మనం వ్యక్తులగా జన్మించి ప్రపంచంలోని భౌతిక విశేషాలను గుర్తించి వాటిని అంగీకరించడానికి తగిన తర్ఫీదును పొందుతాము. అయితే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వ వికాసానికి కొన్ని విశేష అంశాలు ప్రధానంగా దోహదమమవుతాయి. ఈ ప్రధాన అంశాలే ఒక వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ తన యొక్క యిష్టానిష్టాలను వ్యక్తపరచడానికి ప్రధానంగా బాధ్యత వహిస్తాయి.
దీనికి తార్కాణంగా నేను ఒక అభిప్రాయాన్ని యిక్కడ ఉదహరిస్తాను. హిందూమత సిద్ధాంతం ప్రకారం ఆత్మలు తమ పూర్వజన్మలో సేకరించిన కర్మలను అనుసరించి మళ్ళీ జన్మలను స్వీకరిస్తారు. ఈ తలంపు ముగ్గురు ఆత్మల యాదృచ్ఛిక అనుసంధాతను తెలుపుతుంది. శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆంథోని ఆల్బర్ట్ మరియు నేను. ఒక వినయపూర్వక మరియు నిజాయితీతో ప్రారంభమయి పెద్ద సంస్థగా ఏర్పడడానికి కారణమయి ఆత్మలను కలుపుతూ, అనేక మంది ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఒక చోట కలిసే అవకాశం కలిగింది.
మొదటగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి తత్త్వము ఒక అంతుపట్టని రహస్యమనీ మరియు ప్రాపంచికంగా వారిని అంచనా వేయలేము. కానీ వారు చేసే క్రియలు ప్రాపంచికంగా కనపడుతూ, తన భక్తుల యొక్క స్థితిని ఉత్థానంలోకి తీసుకుని వస్తారు. ఈ క్రియలను వర్ణించలేము. వారు వర్ణానాతీతులు. ఒక యువకునిగా ట్రినిడాడ్లో పెరుగుతూ, నాకు అవ్యక్తాన్ని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. నేను తాంత్రిక మరియు మార్మికతలలో నిమగ్నుడనవసాగాను. నాకు యింకా బలీయమయిన శక్తిని గురించి తెలుసుకోవచ్చుననే విషయం అర్థమయింది. నేను నా కొద్దిమంది స్నేహితులతో కలిసి ఈ అద్వితీయమయిన శక్తిని గురించి తెలుసుకోవడానికి టోరట్ కార్డులను చదవసాగాము. మాకు అశ్చర్యం కలగజేస్తూ ఆ ఐంద్రజాలికుడు ఒక కార్డును భూమి అడుగున దాచి ఉంచడం గమనించాము. ఒక రకంగా యిది మా అన్వేషణకు మంచి సంకేతమని భావించాము.
మా అన్వేషణ మొదలయింది. ఈ సమయంలో శ్రీ సత్యసాయిబాబా వారి బోధనల ప్రభావం ట్రినిడాడ్ ప్రజలలో బలీయంగా వున్నాయి. దేశవ్యాప్తంగా సత్సంగాలు జరుగుతూ వుండేవి. మేమంతా ఈ సత్సంగాలలో పాల్గొని అక్కడ జరుగుతున్న విషయాలను చూసి చాలా సంతోషించాము. మేము ప్రయత్నం చేసి, ఈ అగోచరమయిన శక్తిని కనుగొనలేకపోయాము. ఒకరోజున మా బృందంలోని సభ్యుడయిన ఆంథోని ఆల్ఫన్సే, అనే యిరవై సంవత్సరాల ఆఫ్రో-ట్రినిడాడ్ యువకుడు భారతదేశానికి వెళ్ళి ఈ అద్వితీయ శక్తిని వెదకాలని తను పని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 1975లో భారతదేశానికి వెళ్ళాడు. సత్యసాయిబాబా సత్సంగాలతో గల అనుభవం కారణంగా అతను పుట్టపర్తి ఆశ్రమం చేరాడు. అక్కడ అతను వెదుకుతున్న విషయం దొరకలేదు. కానీ అతనిని భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఒక యువగురువు ఆశ్రమం మైసూరులో వున్నదనీ అక్కడకు వెళ్లవలసినదని అక్కడి ఒక భక్తుడు సలహా యిచ్చారు.
భారతదేశంలో వుండగా ఆంథోనికి వివాహం జరిగి, అతను దక్షిణాది పర్యటన చేస్తూ తన భార్య పుట్టిన వూరయిన బెంగళూరు చేరాడు. అతనికి ప్రశాంతి నిలయంలోని భక్తుడు చెప్పిన విషయం జ్ఞప్తికి వచ్చింది. ఆ తరువాత అతను తన కుటుంబ సభ్యులతో చర్చించి, అతని భార్యతో కలిసి ఈ గురువును కలవాడానికి మైసూరు వెళ్లాడు. అతను అక్కడ ఉన్న కొద్దికాలంలోనే తను వెతుకుతున్న అద్వితీయ శక్తిని అక్కడ శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిలో చూచి మైమరచిపోయాడు.
అమిత ఉత్సాహంతో ఆంథోనీ ట్రినిడాడ్ తిరిగి వచ్చి, తనకు తెలిసిన కొద్దిమంది వ్యక్తులతో కలిసి శ్రీ స్వామీజీ వారిని ట్రినిడాడ్ దేశస్ధులకు పరిచయం కలిగే ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో పాలుపంచుకొన్నవారు స్వర్గీయ రోడెరిక్ నోయల్, స్వర్గీయ బాసిల్ పిట్, డాక్టర్ దయానన్ చందూల్, స్వర్గీయ కృష్ణ కిశోర్ ప్రసాద్, డేవిడ్ బల్ రూప్ మరియు నేను. ఆగష్టు 14, 1976న ఆ ఆదిగురువు ట్రినిడాడ్ లో తమ పాదాలను మోపారు. ఆ మహారాజ పురుషుని రాజ్య పునఃస్థాపనను చూసిన మా అందరికి మహదానందము కలిగింది. వారి తత్త్వాన్ని పరిచయం చేయడానికి పునాది ఏర్పడి, ద్వారాలు తెరచుకుని ట్రినిడాడ్ జ్ఞాన బోధ సభ ఆవిర్భవించింది.
మేము ముందర దర్శించుకున్న ఈ మహాపురుషుని ఆధ్యాత్మిక సూచన కారణంగా మేము ఈ గొప్ప ఆధ్యాత్మిక దిగ్గజమయిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మా మానసిక/ఆధ్యాత్మిక పరిధిలో స్వీకరించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. వారి భౌతిక ఆకృతిని చూసి నేను మానసికంగా ఈ సృష్టిని నిలిపే అలౌకిక శక్తి వారేనని నిశ్చయించుకున్నాను.
నా జీవితపు ఆధ్యాత్మిక సంఘటనల గొలుసులలో ప్రతీ బంధమూ ఖచ్చితంగా యిమిడిపోతుంది. శ్రీ స్వామీజీ వారి ట్రినిడాడ్ సందర్శనలలో నా ఆధ్యాత్మిక మనుగడలో నాకు అనేక దర్శనాలు అనుభవమయ్యాయి. వారే నా మార్గదర్శి మరియు గురువు. వారు దైవికజీవుల సోపానంలో తలమానికులనీ, అనేక ఆధ్యాత్మిక అభివృద్ధి సాధనాలను కలిగివున్నారనీ నమ్మకం.
అప్పాజీ వారితో నా అనుబంధం అంతర్గతంగా పితృస్వభావమయినది. వారి ట్రినిడాడ్ పర్యటనల సందర్భంలో గానీ, లేక నేను భారతదేశం వెళ్ళినప్పుడయినా వారి సమక్షంలో కరుణాపూరిత భావం అనుభవమవుతుంది. వారు నా అన్ని ప్రయత్నాలలో మరియు కష్టసమయంలో నాకు మార్గదర్శక కాంతి అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు నా దైనందిన జీవితంలోని చిక్కుల యొక్క ఉనికిని అర్థం చేసుకునే నిపుణులు. వారే అన్ని అడ్డంకులను తొలగ జేయగల సమర్థులు.
ఆధ్యాత్మిక సాధనాపరులందరికీ నా వినయపూర్వక సూచన తమ సద్గురుని పరమ పవిత్రునిగా గుర్తించి వారి పాదాల వద్ద శరణాగతిని చేసి వారి అనుజ్ఞ ప్రకారం ఆచరించడానికి ప్రయత్నిస్తే తప్పక విజయం కలుగుతుంది.
జయ గురు దత్త