SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
కృష్ణ మహరాజ్, ట్రినిడాడ్ (Krishna Maharaj)

1986వ సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మొట్టమొదటిసారిగా వారి విశ్వసంకల్పంతో వారి భౌతికరూపాన్ని చూచి మనం ఆరాధిస్తామో ఆ రూపాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. ఏదేమయినా వారిలో అగోచరమయిన దివ్యశక్తి కొనసాగుతూ ఆత్మలను వారియొక్క విశ్వవ్యాప్తమైన శక్తివైపు ఆకర్షింప చేస్తున్నది. మొదటగా వారు మనలని సిద్ధం చేసి, పరిశుభ్రం చేసి మనం భౌతికంగా వారిని కలవడానికి మనల్ని సిద్ధం చేస్తారు.

1950వ సంవత్సరం మొదట్లో నేను ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయం నుండి 1985వ సంవత్సరం వరకు, నేను మతంపై అయిష్టతను కలిగి వున్నాను. మా కుటుంబం మతపరమైన విధానాలను ఆచరిస్తూ వుండేది. నా కోసం పూజలు, ఆచారాలను, నా జీవనం కోసం సాగించేవారు. కానీ నాకు వారి నమ్మకాలపై, ఆచారాలపై అంత శ్రద్ధ వుండేది కాదు. నాకు యివన్నీ ఒక వివరణ లేని అర్ధంలేని కార్యాలుగా తోచేవి.

నేను హైస్కూలులో వున్నప్పుడు బలోపేతంగా ఈ మతపరమైన నమ్మకాలను, విద్యార్ధులలో చర్ఛ్ విద్యలు, మరియు వారి వేదాంత ధోరణుల శిక్షణనిస్తూ వాటిని గురించి తెలుసుకుని నమ్మకం కలిగేలాగా ప్రోద్బలం చేసేవారు. పద్ధతి ప్రకారంగా నేను నాలో నేనే అంతర్ముఖంగా పరిష్కరించుకుని ఒక మంచి స్వభావాన్ని అలవరచుకోవడానికి ప్రయత్నించాను. 1985లో నా ఈ అన్యమనస్కతకు నా స్నేహితురాలు నన్ను ఒక కోర్సు చేయమని అదీ ముఖ్యంగా స్వస్థత చేకూర్చడానికి కావలసిన సూత్రాలతో కూడిన కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా నాకు తెలిపింది. అనుమానాలు ఎక్కువగా వున్న నాకు పాల్గొనాలనిపించలేదు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఆమె ఆ కార్యక్రమాలను గురించి చెపుతూ తను పొందిన అనుభవాలను అతిశయంతో చెప్పింది. నేను వాటిని ఖండిస్తూ అదంతా నిరుపయోగమని తెలపగా ఆమె తరాత జరిగే ఈ కార్యక్రమానికి నా కోసం డబ్బులు కడతానని నన్ను వెళ్ళమని కోరింది.

ఆమె ఒత్తిడి చేయడంతో నేను అయిష్టంగానే ఆమెతోపాటు ఆ కార్యక్రమానికి నా డబ్బులను నేను కడతానని షరతుతో వెళ్లాను. నా ఉద్యేశ్యం అక్కడ జరిగే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలుసుకోవాలని. ఆ కార్యక్రమం పరిచయములోనే అక్కడ నేను విన్న మాటలు నాకు మతమరంగా గల వ్యతిరేక భావాలను యింకా బలోపేతం చేశాయి. కానీ, నేను అక్కడ ఎలాగో వున్నాను కనుక కార్యక్రమంలో మొత్తం వారం రోజులు పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.

కార్యక్రమానంతరం మా చేత చిన్న అభ్యాసం చేయించారు. అందులో వారు ఒక అపరిచిత వ్యక్తిని పరిశీలించి అతని సాధారాణ లక్షణాలను అతనికి గల ఆరోగ్యకరమయిన సమస్యలను అంచనావేయడం. ఈ అపరిచత వ్యక్తిని అక్కడి నిర్వాహకులు అంతకు మునుపే విచారించి ఉంటారు. మేము చేసిన విశ్లేషణ అక్కడి నిర్వాహకుల విశ్లేషణలతో సరిపోలుతాయే లేదా అనీ బేరీజు వేస్తారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా నేను సూచించినవి 100 శాతం సరిపోయాయి. అందరూ నన్ను ఒక హీరోలాగా చూడటం మొదలుపెట్టారు. నాకు అక్కడ నిర్వాహకులు కేవలం వారి ప్రచారం కోసం అలా చేశారని నాకు అనిపించింది. ఈ ప్రక్రియ కేవలం అక్కడి నిర్వాహకులు ప్రజలలో వారి సంస్థ యొక్క పేరును ప్రచారం చేయడానికి వారు అనుసరిచించిన చిట్కా అని నాకనిపించింది, కాని పవిత్రంగా మాత్రం నాకు అనిపించలేదు. నాకు ఈ కార్యక్రమంలో భాగస్థుడనవ్వాలనిపించలేదు.

ఈ కార్యక్రమం అనంతరం సైన్సు పరంగా యింకా అధ్యయనం చేసి వారి ఆలోచనలు తప్పని నిరూపించి చూపించాలని నేను అనుకున్నాను. వారి ముఖ్య వుద్దేశ్యానికి నేను వ్యతిరేకించాలనే ఆలోచన నాకు లేదు. నేను కొద్ది మంది బృందంతో కూడి సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాను. నేను వారి థియరినీ ఖండించలేకపోయాను. వారి ప్రక్రియలను నేను కూడా అంగీకరించడం మొదలుపెట్టాను. అక్కడ నాతోపాటు పని చేసేవారు కొంత తప్పుడు సమాచారాలను యిచ్చి నా రిసేర్చిని బలహీన పరచడానికి ప్రయత్నం చేశారు.

నాకు విషయ జ్ఞానం సంపాదించాలనే ఆలోచన కలుగుతూ, నేను అడగకుండానే తగిన సమాచారం అందుతూ వుండేది. నా స్నేహితుడు నన్ను ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలను చదవమని ప్రోత్సహిస్తూ అతని పుస్తకాలను నేను చదవడానికి నాకు యివ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. నాకు కలిగిన సందేహాలకు అవి వుపయోగపడతాయని తెలిపాడు. నేను అతని మాటలను పెడచెవిన పెట్టినా, అతను నన్ను పుస్తకాలను చదవవలసినదిగా ఒత్తిడి చేశాడు. ఒక రోజున నేను అతని పుస్తకాలలో ఒక పుస్తకాన్ని, ఒక యోగి చేత వ్రాయబడిన పుస్తకం, పరమహంస యోగానందచే వ్రాయబడిన “Autobiography of a Yogi” ‘‘ఒక యోగి ఆత్మకథ’’ అనే పుస్తకాన్ని తీసుకుని చదవడం మొదలు పెట్టాను. ఆ పుస్తకం చదివి నేను ఆ పుస్తకంలో ఆ యోగి వ్రాసిన విషయాలకు ప్రేరేపితుడనయ్యాను. వాటిలోని ఒక ప్ర్ర్రక్రియ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అది క్రియాయోగం గురించి. ఈ విషయం నేను కొత్తగా విని వుండడం వలన నాకు మనసులో ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలయింది. నా శరీరంలోని ప్రతి అణువు నన్ను క్రియాయోగానికై ఉత్తేజపరిచింది. అందువలన నేను అన్ని చోట్లకు ఈ క్రియాయోగం గురించి తెలుసుకోవడానికి నా శోధన ప్రారంభించాను. నాకు చాలా జవాబులు దొరికాయి, కానీ, నేను కలిసిన వారు ఎవ్వరికీ ఈ విషయం గురించి ఏమీ తెలియదు. తెలుసుకోవాలనే తపన శిష్యుడిలో కలిగిననాడు గురువు తప్పక వస్తారని చెప్పబడింది.

ఒక రోజున నేను ఈ సమాచారాన్ని గురించిన అడిగిన వ్యక్తి, నా దగ్గరకు వచ్చి, భారతదేశం నుండి ఒక స్వామీజీ వారు ట్రినిడాడ్ కు క్రియాయోగం నేర్పించడానికి వస్తున్నారని తెలిపాడు. నాలో ఉత్సాహం ఉరకలు వేసి నేను యింకా సమాచారం తెలుసుకోసాగాను. డేవిడ్ ముకుంద బలరూప్ అనే ఆయన ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరని తెలుసుకున్నాను. నేను బలరూప్ గారి యింటికి వారిని కలవడానికి వెళ్ళాను. ఆయనకు చాలామంది పేర్లు యిచ్చి వున్నారని, నా పేరును కూడా అందులో వ్రాస్తానని తెలిపారు. చివరగా ఆ పేర్లను స్వామీజీ వారు నిర్ణయిస్తారని తెలిపారు.

మొండితనంతో కూడిన వైఖరితో నేను శ్రీ బలరూప్ గారితో, నాకు ఆ లిస్టుతో సంబంధంలేదనీ, నా పేరు అందులో వున్నా లేకపోయినా నేను యీ తరగతులకు హాజరయి యోగా చేస్తాననీ, వారికి నచ్చినా నచ్చకపోయినా చేసి తీరతానని తెలిపాను. ఆ తరువాత అతను నాకు శ్రీ స్వామీజీ వారిని సంప్రదించవలసినదని, వారికి ఉత్తరం వ్రాయవలసిందని సలహా యిచ్చారు. నాకు తెలిసనంత వరకు నేను శ్రీ స్వామీజీ వారికి ఆ ఒక్క ఉత్తరమే వ్రాశాను. కానీ నాకు ఏ విధమైన సమాధానం రాలేదు. కొన్ని వారాల అనంతరం, నా జేబులను తడుముకుంటుండగా నాకు ఒక చిన్న కాగితం ముక్క దొరికింది దానిలో శ్రీ బలరూప్ గారి ఫోన్ నెంబరు వుంది.

నేను వారికి శ్రీ స్వామీజీ వారి పర్యటను విషయమై సమాచారం కోసం ఫోన్ చేశాను. వారు నాకు శ్రీ స్వామీజీ వారు ఆ శుక్రవారం నాడు వస్తారని వారు సెయింట్ జేమ్స్ మందిరంలో వుంటారని నన్ను అక్కడికి వచ్చి పాల్గొనమని, దాని వలన నాకు ఉపయోగం జరుగుతుందని తెలిపారు. నేను శ్రీ స్వామీజీ వారిని మొట్టమొదటిసారిగా చూడబోతున్నాను. నేను వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయక కేవలం వారిని చూస్తూ వున్నాను. ఆ తరువాత వారు సౌత్ ట్రినిడాడ్ లోని హిందుస్థాన్ విలేజ్ కు ఒక కార్యక్రమం కోసమై వెళుతున్నారని తెలిసింది.

నా మనసులో ఈ స్వామీజీ వారు ఎవరు? వారు ఏ విధమైన ప్రతిపాదనను కలిగి వున్నారని తెలుసుకోవాలనిపించింది. వారిని చాలా సమీపంగా చూడాలని నాకనిపించింది అందుచేత నేను హిందుస్థాన్ కు ప్రయాణమయ్యి వారిని కలవాలని నిశ్చయించుకున్నాను. శ్రీ బలరూప్ గారు నన్ను శ్రీ స్వామీజీ వారికి పరిచయం చేశారు. నాకు వారితో ఏ విధమైన అనుసంధానం కలగలేదు. నాకు వారితో అంత ప్రత్యేకమైన అనుభూతి కలగలేదు. తరువాత క్రియాయోగ తరగతులలో పాల్గొనడానికి నాకు అనుమతి లభించింది. నాతోపాటు ఇరవై ఏడు మంది ఈ తరగతులలో పాల్గొనడానికి ఎంపిక అయ్యారు. నేను స్వామీజీ వారికి సమీపంగా కూర్చుని వారిలోని ప్రత్యేకతను గుర్తించాలని అక్కడ తరగతులలో పాల్గొన్నాను. నేను వారు కొన్ని వస్తువులను సృష్టించడం చూశాను అవి యుక్తులని నేను వాటిపై అంత ప్రేరేపితుడ్ని కాలేదు.

వారి మానవత్వం నాకు చాలా ప్రేరణ కలిగింది. క్రియాయోగా తరగతులు జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆగి వారు ఏమైన ప్రశ్నలు గాని, అనుమానాలు గానీ ఎవరికైనా వున్నాయా అని మృదువుగా అడిగేవారు. నేనే వారిని అందరికన్నా ఎక్కువ ప్రశ్నలడిగానని అనుకుంటున్నాను. అయినా నాకు వారిలో అంత గుర్తించ తగినంత గొప్పతనం కనిపించలేదు. నేనడిగిన ప్రశ్నలలో వారిని నేను నా హీలింగ్ ప్రాక్టీస్ను కొనసాగించాలా అని అడిగాను. వారినుండి నాకు సమాధానం రాలేదు.

కార్యక్రమం ముగింపు సమయంలో శ్రీ స్వామీజీ వారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో యింటర్వ్యూ యిచ్చారు. నేను వారి సమాధానాల కోసం పెద్ద ప్రశ్నల పట్టికను తయారు చేసుకున్నాను. నా వంతు వచ్చి నేను వారి గదిలోకి వెళ్లగానే, శ్రీ స్వామీజీ వారు నా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు. నేను అక్కడ కూర్చుందామనుకునే లోపు వారి నోటినుండి ‘‘అమ్మవారు మిమ్మల్ని చింతపడవద్దనీ మీ స్వస్థత కార్యక్రమాలను కొనసాగించవలసినదని, మీ గురించి అంతా అమ్మ చూసుకుంటానని, నీ కర్మను తాను భరిస్తానని తెలిపింది’’ అన్నారు. నేను ఒక్కసారిగా ఆ మాటలను నిశ్చేష్టుడనయి, నేను అడగాలనుకున్న ప్రశ్నలూ, సందేహాలు అన్నీ తుడిచిపెట్టుకు పోయి నేను వారిని ప్రశ్నలడగలేక విఫలుడనయ్యాను.

ఆ మరునాడు విద్యార్ధులంతా శ్రీ స్వామీజీ వారికోసం సాంస్కృతిక ప్రదర్శనలు యిచ్చారు. నాకు వాటిల్లో పాల్గొనాలనిపించక నేను ఆ ప్రాంతంలో కొద్దిగా వెనుకకు కూర్చున్నాను. నాకు ఆశ్చర్యం కలగజేస్తూ స్వామీజీ వారి సహాయకులు వచ్చి కృష్ణమహరాజ్ గారు శ్రీస్వామీజీ వారు మిమ్మల్ని ముగింపు కార్యక్రమంలో మాట్లాడవలసినదిగా ఆజ్ఞాపించారు అని తెలిపారు. అంతే నేను తికమకపడిపోయి, నాలో నేను యిలా అనుకోసాగాను. నేనే ఎందుకు? యింత మందిలో నన్నే ఎందుకు మాట్లాడమన్నారు. నేను అక్కడికి వెళ్ళిన ఉద్దేశ్యం యోగా నేర్చుకోవాలని, నేను నేర్చుకున్నాను. నేనే ఎందుకు ముగింపు ప్రసంగం చేయాలి? యిలాంటి ఆలోచనలు నా మదిలో తిరగసాగాయి.

శ్రీస్వామీజీ వారు చెప్పారు కాబట్టి నేను మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాను. నేను మాట్లాడిన తరువాత నాలో భావోద్వేగాలు కలిగాయి నేను వాటిని గురించి చెప్పలేను. అందరూ నన్ను అభినందించసాగారు. నేను తికమకపడి, నేను భావోద్వేగాలలో తేలియాడుతూ నేను ఎవరితోనూ మాట్లాడలేకపోయాను. నా ఆలోచనలో ఏదో పొరపాటు జరిగిందనీ ఆ తరువాత నాకు స్పృహ వచ్చి శ్రీస్వామీజీ వారు నన్ను వారి వద్దనుండి ఎందుచేతనో దూరంగా వుంచుతున్నారనిపించింది. నాకు కారణం అర్ధంకాలేదు. శ్రీ స్వామీజీ వారి పర్యటనలలో నేను అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాను.

వారి పర్యటన చివరి రోజున వారి గదిలోకి వెళ్లపోయారు. నేను వారిని కలిసిననుండి అక్కడ నా అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ నిలబడ్డాను. యింతలో నాతోపాటు క్రియాయోగ తరగతులలో పాల్గొన్న ఒక వ్యక్తి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అతను నేను చాలా ప్రశ్నలు వేశానని గుర్తు పట్టాడు. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ, నేను స్వామీజీ వారిని అడగాలనుకున్న నా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు. నేను మాటలు రాక మూగపోయి అతని మాటలను వింటూండిపోయాను.

నాకు యితని మీద కొద్దిగా శ్రద్ధ కలిగి, అతని ఆధ్యాత్మిక సాధనలను గురించి అడిగాను, దానికి అతను ఆధ్యాత్మికంగా తాను ఏ విధమైన సాధన చేయటం లేదనీ, శ్రీ స్వామీజీనే నాతోటి అతని ద్వారా మాట్లాడుతున్నారని తెలిపాడు. అతనికి తను మాట్లాడుతున్న దానిని గురించిన అర్థం తెలియకుండానే ధారాళంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అతనికి తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం తను యిటీవల చదివిన ఒక పుస్తకం నుండి తెలసుకున్నాననీ ఆ పుస్తకం పేరు ‘‘ఒక యోగి ఆత్మకథ’’ అని నేను యిదివరకు చదివిన పుస్తకం పేరు తెలిపాడు. నేను ఈ యాదృచ్ఛికతకు నవ్వుకున్నాను. గురులీలలు ఎంత విచిత్రమైనవో కదా!

నేను, ఆ పుస్తకాన్ని యింతకు పూర్వము చదివానని కానీ ఆ పుస్తకంలో అతను చెప్పిన వివరాలు లేవని తెలిపాను. అతను ఖచ్చితంగా ఇది తనకు తెలియకుండానే శ్రీ స్వామీజీ వారే యిది తెలిపారని చెప్పాడు. ఈ ప్రకటన నన్ను కుదిపివేసింది. ఈ సన్నివేశం నాలో ఏకాగ్రతను పెంచింది. ఈతని పలుకులు నన్ను శ్రీ స్వామీజీవైపు ఆకర్షితుణ్ని చేశాయి. స్వామీజీ వారు వేళ్ళే వరకు నన్ను క్రియాయోగ సాధనకు మరియు బోధించడానికి ఒక పరికరంగా చేశారు. ఈ సందర్భంగానూ మరియు అనేక సందర్భాలలో శ్రీ స్వామీజీ వారితో పర్యటనలు చేసినపుడు నాకు చాలా అనుభవాలు కలిగాయి. వాటిని నేను వివరించలేను ఎందుకంటే నేను నిరూపించలేను.

వారి పరిచయం అయిన నుండీ నేను వారికి సమీపంగా వుండడానికి ప్రయత్నించలేదు. నేను వారి ఉపదేశాలను శ్రద్ధగా వింటూ వాటిని నా నిత్యజీవితంలో ఎలా సరిపోతాయో గమనించేవాడిని. నాకు అవి ఎలా వర్తిస్తాయో అని ఆలోచించేవాడిని. నాకు మిగతా వాటి పట్ల చాలా సార్లు విభేదాలు కలిగాయి. వారితో గడిపిన ప్రతి సన్నివేశం నా సాధనకు ఉపయోగపడి నేను అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాన్ని నాకు జరిగిన అనుభవం శ్రీస్వామీజీ వారు ట్రినిడాడ్ సందర్శించనపుడు కలిగింది.

శ్రీ స్వామీజీ వారు ట్రినిడాడ్ సందర్శించిన మొదటి వారంలో వారు చాలా ఆగ్రహాంగా కనిపించారు. అక్కడి నిర్వాహక సభ్యులనందరిని దండిస్తున్నారమో అని నాకు కనిపించింది. క్రియాయోగ తరగతుల అధ్యక్షుడిగా నన్ను ఒక నివేదికను సమర్పించమని కోరారు. నేను తయారుచేయలేదు. నాకు సమర్పించడానికి నా దగ్గర ఏదీ లేదు. నాతోటి వున్న సహచరులు నన్ను వారిని క్షమాపణలు కోరి శ్రీస్వామీజీ వారి పాదాలకు నమస్కరించమని తెలిపారు. నేను ఆ శిక్ష విధించడం సబబు కాదని భావించాను నేను వారి చెప్పిన విధంగా అనుసరించలేదు. అప్పుడు శ్రీ స్వామీజీ వారు లోపలికి వెళ్లిపోయారు. అక్కడ వారి అనుచరులతో సంభాషణలు జరిపారు.

ఆ సంభాషణ అనంతరం వారు వచ్చి ఆశీనులయ్యారు. వారిలో చాలా మార్పు కలగడం గమనించాను. వారు మాకు యిప్పటినుండి ఏ విధమైన అంతఃకలహాలు జరగవనీ అంతా ప్రశాంతత నెలకొంటుందని తెలిపారు. ఆ సమావేశం ముగిసింది. శ్రీస్వామీజీ వారు నా వైపుకు వచ్చి నన్ను గాఢంగా బిగ్గరగా సుతిమెత్తగా కౌగిలించుకున్నారు. నాకు ఈ అనుభవం ఎన్నడూ కలగలేదు. నేను ఈ అనుభవాన్ని ఎన్నడూ మరచిపోను. మిగతావారి వైపుకు తిరిగి వారిని తమ వ్యక్తిగత ప్రవర్తనకై క్షమాపణలు తెలిపారు. ఈ సన్నివేశం నన్ను చాలా ప్రభావితం చేసింది. నా మనసు వారు అలా తమ దివ్య ప్రవర్తనతో మారిన కారణాన్ని వెదకసాగింది.

ఆ తరువాత రాత్రి శ్రీ స్వామీజీ వారు కొన్ని మధురమైన భజనలను ఆలపించారు. శ్రోతలందరూ ఒక ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. భజనల అనంతరం శ్రీ స్వామీజీ వారు తమ అనుగ్రహ భాషణం చేశారు. దానిలో వారు యిలా చెప్పారు ‘‘స్వామీజీ వారు ఒక పాత్రలో పాలుపోసే ముందు వారు మొట్టమొదట ఆ పాత్రను శుభ్రం చేసి, దానిలో వున్న దుర్గుణాలను తొలగించి, అది పరిశుభ్రం అయిన తరువాత ఆ పాత్రలో పాలు పోస్తారని తెలిపారు. నేను ఈ మాటలను నాకు ఆపాదించుకున్నాను. ఈ సంఘటన నా ప్రవర్తనపై ఎంతో ప్రభావం చూపింది.

నేను 2000-2001వ సంవత్సరంలో భారతదేశానికి పర్యటన చేసినప్పుడు నాకు వారిపై అసహనం కలగసాగింది. వారు మాట యిచ్చి వాటిని ఆచరించకపోవడం వాటిని రద్దు చేస్తూండడంతో నాలో అసహనం కలిగింది. వారు ఒక కార్యక్రమం గురించి తెలిపి, కొద్దిసేపటిలోనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసేవారు. యిది నన్ను కొంత అసహనానికి గురి చేసి నేను వారికి నా మనోభావాలను వ్యక్తపరుస్తూ వారికి ఒక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఒక రోజు వారు మైసూరు ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు నేను వారిని దర్శనం చేసుకుని నమస్కారాలను తెలపడానికి క్యూలో నుంచుని, వారికి పండ్లు, పూలు సమర్పించడానికి బదులుగా నేను వారికి నా అభిప్రాయాన్ని తెలుపుతూ ఆరు పేజీల వుత్తరాన్ని సమర్పించాను. వారు ఆ వుత్తరాన్ని స్పర్శ చేశారు. వారికి అందులో వున్న విషయాలు తెలుసు. వారు ఆ ఉత్తరాన్ని తీసుకుని కదలకుండా నిశ్చలంగా వున్నారు.

ఆ మరునాడు వారు బొమ్మెపర్తికి హెలికాప్టరులో వెళ్ళారు. నేను అక్కడికి చేరిన అనంతరం నన్ను చూసి నవ్వుతూ వారు ‘‘కృష్ణమహరాజ్ మీరు చాలా మంచి రచయిత. మీరు చాలా బాగా వ్రాస్తారు. మీరు లాయర్. మరి స్వామీజీ వారు లయ్యర్’’ అని అన్నారు. నేను ఆ వుత్తరంలో నా మనోభావాలను వ్యక్తపరచాను. శ్రీ స్వామీజీ వారు నన్ను వారి నుండి దూరం ఎందుకు వుంచుతున్నారని అనుకుంటున్నానో వివరించి తెలిపారు. ఈ అనుభవాన్ని వారు కబీరుదాసుతో పోల్చారు. ఆ సమయంలో నేను వారి పాదాలు పట్టుకుని వారి చెంత వుండాలని కోరాను. కానీ శ్రీ స్వామీజీ వారు మరికొంత సమయం వేచి వుండాలని, కొద్ది వారాలలో జరగబోయే దాని గురించి వేచి చూడాలని తెలిపారు.

ఈ పర్యటనలో స్వామీజీ వారు నాకు మేకెదాటులో నది సమీపంలో ఒక తెల్లవారు ఝామున ఉపదేశం చేశారు. నాకు ఉపదేశం చేసిన అనంతరం అక్కడి సమీపంలో కొండలలో చుట్టూ వున్న నీటి ప్రాంతంలో నేను ముగ్గురు సూర్యులు ఆ నీటిలో ప్రతిబింబిస్తూ మెరుస్తూ కనిపించారు. నాకు ఈ సన్నివేశం చాలా ప్రత్యేకమైన సందర్భమని తోచింది. తన శిష్యుణ్ని ఏ సమయంలో ఆశీర్వదించాలో గురువుకు తప్పక తెలుస్తుంది.

యిది నాకు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారితో వున్న అనుబంధం. గురువు నా యొక్క మనస్సాక్షికి ప్రతిరూపమని పూర్తిగా నాకు నిర్ధారణ అయి నేను అంగీకరించాను. గురువు మనము మన అంతరాత్మని వినేవరకు సహాయం చేస్తారు. నీ అంతరాత్మని నీవు గనక వినగలిగితే అప్పుడు సతతం నీ గురువుతోటి నీకు అనుసంధానం కలిగి వుంటుంది. యిది ఎలా అంటే శ్రీ స్వామీజీ వారి సశీరీరంతో వున్నా లేకపోయినా వారితో మనకు వారి ఆత్మలో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. యిది ఆలయాలతోగానీ, చర్చిలతో గానీ, మరియు మసీదులతో గాని సంబంధం వుండని అనుబంధం కానీ మతపరమైన విషయాలతో గానీ సంబంధం లేదు. నేను ఈ విధంగానే చూశాను. నేను ఈ విషయాన్ని అబద్ధంగా గానీ, మోసం చేయడానికి గానీ చెప్పడంలేదు. నా మనస్సాక్షి నన్ను ఎన్నడూ తప్పు దారి పట్టించదు. నా గురువుతో ఈ రకమైన అనుబంధమూ, సమాగమము ఎల్లవేళలా శాశ్వతంగా ముగింపు లేకుండా వుంటుందని నాకు తెలుసును.

జయ గురు దత్త

Tags: