SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
మను పీటర్ సేగ్లియాస్, ఫ్లోరిడా, USA (Manu Peter Seglias)

నేను స్విట్జర్లాండుకు చెందినవాడిని. ప్రస్తుతము ఫ్లోరిడా, యు.ఎస్.ఎ.లో నివసిస్తున్నాను. నేను మొట్టమొదట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని 1983లో వసంతకాలంలో కలిసాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులను నేను పునర్జన్మ మరియు భగవంతుని గురించి ప్రశ్నలను అడిగేవాడిని. నన్ను వారు చర్చిలోని మతాధికారిని సంప్రదించమని తెలిపారు. కానీ నాకు సరయిన సమాధానం దొరకలేదు. ప్రపంచంలో డెబ్భయిశాతం మంది క్రైస్తవులు కానందున నరకానికి వెళతారని నాకు ఆ చర్చి నుండి వచ్చిన సందేశం. యిది నాకు అర్థం కాలేదు. నేను చర్చ్ లో మాత్రమే చర్చలు మరియు నియమాలు చూసింది యిది నాలో మార్పుకు దారి తీసింది. నేను నాస్తికుడిని అయ్యాను. నేను ఆనందం అంచులను అనుభవిస్తూ నా జీవితాన్ని గడపడం మొదలుపెట్టాను, అవకాశాలు తీసుకొని జీవితాన్ని ఆస్వాదించాను.

మంచు పైన నడవడమంటే నాకా చాలా యిష్టం. కొన్ని ప్రమాదమైన భూభాగాలలో స్కీయింగ్ చేయడం వలన మరణం సంభవించే అవకాశాలు కూడా వుంటాయి. నేను ఈ రకమయిన ఆనందంతో విసిగిపోయాను. ఒకసారి నా స్నేహితుడు నాకు ధ్యానం చేయడం నేర్పాడు. నేను ధ్యానం మొదలుపెట్టిన నుండి తేరుకుని ప్రశాంతతను పొందాను. ఒకసారి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మీరు ఆశ్రమానికి రండి అనే మాటలు వినపడ్డాయి. నాకు ఈ మాటలు అర్థం కాక ఈ ఆలోచనను పక్కకు పెట్టాను. అప్పుడు 1983లో వసంతకాలంలో నా స్నేహితుడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనే గురువు గారు భారతదేశం నుండి క్రియాయోగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వస్తున్నారని ఆ కార్యక్రమములో నన్ను కూడా పాల్గొనమని యీ శిక్షణా కార్యక్రమం నా ధ్యానానికి ఉపయోగపడుతుందని తెలిపాడు.

ఈ కోర్సు స్విట్జరులాండులో లాంజెన్ బర్గ్ లో నిర్వహింపబడుతున్నది. నేను అక్కడకు బలహీనుడిగా, అనుమానస్పదంగా, వ్యంగ్యత కూడిన వ్యక్తిగా వెళ్లాను, కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేను వేరొక వ్యక్తిగా తిరిగివచ్చాను. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో ఆ గురువుగారు ప్రతి ఒక్కరికీ వారితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం యిచ్చారు. నేను వారి వద్దకు వెళ్లినప్పుడు నాతోటి “మీరు ఆశ్రమానికి రండి” అని తెలిపారు. నేను ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. యిది నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక పెద్ద మలుపు. నేను ఈ మాటలను నా ధ్యానంలో వినడం జ్ఞప్తికి వచ్చింది. నాకు ఈ గురువుతో అనుబంధం వున్నదని తెలుసుకున్నాను. నేను నిజమైన ప్రేమను కనుగొన్నానని భావించాను. నేను లుసెర్న్కు తిరిగి వచ్చాను. మా యింటికి వీధిలో నడుస్తున్నప్పుడు ప్రజలు నా వంకకు చూడడం గమనించాను. నన్ను వారు అలా చూడడానికి నాలో ఏ విధమయిన వింతలేదు. కానీ వారు నాలో అంతర్గతంగా వున్న శక్తికి ఆకర్షితులయ్యారు. ఆ శక్తి నా గురువులయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారిది.

శ్రీ స్వామీజీ వారు తమ పర్యటనను స్విట్జర్లాండు, జర్మనీ మరియు ఫ్రాన్సు దేశాలకు కొనసాగిస్తున్నారు. నేను వారితో పాటుగా ప్రయాణం చేసినందున చాలా సంతోషించాను. ఒక సందర్భంలో నేను వారిని వర్షాకాలంలో వారి ఆశ్రమానికి రావచ్చునా అని అడిగాను. వారు రావచ్చునని తెలిపారు. నేను స్విట్జర్లాండును వదిలి వెళ్లడానికి పనులు జరగసాగాయి. నా చెల్లెలి స్నేహితుడు న్యూజిలాండు నుండి వచ్చాడు. అతను నేను చేసే రంగంలోనే పని చేస్తుండడం వలన అతనని నా ఉద్యోగంలో తను భర్తీ అయి నా అపార్టుమెంటులో చేయవలసిన చెల్లింపుల బాధ్యతను తీసుకున్నాడు. ఆరునెలల కోసం నేను స్విట్జర్లాండునుండి శ్రీ స్వామీజీ వారి ఆశ్రమానికి ప్రయాణమయ్యాను.

నేను 1983 సంవత్సరం చివరలో మైసూరు ఆశ్రమం చేరుకున్న సమయానికి అక్కడ ఎక్కువమంది లేరు. అక్కడ ఒకే ఒక విదేశీ వనిత, జర్మన్ దేశస్థురాలు వున్నారు. ఆమె నాకు గైడు మరియు స్నేహితురాలయింది. నాకు నా జీవితంలో సూక్ష్మస్థాయిలో మార్పులు ప్రతిబింబించే ప్రశాంత సమయం కలిగింది. నేను ఈ అనుభవాలను మాటలలో వ్యక్తం చేయలేను. నేను 1984లో శివరాత్రిలో పాల్గొన్నాను. ఆ సమయంలో నేను అమెరికాకు చెందిన సుశీల అనే యువతిని కలిసాను. ఆమె తరువాత నా అర్ధాంగి అయింది. నేను స్వామీజీ వారీతో పాటు భారతదేశంలో పర్యటించాను. ఒక్కోసారి నా దగ్గర డబ్బులు వుండేవీ కావు కానీ అంతుబట్టకుండా ప్రతీదీ ఏర్పాటయ్యేది. ఆశ్రమంలో నాకు గాయత్రి భజనలను పాడడం నేర్పించింది. నేను కొన్ని భజనలను ఆంగ్లభాషలోకి అనువదించాను. నేను స్విట్జర్లాండుకు తిరిగి వచ్చినపుడు మరొక భక్తుని సహకారంతో భజనమాల మొదటి రెండు పుస్తకాలను అచ్చువేయించాము. నేను ఆశ్రమంలో వుండగా వారు నాకు మను అని పేరు పెట్టారు. ఆరునెలల కాలం గడిపిన అనంతరం నేను ఆశ్రమం నుండి ఢిల్లీ రైలులో కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ప్రేమశక్తినుండి ఒక అస్తవ్యస్తమయిన భయంకరమయిన వాతావరణంలోకి అడుగుపెడుతున్నట్లనిపించి స్విట్జర్లాండుకు తిరిగి బయలుదేరాను.

నేను స్విట్జర్లాండుకు తిరిగి వచ్చినప్పుడు. జూరీలోని ఒక పాఠశాల కోసం ప్రైవేటు పాఠాలు విక్రయించాను. ఈ పాఠశాల వేసవిలో నాలుగు వారాలు, శీతాకాలంలో రెండు వారాలు సెలవలు వుండేవి. ఈ సమయం నేను శ్రీస్వామీజీ వారు ఎక్కడ వుంటే అక్కడ దర్శించుకునే అవకాశం కలిగింది. నేను భారతదేశం, యు.ఎస్.ఎ., యు.కె. మరియు ట్రినిడాడ్ వంటి దేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజులలో ఆయన చుట్టూ యిప్పుడు వున్నట్లుగా ఎక్కువమంది భక్తులు వుండేవారు కాదు. యిది నాకు నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బోనస్ వంటి అవకాశం. వారి సమక్షంలో వుంటూ చాలా పాఠాలు నేర్చుకున్నాను. వారి ఎల్లోస్టేషన్ నేషనల్ పార్క్ సందర్శనలో నాకు వారి డ్రయివరుగా సేవ చేసుకునే మహదవకాశం కలిగింది.

ఒకసారి శ్రీ స్వామీజీ వారి ట్రినిడాడ్ పర్యటన సందర్భంలో వారితో పాటు కారులో ప్రయాణం చేసే అదృష్టం కలిగింది. నేను వెనుక సీటులో కూర్చున్నాను. వారు ముందర కూర్చుని డ్రైవరును హెచ్చరించసాగారు. నేను వారితో మీరు మీ భక్తులు డ్రయివింగ్ చేస్తున్న సందర్భంలో వారి జీవితాలలో జోక్యం చేసుకుంటారా అని నేను ప్రశ్నించాను. దానికి వారు అవును అని సమాధానమిస్తూ నాకు కాలీఫోర్నీయాలో మీకు జరిగిన ప్రమాదం గుర్తుంది అన్నారు. నేను నిర్ఘాంతపోయాను. నాకు కాలిఫోర్నీయాలో పది సంవత్సరాల క్రితం ప్రమాదం జరిగింది. నేను ఒక పర్వత రహదారిలో డ్రయివింగ్ చేస్తున్నప్పుడు నిద్రమత్తులో కారును ఎడమవైపుకు తిప్పటంతో ఒక చెట్టుకు గుద్దుకున్నది. కుడివైపునకు తిప్పినట్లయితే రెండువందల అడుగుల లోయలోకి కారు పడిపోయేది. నాకు ఆ సమయంలో శ్రీ స్వామీజీ వారు తెలియదు. నాకు ఈ సంఘటనతో వారే నా గురువు అని రూఢీ అయింది. వారు నా గత జీవితంలోనూ, యిప్పడూ మరి ఎల్లప్పుడూ నాతోపాటూ ఉంటారు. వారు నాకు తెలియనప్పుడు కూడా నాతో వున్నారు. వారు గురువు కన్నా ఎక్కువ. వారు నాలో ఒక భాగము.

1980 మధ్య కాలంలో శ్రీ స్వామీజీ వారు బేసిటీ, టెక్సాస్లో కేసరినాథ్ గారిని కలిసారు. నేను వారితో పాటుగా ఒక అమ్యూస్మెంటు పార్కుకు వెళ్లాను. వెనుదిరిగి వస్తున్నప్పుడు కేసరినాథ్ గారి చిన్నబ్బాయి గౌతమ్ తో పాటు వస్తుండగా స్టెషన్ వాగన్ రేడియేటర్ వేడెక్కడం వలన మంటలు వచ్చాయి. మేము దానిని బాగుచేయించడానికి ఆగాము. ఆ షాపులో బాగుచేయవలసిన పార్టు దొరకలేదు. శ్రీ స్వామీజీ వారు మమ్మల్ని ఆ పార్టుకోసం వెతకమని వారు ఆ దగ్గరలోని జంతువుల పార్క్ ను చూడడానికి వెళ్లారు. మాకు ఆ పార్ట్ దొరకలేదు. శ్రీ స్వామీజీ వారు తిరిగి వచ్చి నన్ను కారును డ్రయివ్ చెయ్యమన్నారు. నేను భయపడుతూ లోపలికి వెళ్లి కారును వందమైళ్లు బేసిటీకి డ్రయివ్ చేశాను మళ్లీ ఆ కారు వేడెక్కింది. మేము చేరిన అనంతరం ఆ మరునాడు శ్రీ స్వామీజీ మమ్మల్ని ఆ కారును రిపెయిరు షాపుకు తీసుకుని వెళ్లమన్నారు. నేను ఆ మరునాడు ఉదయం ఆ కారును దగ్గరలోని షాపుకు తీసుకుని వెళ్లగా కారు మళ్లీ వేడెక్కింది. నా మనస్సు అంతకు ముందు రోజున జరిగిన దానికి ఆ రోజున జరిగిన దానికి తగిన కారణాలను వెతకసాగినా నాకు వాటికి సమాధానం దొరకలేదు.

ఆగష్టు 1986లో శ్రీ స్వామీజీ వారు పెన్సిల్వేనియాలో క్రియాయోగ తరగతులను నిర్వహిస్తున్న సమయంలో నేను నా స్నేహితురాలు సుశీలతో పాటుగా పాల్గొన్నాను. ఒక గురువారం నాడు వారు మా యిద్దరినీ పిలిచి మాకు వివాహం జరిపించారు. అక్కడ క్రియాయోగ కార్యక్రమం కోసం కూర్చున్నభక్తులే మా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి మానస దత్త మా వివాహ గీతాన్ని ఆలపించారు. అప్పట్లో ఆయనను అంకుల్ రాధ అని పిలిచేవారు. నా దగ్గర యిప్పటికీ మా వివాహ గీతం యొక్క టేపు వుంది. అది చాలా అద్భుతమయిన వివాహం. 1987లో శివరాత్రినాడు మేము మరల వివాహ వేడుక చేసుకున్నాము. ఏదేమయినా ఈ వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి మేము మూడవసారీ యు.ఎస్.ఎలో వివాహం చేసుకున్నాము. నేను చాలా సంతోషంగా తెలిపే విషయము శ్రీ స్వామీజీ వారి దయతో మేము అమెరికాలో యిప్పటికీ కలిసి జీవిస్తున్నాము.

నేను ఆఖరిసారిగా మైసూరు ఆశ్రమానికి దత్తజయంతి సందర్భంగా 2005లో వెళ్లడం జరిగింది. వారి కరుణను ఆశీస్సులను అపారంగా నా పై కురిపించారు. దీనిని మాటలలో వర్ణించలేను. ఈ పర్యటనతో వారితో గడపాలనే తృష్ణ కాస్తా తీరిపోయింది. ఏం జరిగినదో నేను చెప్పలేను కానీ ఆ తరువాత నేను భారతదేశానికి రాలేదు దానికి కారణం నేను నా హృదయాంతరాళంలో వారు నాతోనే వున్న భావన కలగడమే. శ్రీ స్వామీజీ వారు యు.ఎస్.ఎ వచ్చినప్పుడు నాకు వారిని దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది.

నేను శ్రీస్వామీజీ వారిని కలిసిన నాటి నుండి నాలో నాస్తిత్వపు వైఖరీ మారసాగింది. వారితో ప్రయాణాలు చేసిన సమయంలో నేను వారి బోధనలను వింటూ మరియు వారిని, వారి చుట్టూ వున్న ప్రజలను గమనిస్తున్నప్పుడు నా సందేహాలకు తగిన సమాధానాలు దొరికేవి. నేను పునర్జన్మ భావనను స్వీకరించాను దానికి కారణం నాకు మిగిలిన విషయాలు అర్థం లేనివిగా అనిపించడమే. శ్రీ స్వామీజీ వారి వలన నేను ఏసుక్రీస్తుతో పునఃఅనుసంధానం పొందగలిగి అతని బోధనలను అమితంగా అభినందించాను. నేను ఏ చర్చికి వెళ్లినా భగవంతుని అనుభూతిని పొందగలుగుతున్నాను.

మన జీవితాలు జననం నుండి మరణం వరకు నేర్చుకోవడానికి సాధనా మార్గం. నేను శ్రీస్వామీజీ వారి బోధనలనే సాధనాలతో విజయవంతంగా నా మార్గంలో నడవగలిగాను. నేను వివక్ష అనే సాధనాన్ని ఉపయోగించి జీవితంలో మంచి చెడులను ఎంపిక చేస్తాను.ఒకవేళ శ్రీ స్వామీజీ వారు నా నిర్లక్ష్యమనే నిద్రనుండి నన్ను మేల్కోల్పక పోతే నా జీవితం నాశనమయి వుండేది. శ్రీస్వామీజీ వారు నేను శాంతియుత వైఖరి అవలంబించడానికి నన్ను రక్షించడానికి ఒక రహస్య ఆయధంతో నన్ను దీవించాక నేను ఈ రహస్య ఆయుధాన్ని భయం, ప్రతికూల పరిస్థితులను, మరియు అడ్డంకులను అధిగమించడానికై వినియోగిస్తాను. ఆ రహస్య ఆయుధమే దత్తమంత్రము.

జయ గురు దత్త

Tags: