ప్రొఫసర్ కృష్ణకుమార్ గారి ముగ్గురు కుమార్తెలలో నేను పెద్దదానిని. మా చెల్లెలు దీపకు ఆమె మూడేళ్ళ వయస్సులో వుండగా ల్యుకేమియా వ్యాధి అని నిర్ధారణ అయింది. ఈ కారణం మా నాన్నగారిని మైసూరు ఆశ్రమానికి శ్రీ స్వామీజీవారిని సహాయం కోరడానికి వేళ్లేలా చేసింది. మా యింకొక చెల్లెలు రూప, దీప నేను మా నాన్నగారితో పాటు చిన్నపిల్లలుగా వున్నప్పుడు మైసూరు ఆశ్రమానికి వెళ్లేవాళ్లము. మేము జీవితంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి ఆశీస్సులతో పెరిగి పెద్దవాళ్లమయ్యాము.
నాకు వ్రాయడమంటే చాలా యిష్టంగా వుండేది. నేను శ్రీ స్వామీజీ వారికి ఉత్తరాలు వ్రాసేదాన్ని. చిన్న చిన్న విషయాలను కూడ వారికి వివరిస్తూ వ్రాసేదాన్ని. వారు కూర్చుని ఆ ఉత్తరాలను గట్టిగా చిదివి వినిపించేవారు. ఒకసారి మా నాన్నగారు స్వామీజీ వారి సన్నిధిలోనే నన్ను వారిని నా ఉత్తరాలతో యిబ్బింది పెట్టవద్దని మందలించారు. స్వామీజీ వారు దానికి బదులు యిస్తూ ఫరవాలేదు తనని వ్రాయనివ్వండి అది ఆమె తత్త్వం చాలా మంది యిలా వ్రాయలేరు అని చెప్పారు.
ఈ చిన్న వయసునుండి నేను శ్రీ స్వామీజీ వారికి సన్నిహితమయ్యాను. వారు నాకు మంచి స్నేహితులయ్యారు. నేటికి కూడా నేను వారికి ఉత్తరాలు వ్రాస్తాను. వారు మమ్మల్ని వారితోపాటు పర్యటనలకు తీసుకుని వెళ్లేవారు. వారు మొట్టమొదటిసారిగా బద్రీనాథ్, కేదార్ నాథ్, వెళ్లినప్పుడు మేము కూడా వారితో పాటు వెళ్లాము. వారి కారుణ్యస్వభావంతో మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. నాకు పన్నెండు సంవత్సరాల వయసులో నేను మైసూరు ఆశ్రమంలో వున్నప్పుడు నన్ను దోమలు కుట్టాయి. మరునాడు ఉదయం వారు నా మొహాన్ని చూసి ఏమయిందని అడిగి, కుసుమక్కయ్యని పిలిచి నా గురించి శ్రద్ధ తీసుకోవలసిందని నాకు దోమతెరను మస్కిటో రెపల్లెంటును యిచ్చారు. వారు దోమల బారినుండి నాకు రక్షణ కల్పించారు.
నాకు డాక్టరునవ్వాలని వుండేది. శ్రీ స్వామీజీ వారు నన్ను ప్రవేశ పరీక్ష వ్రాయమని తెలిపారు. నేను వ్రాశాను కానీ, పాస్ అవ్వలేదు. నేను బాధపడ్డాను. వారు నన్ను ఏడవవద్దనీ యిది నా మంచికోసమే జరిగినదని తెలిపారు. ఒకవేళ నాకు సీటు దొరికి వుంటే వేరే విధంగా కష్టపడవలసి వచ్చేదని తెలిపారు. నేను మళ్లీ పరీక్ష వ్రాసాను. ఈ సారి నేను పాస్ అయ్యాను. 1981లో వారు ఫ్రాన్సుకు వెళుతూ నీకు ఏం కావాలి అని అడిగారు. నేను వారితో ఏమీ వద్దని తెలిపాను. వారు నా కోసం ఒక స్టెతస్కోపును తెచ్చి యిచ్చి నన్ను ఒక మంచి డాక్టరు అవ్వాలని తెలిపారు. అప్పటినుండి నేను వారిని నా తండ్రిలాగా చూడడం మొదలుపెట్టాను.
1987లో నాకు వివాహం జరిగింది. మా నాన్నగారు నా వివాహాన్ని శ్రీ స్వామీజీ వారే దగ్గర వుండి కన్యాదానం జరిపించాలని వారి వద్ద మాట తీసుకున్నారు. వివాహాన్ని ఢిల్లీలో జరిపించారు. శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని విజయవాడ పిలిపించి అక్కడ దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వారు మా నాన్నగారిని మంగళ సూత్రం ఉందా అని అడిగగారు. దానికి మా నాన్నగారు యిది ఉత్తరభారత సంప్రదాయంలో లేదనీ, ఒకవేళ కావాలంటే తరువాత తెప్పిస్తానని తెలిపారు. యీ కార్యక్రమం తెల్లవారు ఝామున మొదలయి మధ్యహ్నానినికి ముగిసింది.
శ్రీస్వామీజీ వారు అక్కడ వుండి కార్యక్రమాన్ని మొత్తాన్ని గమనించారు. అక్కడ ఆ ఆలయంలో రెండు వందల యాభైమంది భక్తులు వున్నారు. పూజల అనంతరం మేము శ్రీస్వామీజీ వారి వద్దకు వెళ్లాము. మా మామగారు వారికి ఒక పుష్పహారాన్ని సమర్పించారు. వారు ఆ హారాన్ని తీసుకుని, అందులోనుండి మంగళసూత్రాన్ని తీసి నాకు యిచ్చారు. నేను యిప్పటికి నా మెడలో వేసుకుని వుంటాను. మా నాన్నగారు నాకు ఒక టేపురికార్డరును స్వామీజీ వారి 11 క్యాసెట్లను యిచ్చి శ్రీ స్వామీజీ వారి గొంతును నాకు లాంఛనంగా యిస్తున్నానని తెలిపారు. నా భర్త మా వివాహం జరిగిన నాటికి స్వామీజీ వారి భక్తులు కారు. కాని కాలం గడిచే కొద్దీ ఆయన శ్రీ స్వామీజీ వారికి సన్నిహితులయ్యారు.
1988వ సంవత్సరంలో మైసూరు ఆశ్రమానికి వెళ్లాము. అతనికి స్వామీజీ వారు అతని వైద్యవృత్తికి అనుకూలంగా సూచనలను, మార్గనిర్దేశాలను యిచ్చారు. వారి ఆదేశాలను ఈయన అనుసరించారు. అతనికి ఆ సూచనలు వృత్తిపరంగా చాలా ఉపయోగపడ్డాయి.
ఒకసారి అతనికి విపరీతమైన తుంటికి సంబంధించి వ్యాధి కలిగింది. అతినికి తుంటి మార్పిడి చేయవలసిన అవసరం ఏర్పడింది. నాకుచాలా విచారం కలిగి స్వామీజీ వారికి అతని ఆరోగ్య విషయమై కబురు పంపాను. శ్రీస్వామీజీ వారు అనతిని నయం అవుతుందని చింతించవద్దని సందేశం పంపారు. అతను దాని నుండి కోలుకుని అది కేవలం తుంటికి దెబ్బ తగిలినందున కలిగినబాధ అని తెలిసింది.
నా భర్తకు అతను పనిచేసే చోట కొన్ని యిబ్బందులు కలిగి తోటివారు అసూయ చెందడం మొదలుపెట్టారు. ఒక సారి శ్రీ స్వామీజీ మమ్మల్ని మైసూరు ఆశ్రమానికి పిలిపించి మమ్మల్ని సర్వదోషహర యజ్ఞాన్ని చేయించమని తెలిపారు. యజ్ఞం పూర్తి చేయించిన తరువాత శ్రీ స్వామీజీ వారు అతని ఉద్యోగంలో అంతా సవ్యంగా జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత అతని ఉద్యోగానికి తిరిగి వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితి చక్కబడి యిప్పుడు ఢిల్లీలోని పెద్ద డాక్టర్లలో అతనుకూడా ఒకరయ్యారు.
నాకు కొన్ని గర్భస్రావాలు జరిగిన అనంతరం మళ్లీ గర్భం దాల్చాను. దీనివలన మా నాన్నగారు కొంత చింతించి శ్రీస్వామీజీ వారికి ఈ విషయాన్ని విన్నవించారు. కాని వారు దత్త ప్రసాదమని తెలిపారు. నేను తొమ్మిదినెలల అనంతరం ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. నా రెండవ సంతానం అమ్మాయి. దేవికకి శ్రీ స్వామీజీ వారంటే చాలా యిష్టం. మా అమ్మాయి తన జీవితానికి సంబంధించిన సలహాలను శ్రీస్వామీజీ వారి నుండి తీసుకుని యధాప్రకారం ఆచరిస్తుంది. తను దంతవైద్యాన్ని శ్రీ స్వామీజీ వారి రక్షణతో మరియు మార్గనిర్దేశంతో చదువుకుంది.
2002వ సంవత్సరంలో మా మామగారికి బ్రెయిన్ ట్యూమర్ నాలుగవదశ అని నిర్ధారణ అయింది. నేను నా భర్త యిద్దరమూ డాక్టర్లమయినా కూడా మాకు ఏం చేయాలో తెలియలేదు. మేము శ్రీ స్వామీజీ వారిని సంప్రదించాము. వారు మేము డాక్టర్లమయినందున మేము జాగ్రత్తగా ఆలోచించి ఏది అనుకూలంగా చెయ్యాలని వారిని మాత్రం ఆపరేషన్ చేయవద్దని మరియు భారతదేశం నుండి బయటకు తీసుకుని వెళ్లవద్దని తెలిపారు. మేము వారి సూచనలను అనుసరించి వారి సంరక్షణను గురించి భారతదేశంలోనే శ్రద్ధ తీసుకున్నాము. ఆ తరువాత వారికి నయం అయి నాలుగున్నర సంవత్సరాలు జీవించారు. ఆ తరువాత వారు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శ్రీస్వామీజీ వారు ఈ సారి ఏమి చేయవద్దని చెప్పారు. నాకు శ్రీస్వామీజీ వారికి వారిని ఎలా విముక్తులను చేయాలో తెలుసునని నేను ఊహించాను.
2008లో నేను తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. నాకు రూట్ కెనాల్ చేయించుకోవడానికి ఒక డెంటిస్టు దగ్గరకు వెళ్లాను. ఆ దంతవైద్యులు నాకు మత్తు మందును యిచ్చారు. వైద్యం అనంతరం నాకు కొన్ని యితర సమస్యలు మొదలయ్యాయి. నా లివర్ మరియు కిడ్నిలు పనిచేయడం మానేశాయి. నేను ఐ.సి.యులో చేరాను. నా భర్త శ్రీ స్వామీజీ వారికి ఈ విషయం తెలిపారు. శ్రీ స్వామీజీ వారు నాకు టెలిఫోన్ చేసి నా ప్రియమైన కుమార్తె నందిని, నువ్వు జీవించి వున్నావు. నేను నీ కోసం యుద్ధం చేశాను. నిన్ను చిన్నపిల్లగా ఆశ్రమంలో వున్నప్పటి నుంబి నువ్వు సేవచేయడం నాకు గుర్తుంది. నేను నిన్ను నాకు సేవ చేయడానికి వెనక్కి తీసుకుని వచ్చాను. అని అన్నారు. పదకొండు రోజుల అనంతరం ఆసుపత్రి నుండి యింటికి తిరిగి వచ్చాను
నేను శ్రీ స్వామీజీ వారి ప్రేమపూరితమైన సంరక్షణలో 1970నుండి నాకు వేరే విధమైన జీవితం తెలియకుండి పెరిగాను. వారు నన్ను యింతగా ఆచరణాత్మకంగా ఎదిగేలా చేసి, యిప్పుడు నాకు నా పిల్లలు కూడా కలిగారు. నా భర్త యిప్పుడు శ్రీ స్వామీజీ వారి దృఢభక్తులు. మేము చాలా అదృష్టవంతులము. శ్రీస్వామీజీ వారు మా యింటికి విచ్చేసి అది వారి స్వంత యిల్లని చెప్పారు. మేము వారికోసం రెండవ అంతస్తును నిర్మించాము. వారికి అది చాలా యిష్టం. మేము వారిని ఎల్లప్పుడు ప్రార్ధిస్తునే వుంటాము. మా కష్ట సమయాలలోను, సుఖాలలనో వారికి విన్నవించుకుంటాము. వారు మాకు తగిన ప్రోత్సాహాన్ని, శక్తిని యిస్తారు. ఒకోసారి వారే మొత్తం బాధ్యతను కూడా వహిస్తారు.
ఒక డాక్టరుగా నేను వారిని ప్రార్ధిస్తూ కొన్ని సమయాలలో వారిని వారి ఆరోగ్యవిషయమై బ్రతిమాలుతాను. నేను వారిని విశ్రాంతి తీసుకోవలసిందిగా కోరుతాను. వారి శరీరానికి వృద్ధాప్యం వస్తున్న కారణంగా అలా కోరతాను. నేను వారిని ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దని కూడా చెబుతాను. వారు ఎప్పుడు ‘‘చింతించవద్దు నేను బాగున్నాను’’ అని సమాధానం యిస్తారు. యిది కొంత స్వార్ధంగా అనిపించినా నేను వారిని నా తండ్రిలాగా భావిస్తున్నందన నిస్సహాయురాలిని. ఈ మధ్యనే నేను వారిని కలిశాను. నన్ను వారు ‘‘ఎలా వున్నావు నా కూతురా’’ అని అడిగారు. నేను చాలా ఎత్తుమీద వున్నంత ఆనందించాను. నాకు జీవితంలో అంతకన్నా కావలసినది ఏమున్నది? వారు మాకు అన్నీ యిచ్చారు. వారు మాతోనే ఎల్లప్పుడూ వున్నారు.
జయ గురు దత్త