింది. కాబట్టి వారు ఆజ్ఞాపించిన విధంగా తను చేసిన సృష్టిలో అన్నింటిపైన శ్రద్ధ వహించే వానిపై ఆధారపడడం నేర్చుకోవడానికి నాకు యిది ఒక పాఠం. నేను యింటికి తిరిగి వచ్చిన తరువాత నా మెయిల్ బాక్సులో దత్త యోగ సెంటరు, యు.ఎస్.ఎ వారి నుండి ఒక విరాళపు కార్డు, అలాగే ధాన్యపు పెట్టె వున్నాయి. ఈ సృష్టి యొక్క సారాంశంలో మునిగిపోతున్న శ్రద్ధను, ప్రేమను మరియు ఆనందాన్ని శ్రీ అప్పాజీ వారు చూపించారు.

ఆ డబ్బును తక్షణమే DYCUSA కి పంపబడి తరువాతి వారం అక్కడికి ఆ డబ్బు చేరింది. రోజువారీ మెయిల్ బాక్సులో ధాన్యంతో కూడిన బాక్స్ వుండేది. పేడే నాడు నా బ్యాంకు ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ లేకుండా యింకా కొన్ని డాలర్లు వున్నాయి. వారు ఆందోళన చెందవద్దనీ, యివన్నీ కూడా వారికి చెందినదే అనే సందేశాన్ని యిస్తున్నారనే అద్భుతమైన భావన. మనము కేవలం వారి సృష్టికి మాత్రమే బద్ధులము కాకుండా, మనకు మనముగా మేల్కొని చైతన్యవంతులమవ్వడానికి ఖచ్చితమయిన నిర్ణయాన్ని కలిగివుండవలసిన అవసరం వున్నది.

ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే నాకు అందమయిన దత్తమూర్తిని చూడగానే కన్నీరు కారింది. ఉదయం పూజ చేసిన పూజారిని సమీపిస్తున్నప్పుడు, అతను నన్ను ముందురోజు రాత్రి దృశ్యంలో చూసానని తెలిపారు. అనంత సర్వశ్రేష్ఠతతో భగవంతుడు ఏకకాలంలో మానవుని నుండి మానవునకు, భక్తుని నుండి వేరొక భక్తుని వద్దకు చేరతాడు, శిరస్సు పైని ప్రతి వెంట్రుకను లెక్కిస్తాడు. తరువాత ఆ రోజు ఉదయం ఆలయంలో కూర్చుని వుండగా, ఎవరో నా భుజంపైన చీరలను వేశారు. అవి నాకు ఆ సమయంలో చాలా అవసరం. నా వెనకాల ఒక ప్రముఖ వ్యక్తి కూర్చుని వున్నారు. నేను యుఎస్ఏ లోని దత్త యోగ సెంటర్ ప్రెసిడెంట్ అయిన డాక్టరు ప్రకాశరావుని కలవాలని భావిస్తున్నాను. శ్రీ స్వామీజీ వారు ఈ విశ్వంలోని పని విధానాన్ని ఎలా చూపిస్తారో అర్ధం చేసుకోవడం మొదలుపెడుతున్నాను. నాకు బహుశ యిన్ని వేల మందిలో వారు డాక్టరు రావు గారేమో అని అనిపించింది.

నన్ను పరిచయం చేసుకుంటూ, వారు డాక్టరు రావునని తెలిపారు. వారికి నేను ఎవరినో వారికి విశ్వాసంలో తెలిసి వున్నందున, వారు అప్పాజీ వారి కోసం తగిన ధనం లేకపోయినా కూడా దత్త మాలను ప్రచురిస్తానని ఒప్పుకున్నారు. శ్రీ అప్పాజీ వారు అతనికి చింతించవద్దనీ, ఆ ప్రచురణకు అవసరమయిన పదిహేను వందల డాలర్లు అందుతాయని తెలిపారు. ఆ తరువాత DYCUSA వారికి అందిన విరాళం నేను బ్యాంకు నుండి ఋణం తీసుకుని పంపిన డబ్బు. యిటువంటి సంఘటనలు రోజూ జరుగుతూ నాకు అప్పాజీ వారి మీద ప్రేమను భక్తిని పెంపొందింపచేశాయి. మన మానవ కుటుంబంపై క్షణ క్షణం శ్రీ అప్పాజీ వారి పాత్ర ప్రభావితం అవుతుంది. స్వామీజీ వారు మనకు నిత్య జీవితంలో ఒక ఉదాహరణగా, మనకు అన్ని విధాలా అనుభవాన్ని నేర్పుతూ మన మంచి కోసం ప్రేమతో మనకు పాఠాలు నేర్పుతారు. యిదంతా వారికే చెందుతుంది. వారు/భగవంతుడు/శాంతికి ప్రతీక/ మనకు అర్ధమయ్యే భగవంతుడు. ఈ డబ్బు, కార్లు, యిళ్లు, పిల్లలు వంటి బాధ్యతలు. కేవలం మనుగడను సాగించడమే కాకుండా, మనుగడను ఎలా నేర్చుకోవాలన్నది మనం తెలుసుకోవలసిన బాధ్యత.

భారతదేశంలో మిగిలిన కాలం నేను చాలా అద్భుతంగా గడిపాను. అమెరికా నుండి వచ్చిన యితర భక్తులు నాకు స్నేహితులయ్యారు. వారిలో పిట్స్బర్గ్ లోని జీసస్ దత్త రిట్రీట్ సెంటరు నుండి పద్మ ఒకరు. యిది మా యిద్దరికీ సోదరీ సంబంధమైన దీవెనగా మొదలయింది. ఈ మొదటి పర్యటనలోనే శ్రీస్వామీజీ వారు నాకు బిందూ అని పేరు పెట్టారు. ఈ పేరు పొందిన తరువాత నేను చాముండి హిల్స్ సందర్శించాను. ఒక చిన్న పిల్లవాడు నన్ను దారిలో బిగ్గరగా ‘‘మీ పేరు ఏమిటి?’’ అని అడిగినప్పుడు, నేను లిన్నే అని స్పందించాను. అయినా, శ్రీ స్వామీజీ వారు నాకు కొద్ది క్షణాల క్రితం చెప్పిన పేరును చెప్పలేకపోయినందకు నేను బాధపడ్డాను. నేను నా మనసులో ఈ విధంగా చింతిస్తూ నడుస్తున్నప్పుడు అద్భుతంగా మరో యువకుడు నన్ను ఖచ్చితంగా ‘‘మీ పేరు ఏమిటి’’ అని అడగడంతో నాకు వాస్తవానికి నా పేరును చెప్పటానికి మరో అవకాశం వచ్చినందకు సంతోషంతో స్పందిస్తూ ‘‘బిందూ’’ అని చెప్పాను. శ్రీ స్వామీజీ వారి సహనం మరియు సృజనాత్మకత అనంతమైనది మరియు భక్తిని ఏర్పరుస్తుంది.

ఆశ్రమానికి తిరిగి వెళ్లి నేను దేవాలయానికి వెళ్లే మార్గంలో కూర్చుని ధ్యానం చేయసాగాను. ఆశ్రమానికి సంబంధించిన నియమాలు నాకు అంతగా తెలియవు. నా చెవి వద్ద పెద్ద శబ్దం చేస్తూ నన్ను ధ్యానం నుండి బయటకు వచ్చేలా చేసింది. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ శ్రీ స్వామీజీ వారు నా వెనుక పెద్ద సమూహముతో నిలబడి వున్నారు. వారు తమ చేతితో చప్పట్లు చరుస్తూ నాకు ఒక మిఠాయిని సృష్టించి యిచ్చారు. గురువు మనలో వున్న భగవంతుణ్ని మనం కనుక్కోవడానికి తగిన సహాయం చేస్తారని ఒక మధురమైన మిఠాయితో అనంతమయిన సృజనాత్మక రీతిలో బలోపేతం చేసారని దీని వలన నేను తెలుసుకున్న పాఠం. ఆ తరువాత 1995వ సంవత్సరంలో శ్రీ స్వామీజీ వారు యుఎస్ఏ విచ్చేస్తున్న సందర్భంలో మేము బాటన్ రూజులో వారి కార్యక్రమాల తయారీలో నిమగ్నమయి వున్నాము వారు వచ్చే రోజున మేము న్యూ ఓర్లీన్స్ విమానాశ్రయానికి రాత్రి పది గంటల ప్రాంతంలో వారిని తీసుకుని రావడానికి చేరుకున్నాము. ప్రయాణికులందరూ విమానంలోంచి బయటకు వస్తారని మేము నిలబడ్డాము. మాకు కారిడార్ వద్ద స్వామీజీ వారు కనిపించలేదు. మాకు ఏదో వింతగా తోచింది. ప్రయాణికులందరిలో కనీసం సగం మంది వారి వారి స్వస్థానాలకు కూడా వెళ్లిపోయారు. రాత్రి సమయం కావడంతో అంతా చీకటిగా ఖాళీగా వుందిం. మాకు చాలా దూరంగా అనేక గేట్ల అవతల శ్రీ అప్పాజీ వారు ఒక గది డివైడర్ తెర వెనుక నుండి వారి తలను బయటకు పెట్టి నవ్వుతూ కనిపించారు. ప్రతి ఒక్కరు చీకటిలో హాల్ క్రింద భాగానికి పరిగెత్తారు. ఒక ఆహ్లాదకరమైన దృశ్యం మా గురువును చూడడానికి సంతోషంగా అందరం వెళ్లాము.

ఈ పర్యటనలో బాటన్ రూజ్ వద్ద శ్రీ స్వామీజీ వారి బుక్ స్టాల్లో సహాయపడిన స్మితపటేల్కు ఒక బహుమతిని యివ్వమని అడిగారు. ఆమె గదిలో లేరు. కానీ నేను అక్కడ వుండిపోవడంతో విలక్షణంగా పాక్ చేసిన ఒక బహుమతి పెట్టెలలోంచి యాదృచ్ఛికంగా ఒక భక్తుడు ఒకదానిని బహుమతిగా ఎంపిక చేశాడు. శ్రీ స్వామీజీ వారు వారి చేతిలో ఒక పసుపు గులాబీ పువ్వు వున్న పెద్ద కొమ్మతో ఆ బహుమతిని స్పర్శ చేసి స్మితకు యివ్వమని చెప్పి నాకు అందజేశారు. వారు వెళ్లిన తరువాత స్మిత చాలా దూరంగా ఒక పక్కన నిలబడి వుండడం చూసి ఆమెకు ఆ బహుమానాన్ని అంద జేశాను. ఆమెకు అది ఎలా వచ్చిందో వివరించి చెప్పాను. ఆమె అది విప్పి చూడగా అందమైన తాజా పసుపు గులాబీ రేకుల కింద ఒక అందమయిన వాచ్ వుండడం చూసింది. ఆ బహుమతిలో మధురమైన గొప్ప సంజ్ఞలు కలిగిన సంభాషణా విధానాన్ని తెలిపేలా వున్నది.

బాటన్ రూజ్ నుండి శ్రీ స్వామీజీ వారు ట్రినిడాడ్ ప్రయాణమయ్యారు. నేను ముందుగానే అక్కడికి వెళ్లడానికి నా టిక్కెటును బుక్ చేసుకున్నాను. శ్రీ స్వామీజీ వారితో పాటుగా మాలో అనేకమంది ఆ సాయంత్రం అదే విమానంలో ప్రయాణం సాగించాము. భక్తులలో ఒకరు స్వామి మానస, పూర్వాశ్రమంలో ‘రాధాకృష్ణ’ మరియు నేను శ్రీ అప్పాజీ వారి వెనుక ఐదవ వరసలో కూర్చున్నాము. మా మధ్య ఆధ్యాత్మిక చర్చ జరుగుతున్న సమయంలో, నా దృష్టి అప్పాజీ కూర్చున్న వైపుకు ఆకర్షించింది. ఒకే తలుపు కలిగి వున్న ప్రతి వైపున హనుమంతుడి ప్రతిమలు ఒకదానికొకటి ఎదురుగా తలలు వంచి వున్నట్లు గోడలపై విగ్రహాలు రూపాలు గోడలపై అగుపించాయి. శ్రీ స్వామీజీ వారి ముందుర హనుమంతుడు దారి తీస్తూన్నట్లు కనిపించింది. నాకు ఆ సమయంలో ట్రినిడాడ్ యొక్క భవిష్యత్తు గురించి కొద్దిగా అర్ధమయింది. చాలా సంవత్సరాల తరువాత శ్రీ స్వామీజీ వారు ఎనభై అయిదు అడుగుల ఎత్తు గల హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తమ సంకల్పాన్ని ప్రకటించారు.

ట్రినిడాడ్ కు యిది నా మొట్టమొదటి పర్యటన. యిది చాలా అద్బుతమయిన పర్యటన. బాటన్ రూజ్ కార్యక్రమంలో చాలా గంటలు పని చేయడం చేత నేను అలసిపోవటంతో నా ముక్కు పట్టేసింది. నేను మంచం మీద దోమతెర వేసుకుని నిద్రపోయాను. నా నాసికా రంధ్రాల కవాటం వద్ద అకస్మాత్తుగా పెద్ద పేలుడు వినిపించి నాకు మెలకువ వచ్చింది. నా మంచం మొదలు శ్రీ స్వామీజీ వారి రూపం ఏకకాలంలో పారదర్శకంగా నాకు కనిపించింది. నేను ఆ మరునాడు నా యీ అనుభవాన్ని యితరులకు వివరిస్తున్నప్పుడు మరొక భక్తురాలు కూడా నిద్ర లేచి శ్రీ స్వామీజీ వారిని చూశానని తెలిపింది.

మరునాడు ఉదయం దర్శనం చేసుకునే సందర్భంలో, నా అనుభూతిని, ప్రశంసలనూ వ్యక్తం చేస్తూన్నప్పుడు శ్రీ అప్పాజీ వారు నవ్వి ‘‘స్వామీజీ వారు రాత్రి అందరి దగ్గరికి వచ్చానని తెలిపారు.’’ యిది ఎంతటి మధురమైన అనుభూతి. అప్పాజీ వారు తన పిల్లలందరి పట్ల ఆ పర్యటన సందర్భంగా వెచ్చని వ్యక్తిగత శ్రద్ధను కనపడకుండా తన భక్తులపై వుంచారు. అలాగే విసుగు చెందకుండా అక్కడ వేచి వున్న మూడువేల మంది ప్రేక్షకులను కూడా చూశారు. వారు సాధారాణ పేదల గృహాలకు సహితం చాలా సాధారణంగా వెళ్లి వారిని ఆశీర్వదించారు. అదే విధంగా విలాస వంతమైన పెద్ద గృహాలకు కూడా వెళ్లి వారినీ ఆశీర్వదించారు. యిది సూర్యకాంతి ఏ విధమైన వివక్షత లేక విభిన్న పరిస్థితులలో కూడా తన కాంతిని సమానంగా ప్రసరించే విధంగా అప్పాజీ వారు అన్ని యిళ్లలోనూ ఒకే విధమైన ప్రేమను వ్యక్తపరిచారు. వారు ఎవరి మీద వివక్ష చూపక అందరినీ సమానంగా ప్రేమతో ఆదరిస్తారని నాకు ఈ సంఘటన తెలియజేసింది.

శ్రీ అప్పాజీ వారు వేలమంది ప్రేక్షకులను ‘‘మీ కళ్లు మూసుకోండి. స్వామీజీ వారు మీకు కృష్ణుని దర్శనం కలిగిస్తారు’’ అని చెప్పారు. నేను నా కళ్లను మూసుకుని నా మనసులో ‘‘యిది ఎలా సంభవం నాకు కృష్ణుడి గురించి నిజంగా తెలియదు, కానీ సరే చూద్దాం అని అనుకుంటుండగా హఠాత్తుగా స్పష్టమైన దృక్పథం కృష్ణుని గురించిన అవగాహన నాలో నిండిపోయింది. కృష్ణుడు తన వేణువును వూదుతూ గాలిలో అద్భుతమైన ధ్వని కంపనం సృష్టించాడు. కృష్ణుడి అడుగులను అనుసరిస్తూ మానవ సమూహం, ఒకరి వెనుక ఒకరు అనంతం వరకు విస్తరించారు . గడ్డి పొడవుగా వుండి కృష్ణుణ్ని అనుసరించ సాగింది. చెట్ల ఆకులు కూడా కృష్ణుని యొక్క లయ మరియు కదలికలను అనుసరిస్తున్నాయి. వాన మందంగా యీ దృశ్యాన్ని పులకరింపచేస్తూ, చెట్లను గడ్డినీ, మనుషులను, కృష్ణున్ని తడిపసాగింది. వాన నెమ్మదిగా కృష్ణుని యొక్క మంద్ర శబ్దాన్ని అనుసరిస్తూ, లయ విన్యాసం చేస్తూ భూమిపైన కురవసాగింది. యిది ఒక అద్భుతమైన అధునాతనమైన బోధన. చిన్న గడ్డి పోచ కూడా భగవంతుని దయలేకుండా అణువంత కూడా కదలలేదని, మరియు ఈ కృప ప్రతిక్షణం నిరంతరం జరుగుతూనే వుంటుంది.

సద్గరువుతో ఈ ట్రినిడాడ్ యాత్ర అనుభవాలు ఒకదాని తరువాత ఒకటిగా కొనసాగిన కలేడోస్కోపును ప్రతిబింబి చేసింది. మేము అక్కడ వున్నప్పుడు మా మధ్య గల ఒక హంతుకుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో నా అంతర్గతం నన్ను అత్యంత సంభావ్య ఎన్ కౌంటర్ కోసం నన్ను సిద్దం చేసింది. ఒక సారి శ్రీ స్వామీజీ వారి రాకకోసం ప్రతి ఒక్కరు మందిరంలో ఎదురు చూస్తున్న సందర్భంలో నేను అక్కడి యాగం కోసం ఋత్విక్కుల చేస్తున్న పఠనంపై ధ్యానాన్ని కేంద్రీకరించాను. నేను నా కళ్లను తెరిచినప్పుడు నా పక్కగా వెచ్చని స్పర్శ కలిగింది అక్కడ ఒక అతను ఒక చిన్న బిడ్డతో కూర్చుని వున్నాడు. నా మనసు నన్ను నీకు చెప్పాను గదా అని హెచ్చరించ సాగింది. అతను తను ఒక పోలీసు అధికారిని తన విధి నిర్వహణలో భాగంగా చంపడం జరిగిందని తెలిపాడు. అతను జైలులో వుండగా ఒకరోజున నిజాయితీగా లోతుగా ప్రార్ధిస్తున్న సమయలో ఒక పరిచయస్తుడు తనకు శ్రీ అప్పాజీ వారి ఫోటోను తెచ్చాడనీ, ఒక అద్భుతమైన కాంతి ఆ ఫోటోనుండి తన శరీరంలోకి ప్రవేశించిందనీ, దాని వలన తాను పూర్తిగా మారిపోయానని, అందరినీ ప్రేమగా చూడడం మొదలు పెట్టానని, తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేశానని తెలిపాడు.

అనేక సంవత్సరాలుగా నేను నా కార్యాలయంలో చికిత్స నిర్వహించినప్పుడు మాజీ ఖైదీలు నా ఎదురుగా చికిత్స నిమిత్తమై కూర్చుని వుండేవారు. ఈ అనుభవం నాకు మానవ హృదయాలను మార్చివేసే అద్భుతాలను గుర్తు చేసింది. యితని కథ, నన్ను యింకా స్థిరంగా నిశ్శబ్దంలో నా మనస్సు లొంగిపోయేలా చేసింది. యిలా నిశ్శబ్దంగా మనం శరణాగతి భావంతో మనలో జరిగే పోరాటల ద్వారా ప్రేమభావాన్ని మేల్కొనడం చూడగలమని నాకు తెలుసును. మానవ స్పృహ లోపల నివసించే ప్రేమ బహిర్గతమవుతుంది.

ఒక గురువు తన భక్తుని యొక్క దృష్టిని ఆకర్షించడానికి తన భక్తునికి మార్గనిర్దేశం చేసి ఉపయోగించుకోవాలి. అతను భౌతిక స్థాయిలో అనేక అద్భుతాలు చేస్తాడు. అలాంటి ఒక సందర్భం ఒక రోజు సాయంత్రం దత్త ఆలయంలో ట్రినిటీ హాలులో జరిగింది. ఎవరిదో చేయి దృఢంగా నా శిరస్సుమీద కూర్చున్నట్లు నాకు అనిపించింది. శ్రీ స్వామీజీ వారు నాకు పదిహేను అడుగుల దూరంలో ఆశీనులయి వున్నారు. ఎవరూ నన్ను తాకడం లేదు. ఆ రాత్రి నేను కారులో యింటికి డ్రయివ్ చేస్తూ, నా స్వరంలోనుండి విభిన్నంగా ధ్వని రావడం గమనించి ఆశ్చర్యపోయి ఒకే వినోదంగా నేను గతంలో నాకు కష్టంగా తోచిన వివిధ గమకాలను ప్రయత్నం చేశాను. మరుసటి ఉదయని నేను స్వామీజీ వారిని చూసేందుకు విమానాశ్రయానికి వెళ్లినప్పుడు శ్రీ అప్పాజీ వారు ‘‘బిందూ, మీరు నా ఆలయంలో భజనలను పాడాలని నేను కోరుకుంటున్నాను’’ అన్నారు. భజనలు పాడమని నా గురువు యొక్క ఊహించని అభ్యర్ధన అని నేను చెప్పవచ్చును. కాని మునపటి రాత్రి అనుభవం భావన నాలో దత్తుని యొక్క మహిమలను పాడాలని లోతైన కోరికను కలిగించింది.

డల్లాస్, TX, మరియు ష్రెవెపోర్ట్, LA మధ్య ఉన్న ఒక అందమైన ప్రదేశం హనుమాన్ టెంపుల్ మరియు దత్త టెంపుల్ మధ్య నడుస్తుంది. డల్లాస్కు శ్రీ అప్పాజీ యొక్క పర్యటన పూర్తిగా ప్రేరేపించడం చేత నేను బాటన్ రూజ్ కు తిరిగి వెళ్లేటప్పుడు దారిలో భజనలను పాడాలని సంకల్పించాను. ఒక గంట వరకు పాడిన తరువాత నాలో ఒక శక్తివంతమయిన ఊపందుకుని నా శరీరంలోకి వచ్చింది. అది ప్రకృతి, అదే ఈ శక్తి. ఈ ఏకకాలంలో స్వభావం మొత్తంగా నాతోపాటు పాడడం ప్రారంభించింది. నాతోపాటుగా అక్కడి దృశ్యాలు ప్రతిస్పందించసాగాయి. శ్రీ అప్పాజీవారి భజనలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించసాగింది. నేను యింటికి వెళ్లకుండా నేరుగా ఆలయానికి వెళ్లాలి పాడాలనే బలమైన నిర్ణయానికి వచ్చాను. అక్కడ చాలా మంది భక్తులు నేను పాడడంలో అద్భుతమైన తాదాత్మ్యతను చెందానని తెలిపారు. మనమంతా దీనిని నేర్చుకోగలిగాలి. వారు లేనిదే మనము లేము. మనకు ఎంత మంచి దైవిక జీవనం కలిగివుండేదో, అదే మన నిజ స్వరూపం మన స్వీయ జన్మహక్కు. (యిట్ అని పేరుతో వివిధ భాషలలో పిలువబడేది). అది ఆ శక్తి మనందరికి అందుబాటులో వుంటుంది. కానీ అది ప్రతికణం యొక్క సృష్టిలోనూ, జీవ శక్తిలోను సమర్ధవంతంగా వుంటుంది.

జయ గురు దత్త

Tags: