SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
కిశోర్ కుమార్. హైదరాబాదు (Kishore Kumar, Hyderabad)

1985-86 సంవత్సరంలో నేను ఉత్తరభారత దేశంలోని పవిత్ర ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళాను. కేదార్ నాథ్ సందర్శించినపుడు నేను ఒక స్వామివారిని దర్శించటం జరిగింది. వారిని గురించి నాకు పరిచయం లేదు. నేను వారిని యిదివరకు చూడలేదు. వారి దర్శనంతో నా శరీరం అంతటా స్పందనలు కలగసాగాయి. వారు నాకు ముందు కాలంలో మంచి జరుగుతుందని ఆశీర్వదించారు. ఆ సమయంలో నాకు వారి మాటలు అర్ధం కాలేదు.

యాత్రలు ముగించుకుని నేను యింటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి నేను టెలివిజన్లో ఒక పవిత్ర సంగీతకారుని సంగీత కచేరి ప్రదర్శనను చూసి ఆకర్షితుడనయ్యాను. వారి సంగీతాన్ని వింటున్నప్పుడు తెలియకుండానే నా కళ్ళవెంట నీరు కారసాగాయి. నేను మైమరచిపోయాను. నా భావోద్వేగాలను నియ్రతించలేకపోయాను. అటు తరువాత 1992లో నేను హైదరాబాదులో ఉగాది పండుగలకు హాజరయ్యాను. శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దర్శనం నాకు లభించింది. నాకు యీ కార్యక్రమాలలో కేదార్ నాథ్ లో కలిగినటువంటి అనుభవమే మళ్లీ కలిగింది. అప్పుడు నాకు వారే హిమాలయాలలో, టెలివిజన్లో మరియు హైదరాబాదులో దర్శనం యిచ్చిన స్వామివారు ఈ స్వామివారు ఒకరే అన్న విషయం అర్ధమయింది.

శ్రీ స్వామీజీ ఆయన ప్రసంగాలలో అనేక మార్లు యిలా అన్నారు. ‘‘నేను నేరుగా లేదా పరోక్షంగా మీకు జవాబిచ్చి ఆశీర్వదిస్తాను’’ అని యిది ఖచ్చితంగా నిజం. నాకు ఈ విధమైన అనుభవాలు చాలాసార్లు కలిగాయి. ఆయనపై నేను మరింత విశ్వాసాన్ని పెంపొందించుకున్నాను. నేను చాలా విషయాలు ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాను. ఒకసారి నేను కర్నూలులో పనిచేస్తున్నప్పుడు శ్రీ స్వామీజీ విశాఖపట్నంలో సంగీత కచేరీ చేశారు. నేను సేవ చేయటానికి వెళ్ళాను. నాకు గురునిలయంలో సేవను కేటాయించారు. నేను హాల్ నుండి వారి ప్రసంగాలు వినగలిగే అవకాశం కలగనందుకు నిరాశ చెందాను. మూడు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతుండగా, నేను గురునిలయం వద్దనే వుండవలసి వచ్చింది. అయితే నేను ప్రతి ఉదయం కార్యక్రమాల ప్రారంభం మరియు సాయంత్రం కార్యక్రమాల ముగింపు సమయాలలో స్వామీజీ వారిని దర్శనం చేసుకోగలిగినందుకు సంతోషించాను.

గురునిలయానికి సమీపాన ఒక స్త్రీ తన కష్టాలను నాతో వివరిస్తున్న సందర్భంలో నేను ఆమెకు దత్తదీక్షఃను గురించి వివరించి ఆమెను ఈ దీక్షను స్వీకరించి పాటిస్తే ఆమె కష్టాలు పరిష్కారం అవడానికి దోహదం అవుతుందని తెలిపాను. ఆమె స్వామీజీ వారి దర్శనం కోసం ఆ మూడు రోజులు ప్రయత్నం చేసినా వీలు పడలేదు. చివరకి నేను ఆమెను ఆ యింటి యజమానిని సహాయం కోసం సంప్రదించమనీ, నేను సేవాకార్యక్రమాలలో వున్నందున అంతకన్న ఏ విధమయిన సహాయం చేయలేనని తెలిపాను.

చివరి రోజు కార్యక్రమం ముగియగానే, ఆమె బయలుదేరే ముందు వచ్చి శ్రీ స్వామీజీతో మాట్లాడానని తెలపటంతో నేను ఆశ్చర్యపోయాను. ఆ యింటి యజమానులు ఆమెను తీసుకువెళ్లారని, ఆమెను పరిచయం చేయబోతుండగా, శ్రీ స్వామీజీ వారు వారిని ఆపివేసి, ‘‘నేను ఈ రోజులలో మీరు చేయవలసిన పనులన్నింటిని మీకు చెప్పాను, కాబట్టి మీరు వాటిని ఆచరిస్తే బాగానే వుంటారు’’ అని అన్నారని ఆమె తెలిపారు. శ్రీ స్వామీజీ మార్గనిర్దేశం చేయడానికి నన్ను ఒక పరికరింగా ఉపయోగించారని నేను ఆశ్చర్య పోయాను నేను ఈ జన్మలో తరించబడ్డానని అనుకుని చాలా ఆనందించాను. వారి ఉపన్యాసాలను వినలేకపోయాననే అసంతృప్తి మటుమాయమయింది. నేను చాలా సంతృప్తితో కన్నీరు కార్చాను. యిది నేను మర్చిపోలేని నా ఒక అనుభవం.

కాకినాడలో ఒక కార్యక్రమంలో, నేను శ్రీ స్వామీజీకి ఎస్కార్ట్ గా ఉన్నాను. ఈ కార్యక్రమంలో తెరవెనుక సేవ చేస్తున్న మరి ఒక సేవకుడూ, నేను యిద్దరము వేదిక నుండి దూరంగా వెళ్ళాము. అక్కడ చాలా చీకటిగా ఉండగా మేము కొంత దూరం వెళ్లాము. నాతో పాటు వున్న నా భాగస్వామి బాత్రూమ్ ఉపయోగించడానికి వెళ్ళారు. నేను శ్రీ స్వామీజీ గురించి ఆలోచిస్తూ నిలబడి ఉన్నాను. అకస్మాత్తుగా రహదారి పక్కన ఒక వాన్ ఆగిపోయింది. శ్రీ స్వామీజీ డ్రైవరు సీటులో కూర్చొని వుండి నా వంకకు చూసి చిరునవ్వు చిందించటం నేను చూశాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నాకు వణుకు పుట్టిసాగింది. నా శరీరం కంపించడం మొదలుపెట్టింది. నేను నిలబడలేకపోయాను. నేను స్దబ్ధుడనయి వారిని ప్రార్థించసాగాను.

నా భాగస్వామి తిరిగి వచ్చినప్పుడు నేను మాట్లాడలేకపోయాను. నేను వాన్లో శ్రీ స్వామీజీని చూశాను. కాని తిరిగి వచ్చినప్పుడు వారు అదృశ్యమయ్యారు. నేను కొంతసేపు నడచి వెళ్ళలేకపోయాను. మేమిద్దరమూ మౌనంగా ప్రార్థించాము. కొంత సమయం తరువాత నేను వేదిక వైపుకు నడవడం మొదలుపెట్టాను. అప్పుడు శ్రీ స్వామీజీ అనుగ్రహ ప్రసంగాన్ని వినగలిగాను. అప్పుడు శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ భాషణాన్ని వినగలిగాను. ‘‘మీరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటే, భక్తితో ప్రార్ధన చేయండి యిప్పుడే కొంతమంది వేదిక వెనుకవైపు నా దర్శనాన్ని పొందగలిగారు. వారు రామ మరియు కృష్ణ అని ప్రార్థించారు వారికి దర్శనం కలిగింది.’’ అని చెప్పారు.

ఈ ప్రసంగాన్ని విన్న తరువాత నేను మరింత మంత్రముగ్ధుడనయ్యాను. ఈ విధంగా శ్రీ స్వామీజీ వారు ప్రతినిమిషం మనం ఎక్కడ వున్నా వారు మనతో పాటుగా వుంటారని మనకు తెలియజేశారు. నా జీవితంలో అనేక సంఘటనలు నాకు ఆధ్యాత్మికంగా సహాయమయ్యాయి. నాకు వారితో నేరుగా మాట్లాడే అవకాశాలు చాలా తక్కువే అయినప్పటికీ నాకు చాలా మార్గాలలో బోధ చేసి నాకు పరోక్షంగా సమాధానాలు తెలిపి నన్ను దీవించినందువల్ల నేను ఎల్లప్పుడూ సంతోషంగా వున్నాను.

ఒకసారి పాదపూజ సమయంలో శ్రీ స్వామీజీ నన్ను‘‘మీరు ఏమి కోరుకుంటున్నారు?’’ అని అడిగారు. కర్నూలు నుండి హైదరాబాదుకు బదిలీ కాలవాలని నా భార్య కోరబోయింది, కానీ నేను ఆమెను అడ్డుకొని, శ్రీ స్వామీజీ వారితో మీరు చెప్పిన విధంగా అనుసరిస్తానని సమాధానమిచ్చాను. అప్పుడు వారు కర్నూలు జిల్లాలో సేవ చేయడానికి అంత అవకాశం లేదు అన్నారు. నేను ఆ మాటలకు సంతోషించాను. వెంటనే వారు మీకు బదిలీ కావాలనుకుంటే జరుగుతుందని తెలిపారు. నేను వారి ఆజ్ఞ ప్రకారం అనుసరిస్తానని తెలిపాను. శ్రీ స్వామీజీ వారు నన్ను ఆశీర్వదించి నాకు ఒక ఉంగరాన్ని బహుకరించారు. మరుసటి ఉదయం నేను ఆ ఉంగరాన్ని కోల్పోయాను. నేను ప్రతిచోటా ఆ ఉంగరంకోసం వెతికాను. అయితే నాకు దొరకలేదు. నేను శ్రీ స్వామీజీ వారికి ప్రార్ధన చేశాను. చిన్న చిన్న ప్రదేశాలలో వెదికిన తరువాత ఆ ఉంగరాన్ని నా జేబులో కనుగొన్నాను. తరువాత నేను శ్రీ స్వామీజీ వారిని కలిసి ఉంగరం పోగొట్టుకున్నానని వారికి తెలిపి క్షమార్పణ వేడుకున్నాను. కానీ వారు సరే అన్నారు. అయితే ఆ సమయంలో వారు నాకు ఆ ఉంగరం ఎందుకు యిచ్చారో గ్రహించలేకపోయాను. నేను చాలా మంది భక్తులు హాజరయ్యే బెల్గాల్ జిల్లాలో సత్సంగం , భజనలు మరియు యితర కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సేవను చేయడం ప్రారంభించాను.

కెనరా బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజరు యీ సత్సంగాలకు వచ్చేవారు. మా మామయ్య నా హైదరాబాదు బదిలీ విషయాన్ని ఆయనకు సిఫార్సు చేశారు. అతను నన్ను చింతించవద్దనీ ఆ బదిలీ విషయమయి కొన్ని యిబ్బందులున్నాయని తెలిపారు. ఒకరోజు ఉదయం నేను శ్రీ స్వామీజీ ఫోటోకి దగ్గరగా నిద్రిస్తున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. దీనిలో నేను ఒక ఉంగరం నుండి వెలుగురావడం చూశాను , అది తరువాత శ్రీ స్వామీజీ వారి ఫోటోలో విలీనమయిపోయింది. నేను మేల్కొనినప్పుడు కలలో చూసిన దృశ్యం నాకు అగుపించింది. నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు అందువలననే ఈ కల వచ్చింది అని అనుకున్నాను. ఈ ఉంగరం శ్రీ స్వామీజీ నాకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం యిచ్చారు. మరి యిప్పుడు నేను ఈ రకమైన కలలు పొందుతున్నాను. తరువాత నాకు ఆశ్చర్యం కలిగేలా నాకు హైదరాబాదుకు బదిలీ అయిందని ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నా గురువుగారి ఫోటోలోనికి ఆ కాంతి వెలుగులు విలీనం అయినప్పుడే నేను బదిలీ పొందాను. యిదంతా వారి చేత ముందే నిర్ణయింపబడినది ఆ తరువాత ఆ కాంతి వారిలో కలిసిపోయింది.

శ్రీ స్వామీజీ యొక్క ప్రాముఖ్యత మరియు వారి అద్భుతాలు వివరించలేనివి. యివి మహాసముద్రాలు. నా నోరు, మనస్సు, మరియు గుండె చెప్పడానికి చాలా చిన్నవి మరియు నేను చెప్పేది కూడా సరిపోదు. జంటనగరాల్లో నేను, నా భార్య వారి భజనల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. శ్రీ స్వామీజీ వారు దయతో, ప్రతి నిమిషం మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని కాపాడుతున్నారు. శ్రీ స్వామీజీ వారు తమ పవిత్రమైన ఆశీర్వాదం మామై కురుపిస్తున్నందున మేము వారికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము.

జయ గురు దత్త

Tags: