నా జీవిత ప్రారంభ సంవత్సరాల్లో నేను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ శివారు ప్రాంతమయిన బెల్మాంట్ నందు నివశించాను. ఇక్కడి ప్రజలు ప్రాధమికంగా ఆఫ్రో-ట్రినిడాడియన్లు, తార్కికంలో లౌకికవాదం, మరియు క్రైస్తవమతం ప్రజాదరణ పొందిన మతం. నా కుటుంబం వారు రోమన్ క్యాథలిక్ చర్చికి చెంది, మా తరం కుటుంబ సభ్యులు మతాధికారులు మరియు సన్యాసినులు అయి వున్నారు. మా తండ్రిగారు వివిధ మతాలను మరియు సంస్కృతులను ఆదరించేవారు. మా నాన్నగారి ప్రభావంతో నా యవ్వనంలో నాకు మతాలు మరియు అన్ని మతపరమైన వ్యక్తీకరణల విశ్వసనీయత మధ్య గల సంబంధాన్ని చూడవలసిన అవసరం వుందనిపించింది.
నేను పదిహేడేళ్ళ వయస్సులో వున్నప్పుడు ఒకరోజు నేను టెలివిజన్ ముందు నడుస్తూ, శ్రీ సత్య సాయిబాబా వారి జన్మదినం సందర్భంగా ప్రసారమవుతున్న కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు బలమైన ప్రభావం కలిగింది, అప్పుడు నాకు లోతుగా వచ్చిన ఆలోచన, దాదాపుగా నాకు ఆదేశంలాగా అయి ఏదో ఒక రోజున నేను ఈ మాస్టర్ని గురించి అధ్యయనం చేయాలనిపించింది.
తరువాత నేను వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పాఠశాలలో చేరినప్పుడు, నా మనస్సు సాధారణమయిన అధ్యయనాలకు స్థిరపడలేదు. గ్రంథాలయంలో పుస్తకాలని పరిశీలిస్తున్నప్పుడు, నేను ఒక షెల్ఫ్ మొత్తం శ్రీ సత్యబాబాపై గల పుస్తకాలను చూశాను. యిది నాకు వారి జీవితాన్ని గురించిన విశేషాలను చదివినందుకు నన్ను ఒక ప్రాజెక్టును ప్రారంభించడానికి దారితీసింది. యిది నా జీవితాన్ని మార్చేసింది. ప్రపంచాన్ని చూడడానికి నాకు పూర్తిగా కొత్త పునాది అందింది. సాయి అక్షరాలు నా మనసును తెరిచేలా చేశారు. నేను ఆ పుస్తకాలను ఆపకుండా చదువుతూ నా ఇంజనీరింగ్ చదువును వదిలేశాను. వాస్తవానికి నా స్నేహితులు నేను నా కోర్సులో విఫలమయినందున చాలా ఆందోళన చెందారు. కానీ నాకు యిది యింజనీరింగు కన్నా ముఖ్యమయింది.
ఆ పుస్తకాలలో ఒకటి ‘శ్రీ సత్యసాయి స్పీక్స్’, అనే పుస్తకంలో యోగమార్గం పేరుతో ఒక అధ్యాయాన్ని చూశాను. ఈ సమయానికి నాకు బాబా వారి మీద అతి ప్రేమను పెంచుకుని వారే నా గురువు కావాలని ఊహించుకున్నాను. అయితే ఆ అధ్యాయాన్ని చదివినప్పుడు ‘‘నేను మీ గురువును కాదు, మీకు తప్పక గురువు ఉండాలి’’ అనే వాక్యం కనపడింది. దానితో నా అంతరంగంలో యింకొక ఆలోచన, లేదా లోతైన భావన కలిగింది - గురువును కోరుకున్నానన్న జ్ఞానం యొక్క భావన, నాకు గురువు వుండాలి. ఈ ఆలోచన నా శరీరంలో విద్యుత్తులాగా ప్రవేశించి నా శరీరము అసంకల్పితంగా కంపించసాగింది. ఈ కంపన గురించి చెప్పడానికి నాకు మాటలలో చాలా ఆశ్చర్యకరమై వున్నది.
మా అన్నయ్య రిచర్డ్, యోగాలో కొంత ప్రవేశాన్ని కలిగి వున్నాడు. నేను నా ఈ అసందిగ్థ పరిస్థితి గురించి సలహా కోసం అతని దగ్గరకు వెళ్ళాను. నేను మా అన్నయ్యకు ఆ పుస్తకంలో వున్న పదాలను చూపించాను. ‘‘నేను మీ గురువును కానని………….‘‘ అతను ఏమి చెప్పలేదు. కానీ నన్ను కాలిఫోర్నియాలోని హిందూమందిరం వద్ద శ్రీ కృష్ణమహరాజ్ గారిచే నిర్వహించబడే శ్రీస్వామీజీ వారి యొక్క క్రియాయోగ తరగతులకు వెళ్లవలసిందని సూచించాడు. మూడువారాలలో నేను అక్కడికి వెళ్ళి అక్కడ సెషన్లకు హాజరు కాసాగాను. ఆ సెషన్లలో నాకు నెమ్మదిగా మైసూరు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పరిచయం కలిగింది.
ఇది జరిగిన సమయంలోనే, నేను ట్రినిడాడ్ ప్రధాన భూభాగంలోని చిన్న ద్వీపానికి నేను సెలవులు గడపడానికి, నేను విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు తిరిగి ప్రారంభించడానికి ఎదురుచూస్తున్న సమయంలో యిక్కడికి ప్రయాణమయ్యాను. అక్కడ బీచ్ చుట్టూ నడుస్తున్న సమయంలో, విరిగిన గాజు ముక్క మీద అడుగుపెట్టడంతో నా అరికాలు తీవ్రంగా తెగి నేను కుట్లు వేయుంచుకోవడానికి ఆసుపత్రికి చేరుకున్నాను. యిది నాకు చాలా గొప్ప ఎదురుదెబ్బ. నేను రెండు రోజులలో నా కొత్త పనిని ప్రారంభించాలి. ఆ మరునాడు నా కొత్త యజమానికి నేను ఏ విధంగా సంజాయిషీ చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ నేను మంచం మీద పడుకున్నప్పుడు, నా వెనుక భాగంలో నెమ్మదిగా ఏదో వేడి ప్రవేశిస్తూ నా పాదంలోకి ఆ తరువాత నా గాయంలోకి ప్రవేశించినట్లనిపించింది. అంతకు ముందు వరకు వున్న నా నొప్పి అదృశ్యమయి నాకు ఏ విధమయిన అసౌకర్యం లేకుండా నేను నిటారుగా నిలబడగలిగాను. ఈ సంఘటనతో నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్న ప్రకారం నా పనిని ప్రారంభించగలిగాను. నేను ఈ విషయం శ్రీ స్వామీజీ వారు నా పై చూపిన కరుణ అని అపాదిస్తున్నాను.
1990లో మార్చి లేక ఏప్రిల్ నెలలో నేను మొదటిసారి ఈ అతిపెద్ద వ్యక్తిని చూశాను. ఈ సమయానికి నేను క్రియాయోగా దాదాపు ఒక సంవత్సరన్నర నుంచి సాధన చేస్తున్నాను. నాకు వారిని చూడాలనే అమిత ఉత్సాహం మరియు ఆందోళన. నాకు గుర్తున్నంత వరకు వారు నన్ను రెండు సెకన్లపాటు ఏ విధమైన వ్యక్తీకరణ లేకుండా నన్ను చూసి దూరంగా వెళ్లిపోయారు. నాకు అంతవరకే అవసరమయినది.
నేను నా సద్గురువులను కలిసిన తరువాత, నాకు దైనందిన జీవితంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకి, నేను వాహనం నడుపుతూ స్వామీజీ వారి సంగీతాన్ని వింటున్నప్పకుడు నాకు సుందరమైన గులాబీల మరియు విభూతి పరిమళం వచ్చేది.
మూడు సార్లు శ్రీ స్వామీజీ వారు నాకు వస్తువులను సృష్టించారు. ఒకసారి చిన్న క్రిస్టల్ శివలింగము, ఒక సారి తొమ్మిది రాళ్ళతో కూడిన నవగ్రహ రక్ష, మరొక సారి ముత్యం. నాకు వారు చివరిసారిగా యిచ్చినది ఒక పట్టి లాంటి వస్తువు, నేను వెనుకకు నడిచి వెళుతున్నప్పుడు ఆ వస్తువు నా చేతికి వెచ్చగా తగిలి ప్రకంపనలు కలగటంతో నేను తిరిగి చూడగా అతి ఒక ముత్యం. యింకొక సారి యిటువంటి సంఘటనే జరిగింది. వారు హృదయం పూర్వకంగా సమాంతరంగా వున్న అమేథిస్ట్ రాళ్లను యిచ్చారు. అవి వదులుగా గుచ్చబడ్డాయి. వారు నా చేతిలో ఒకదాన్ని పెట్టారు, నేను తిరిగి నా సీటు వద్దకు నడిచాను. నా చేతిలో వెచ్చగా తగిలింది. నేను మళ్ళీ తెరచి చూడగా ఒక క్లిష్టమైన సెట్ నాట్స్ కళాత్మంగా అది చాలా కళాత్మకంగా రత్నంతో కూడి వుంది. అసలు యిలా స్వయంచాలకంగా ముళ్లు వేయబడడం నాకు అనేకసార్లు వారు యిచ్చిన రత్నాలతో జరిగింది.
నా జీవితం మరల ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి దశలను మరల మరలిపోయాలా చేయటంలో అద్భుతమైన విషయం. నిజానికి నా దగ్గర యోగమర్గానికి సంబంధించిన అధ్యాయంతో కూడిన సాయిబాబా పుస్తకము యొక్క అసలు కాపీ వున్నది. నేను మళ్ళీ మళ్లీ చదివాను, కాని ‘‘నేను మీ గురువును కాదు. మీరు గురువును కలిగి వుండాలి’’ అనే వాక్యాలు ఆ పుస్తకంలో లేకపోవడం గమనించాను. యిది చూసి నాకు కొంత కంగారు కలిగింది. కానీ, ఆ వాక్యాలు కేవలం నా కోసమే వుంచబడ్డాయని చివరకు నిర్ధారించుకున్నాను. అలాంటి స్థాయిలో నా గురుదేవులు నన్ను కొద్దిగా తమ వద్దకు తీసుకుని వచ్చారు. యిది యివాళ్టికి కూడా నాకు ఆశ్చర్యంగానే వుంటుంది. క్రియాయోగాకు నన్ను పరిచయం చేసి, నా గురువుతో నేను చిరకాలం చేరువగా వుండేందుకు వారు నాకు చూపించిన మార్గమని నేను ఊహిస్తున్నాను
నేను ఈ సంఘటనలన్నీ శ్రీస్వామీజీ వారి దయ అని తలుస్తాను. వారు లేకుండా నా జీవితం ఎలా ఉండేది అనేది నాకు తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా ఆసక్తి లేదు. నాకు తెలిసినదల్లా వారు నాతో వున్నారు. నేను వారితో వున్నాను. నాకు వివాహం చేసుకోవాలనిపించినప్పుడు, నేను వారిని సంప్రదించి, వారిచే ఆమోదించబడి యిద్దరు కుమార్తెలు వారి ఆశీర్వాదం వల్ల కలిగారు. ఆ యిద్దరూ వారి అస్తిత్వంలో ఎదుగుతున్న ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన పిల్లలు.
ఒకసారి నేను నా చిన్న కుమార్తెను ఎత్తుకుని గిరగిరా తిప్పుతున్న సందర్భంలో, అకస్మాత్తుగా నేను ఆమె తల మెట్లకు తాకి బద్దలవుతుందనే భావనతో ఆమెను అలా తిప్పడం ఆపేసి ఆమెను నేలపైన వుంచాను. ఆ తృటి సమయంలో, నేను లెక్కలోకి తీసుకోలేని సమయంలో నాకు ఆశ్చర్యం కలుగజేస్తూ నేను ఆమె నుదిటిమీద ఒక మచ్చ వుండి పూర్తిగా నయమయి వుంది. నేను యింతకు ముందు ఆ మచ్చను చూడలేదు. ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే ప్రాణహాని జరిగేదని, పశ్చాత్తాప పడ్డాను. శ్రీ స్వామీజీ వారి దయతో అటువంటి ప్రాణాంతకమైన ప్రమాదం నుండి కాపాడారని, వారు ఎల్లప్పుడూ నాతోనే వుంటారని నాకు తెలుసు.
1993లో శ్రీ స్వామీజీ వారు తమ యాభై ఒకటవ పుట్టిన రోజు వేడుకల కోసం ట్రినిడాడ్ సందర్శించినపుడు మాకు ఒక శాంతి మంత్రాన్ని యివ్వడం జరిగింది. ‘ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః’’ అనే మంత్రాన్ని తొంభై మిలియన్ల సార్లు చేయవలసి వున్నది. నేనూ, మా అన్నయు దత్త యోగా సెంటర్ కు ప్రతి శనివారం ఉదయం వెళ్లి కూర్చుని మిగతా భక్తులతో పాటు జపం చేసేవాళ్లం. ఒక శనివారం నాడు, ఒక భయంకరమైన హరికేన్ ట్రినిడాడ్ వైపు తరలుతున్నది. మెట్రలాజికల్ ఆఫీసు బృందం ఈ దృగ్విషయాన్ని గమనిస్తున్నది, వారు ఈ తుఫాను ద్వీపాన్ని పూర్తిగా తుడిచి పెట్టేస్తుందని ఊహించారు. రిచర్డ్, నేను ఈ ప్రమాదాన్ని గుర్తించినా కూడా వెళ్లి ఈ మంత్రాన్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాము. కానీ, ఈ ప్రమాద హెచ్చరికతో ఎవ్వరూ అక్కడ లేరు. ఆశ్రమం అంతా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుంది. తుఫాన్ ప్రమాదం సంభవించే పరస్థితి వున్నా, మేము శ్రీ స్వామీజీ వారి సంకల్పం అనుకున్న జపసంఖ్య పూర్తి అయితే వారు ట్రినిడాడ్లో మహాశాంతి యజ్ఞాన్ని చేస్తారని మాకు చెప్పి వుండడంతో మేము మంత్రం చేయసాగాము. మేము మంత్ర జపం చేస్తున్నపుడు, మాకు విభిన్నమైన కంఠ ధ్వని వినపడింది, ఆ ధ్వని శ్రీస్వామీజీ వారి కంఠధ్వనిలా వినపడింది. మేము చాలా పులకరించిపోయాము, మేము ఏ మాత్రం భయం చెందకుండా అత్యంత సంతోషంగా జపాన్ని చేయసాగాము. యాదృచ్ఛికంగా ఆ తుఫాను దారి అంతుబట్టకుండా వేరే వైపుకు మళ్లి ద్వీపానికి ప్రమాదం తప్పి కొద్దిపాటి నష్టంతో మళ్లిపోయింది.
2001లో శ్రీ స్వామీజీ వారు అందరు భక్తులకు ఒక సందేశాన్ని పంపించారు. లూసియానాలోని బాటన్ రూజ్ కు ఒక నిర్దిష్ట సమయంలో ఏర్పాటు చేయాలని. ట్రినిడాడ్ కు చెందిన మరో యిద్దరు భక్తులూ, నేను ఓర్లాండో ఫ్లోరిడాలోని ఎడ్వర్డ్ బరత్ నివాసానికి వెళ్లాము. అక్కడ నుండి నలుగురం కారులో బాటన్ రూజ్ ప్రయాణమయ్యాము. యిది అమెరికాలో సెప్టెంబరు 11న జరిగిన సంఘటనకు సరిగ్గా మూడునెలల ముందర. మేము అక్కడకు వెళ్లినప్పుడు పరమపూజ్య శ్రీ స్వామీజీ వారు యు.ఎస్. పర్యటనలో వున్నప్పుడు, వారు ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగిందని మాకు తెలసింది. యిది విని మేము చాలా ఆశ్చర్యపోయాము. మాకు వ్యక్తం చేయడానికి మాటలు లేవు.
మేము అక్కడికి వెళ్ళాము. నాకు శ్రీ దత్తమూర్తిని దర్శించుకోవాలనిపించింది, అందువలన నేను ఆ ఆలయంలోకి వెళ్లాను. నేను ఆ ద్వారం తీసినప్పుడు, నాకు ఏదో శక్తి భౌతికంగా నన్ను దత్తుడు వైపుకు లాగసాగింది. నాకు కనబడని శక్తియొక్క వెచ్చదనం అనుభూతిలోకి వచ్చి నా శరీరాన్ని దత్తమూర్తి ఎదురుకుండా చేరడానికి మార్గం చూపింది. నేను ఏం జరుగుతున్నదో చెప్పలేను కానీ నా దత్తగురువుతో అలౌకికమైన కృపా సామ్రాజ్యంలో ఓలలాడాను. ఒక సంవత్సరం తరువాత నాకు యిదే రకమైన అనభూతి మైసూరు ఆశ్రమంలో కలిగింది. ఈ దత్తగురువుకు నేను నా హృదయ పూర్వక నమస్సులను సమర్పిస్తున్నాను.
ట్రినిడాడ్ ఆశ్రమంలో యింతకుముందు జరిగిన సంఘటలను, నేను సరదాగా చెప్పుకుంటున్నాను, శ్రీ స్వామీజీ వారి ఒకానొక ట్రినిడాడ్ పర్యటనలో నేను వారి భౌతికరూపంతో అనుబంధం పెంచుకుని, వారు వున్నంత కాలం నేను ఆశ్రమాన్ని వదిలి వెళ్లీవాడిని కాదు. నేను శ్రీ స్వామీజీ వారితో పాటే నన్ను నేను గుర్తించసాగాను. ఆ సాయంత్రం వారు బయలుదేరే వెళ్లే సమయంలో, నేను చాలా విచారం చెందాను. నేను వారికి కొంత దూరంలో మెట్ల వద్ద నిలుచున్నాను. వారు చివరి మెట్లు ఎక్కేస్తుండగా, నేను వారు ఎలా విడిచి వెళతారు. వారు వెళ్లకూడదు అని అనుకుంటూ, నా చాతీ ఉప్పొంగి పోయి, నేను వారిని లాగేస్తే అనే ఆలోచన నాకు వచ్చింది. యింతలో వారు చివరి మెట్టునుండి దాదాపుగా కింద పడిపోయేవారు, కానీ వారు దయతో నా వైపుకు నవ్వుతూ చూశారు.
వారు మనకు నిరంతరం జ్ఞాపకం చేస్తారని నేను నమ్ముతున్నాను. మనము వారి వైపునకు నడిచినప్పుడు వారు మనని ఖచ్చితంగా వారి వైపుకు తీసుకుంటారు. వారు శారీరక ఉనికి వున్నా లేకున్నా వారి అపార శక్తి మన చుట్టు వుంటుందనే మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చును. వారు నన్నకు చూసినా చూడకపోయినా, వారు చిన్న చిన్న విషయాల నుండి నాకు తెలియజేస్తారు. నన్ను వారు నిర్లక్ష్యం చేస్తున్నారని నన్ను తప్పిస్తున్నారని భావించినా నేను వారిని ఒంటరిగా చూస్తాను. వారు సర్వవ్యాపి.
శ్రీ స్వామీజీ వారి నుండి నేను పొందిన గొప్ప బహుమానం నాకు సహనం అలవడి, నన్ను గురించిన జ్ఞానాన్ని నేను తెలుసుకోగలగడం. తరచుగా నేను చాలా సంతోషంతో కూడి వుంటాను. ఈ ఆనందాన్ని నేను వర్ణించలేను. నేను అన్యభారతీయుడనయినా, హిందూత్వంతో పెంపకాన్ని కలిగివుండకపోయినా వారు నన్ను అంగీకరించటమే ఒక అద్భుతం. మన అనంత ప్రయాణంలో వారు మన ఆత్మలను మాత్రమే చూస్తారని తెలుసుకోగలిగాను. వారితో వుండడానికి మన ముఖవైఖరి ముఖ్యం కాదనీ అది మార్చుకోవలసిన అవసరం లేదని వారు తరచు చెబుతుంటారు. సంభావ్యత ద్వారా నేను యిక్కడ వుండకూడదని అనుకోవచ్చు, కానీ వారి అద్భుతాలు అనంతమైనవి మరియు దివ్యమైనవి.
యితర ప్రాముఖ్యమైన విషయాలు నన్ను వారి దగ్గరకు చేరేలా చేసింది. వాటిని కొన్నిటిని వివరించగలము, కొన్నింటిని వివరించలేను. వారు నాకు తరచు బోధనలు చేస్తు నన్ను పరీక్షిస్తారని నా నమ్మకం. నాకు వచ్చిన సందేహాలకు మౌనంగా సమాధానం దొరుకుతుంటుంది. నా మనసులో వున్న ప్రశ్నలకు వారి ఉపన్యాసాల ద్వారా వారు నా వంకకు సూటిగా చూస్తూ సమాధానాలను యిస్తారు. ఉదాహరణకు నాకు భక్తులంతా ఒకరినొకరు ‘జయగురుదత్త’ అని ఎలా పలకరించుకోగలరు అని అనుమానం కలిగింది. యిది మాకు చెప్పలేదు కాని మేము అప్రయత్నంగా చేసేవారము. నేను ఈ విషయం గురించి చాలా కాలం విస్మయం చెందేవాడిని. అప్పుడు 1995లో వారు ట్రినిడాడ్ కు మహాశాంతి యజ్ఞం చేయడానికి వచ్చినప్పుడు, అన్ని ఆచారాలతోపాటుగా, వారు నా సందేహాన్ని మౌనంగా తీర్చారు. నేను చివరకు ‘జయ గురు దత్త’ అంటే “Lord Thy Will be done.” (ప్రభువా నీ చిత్తమే) అని అర్ధం చేసుకున్నాను. యిది నేను క్రైస్తవ పెంపకంలో అర్ధం చేసుకున్నాను. యిది శరణాగతికి సూచన. నేను పరవశించి దీనికి ప్రతి సమాధానంగా వారికి కృతజ్ఞతలను తెలిపాను. యిటువంటి చిన్న విషయాలు నా మనసులో గొప్ప ప్రభావాలను కలిగించాయి.
వారు నాకు ఎలా శరణాగతి అవ్వాలో, దేనికి శరణాగతి అవ్వాలో తెలిపారు. నేను నా జీవితాన్ని శ్రీస్వామీజీ వారు లేకుండా ఎలా నిర్వచించగలను? నా భవిష్యత్తు వారి చే నిర్వచించబడింది. వారే నా వునికిని కనిపెట్టిన వారు. నాకున్న శ్రీస్వామీజీ వారితో అత్యంత సన్నిహిత సంబంధం నా క్రియాయోగ సాధన. నేను క్రియాయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా వుండి నేను సాఫల్యం చెందాననే భావన కలుగుతుంది. బాహ్య విషయాలయిన సుఖ దుఃఖాలు నా కళ్లముందు కదలాడుతున్నా కూడా యిది అంతర్గతంలోనుండి వెలుపలికి వచ్చిన అలౌకికమైన ఆనందం.
1993లో శ్రీ స్వామీజీ వారు ట్రినిడాడ్ ఆశ్రమంలో క్రియాయోగ తరగతిని నిర్వహిస్తూ కోపం కలిగించే ఒక ప్రత్యేకమైన నాడిని గురించి చెప్పసాగారు. అప్పుడు పరమ పూజ్య స్వామీజీ వారు తాను బ్రహ్మతో ఎందుకు ఈ నాడిని రూపొందించావని మాట్లాడతానని వ్యాఖ్యానించారు. నాకు ఈ ప్రకటన సంతోషకరంగానూ మరియు హస్యాస్మదంగానూ తోచింది, ఎందుచేతనంటే బ్రహ్మను గురించి బ్రహ్మ ఎలా ఫిర్యాదు చేస్తారని? నాకు అనిపించి నేను నవ్వుకోసాగాను. నేను వారిని గురించి ఆలోచించేదంతా వారికి తెలుసు కావున దీనికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను భావించాను. అప్పుడు నా ఈ ఆలోచనను నిరూపించడానికి గాను శ్రీ స్వామీజీ వారు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. వారికి నా ప్రతి ఆలోచన తెలుసు.
మరొక ఆసక్తికరమైన సంఘటన శ్రీస్వామీజీ వారి టొరంటోలోని ఒక కార్యక్రమంలో జరిగింది. నేను ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరుకున్నారు. అయితే, నాకు కుదరలేదు. ఈ కార్యక్రమం ట్రినిడాడ్ నుండి ప్రసారం చేయవలసి వుంది. నాకు టీ తయారు చేయటం అలవాటు లేనప్పటికీ, నేను ఒక కప్పు టీని తయారు చేసుకుని ఆ కార్యక్రమాన్ని చూడడానికి కూర్చున్నాను. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు శ్రీ స్వామీజీ వారు కెమెరా వైపుకు చూస్తూ, ‘‘సరే, మీరు చాయ్ తాగుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కదా, విశ్రాంతిగా మీ చాయ్ సేవిస్తూ ఈ కార్యక్రమం చూడండి’’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఈ అనుభవంతో భక్తుల యొక్క అన్ని ఆలోచనలు శ్రీ స్వామీజీ వారికి తెలుసుననే నా నమ్మకాన్ని మరింత బలపరిచారు.
శ్రీ సత్యసాయి బాబా వారికి పరిచయమయిన అనంతరం, నాకు సమాధానాలకన్నా ప్రశ్నలే కనిపించాయి. నేను బాబాని యేసులా చూసాను. నా కుటుంబ సభ్యుల వద్ద నేను నా నమ్మకాలను ఎలా గ్రహించానో చూపించాను. అప్పుడు నేను నా సద్గురు దేవులను సంప్రదించినపుడు, నేను శ్రీ రాముని ధార్మిక లక్షణాలను నా జీవిన విధానంలో అలవరుచుకోవడానికి ప్రయత్నించినట్లయితే పుస్తకంలోనూ హృదయాలలోనూ యేసు అంతటా వున్నాడని తెలుసుకున్నాను. శ్రీ స్వామీజీ వారు నాకు శ్రీ దత్తుడే నిజానికి యేసు ప్రభువనే ‘‘పెద్ద రహస్యాన్ని’’ బయటపెట్టారు.
నేను వారితో ఎన్ని జన్మలు ప్రయాణం చేశానో, యింకా ఎన్ని జన్మలు ప్రయాణం చేస్తానో నాకు తెలియదు, మరియు నాకు తెలుసుకోవాలని కూడా లేదు, కానీ ప్రస్తుతం నాకు తెలిసినది వారి మాటలను అనుసరిస్తూ వారిని అనుగమిస్తూ వుండడమే. పరమానందం వారి భక్తులపై సదా వారి దివ్యసమక్షంలో కలగాలని దానిని ఆనందిస్తూ వుండాలనేదే.
జయ గురు దత్త