SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
కృష్ణ కుమార్, మైసూరు ( Krishan Kumar, Mysore)

నేను 1934వ సంవత్సరంలో పాకిస్తాన్లో జన్మించాను. 1949లో మా కుటుంబ సభ్యులతో పాటు దేశవిభజన కారణంగా భారతదేశానికి వలస వచ్చేశాము. ఒక ముస్లిం బడిలో నా ప్రారంభ విద్యాభ్యాసం జరిగింది. నేను పాకిస్తానులో పెరగడం వలన, జీవితంలో అనేక కష్టాలను అనుభవించడం వలన, దేశవిభజనను, నరమేధాన్ని, హిందువులూ ముస్లింలూ ఒకరినొకరు చంపుకోవట వంటి సంఘఠనలు నా మనస్సులో ఒచ చెదరని మచ్చను వేశాయి. నా చిన్నతనం అంతా రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కష్టాల బాటలో సాగింది. ఆ తరువాత దేశ విభజన, నా మనసులో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిపోయింది.

ఎదుగుతున్నకొద్దీ, నాకు ఏ విధమైన మతపరమయిన మరియు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు కలగక నేను యాంత్రిక జీవనం సాగిస్తూ, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా వుండేది. 1948వ సంవత్సరంలో నేను ఢిల్లీ చేరి వున్నత విద్యనభ్యసించి చాలా ఉన్నతంగా సఫలీకృతుడనయ్యాను. నాకు చాలా గొప్ప వ్యక్తిని కాలవాలని అభిలాష వుండేది. నేను ఆనర్స్ లో ప్రథమ శ్రేణిలో మాస్టర్స్ కోర్సు చేయడం చేత నాకు ఉపాధ్యాయుడిగా వుద్యోగం లభించింది. ఆ సమయంలో నాకు వివాహం కూడా జరిగింది. నా భార్యకూడా ఉన్నతంగా అభివృద్ధి చెందినది. మాకు, నందిని, దీప, మరియు రూప అని ముగ్గురు పిల్లలు కూడా కలిగారు.

1969వ సంవత్సరంలో హఠాత్తుగా దీపకు జబ్బు చేసింది. అది సాధారణ సుస్తీ అని త్వరలో నయమవుతుందని మేము అనుకున్నాము. కానీ అది చాలా ప్రమాదకరమైన జబ్బని ఆమెకు రక్తపు కాన్సర్ అని నిర్ధారణ అయింది. నేను చాలామంది చిన్నపిల్లల వైద్యులను, ఢిల్లీలోని అన్ని ప్రముఖ ఆసుపత్రులను సంప్రదించాను వారు మా అమ్మాయి ఆరునెలలకు మించి జీవించదని తమ నిస్సహాయతను తెలిపారు. ఆ పాప మరణించే రోజును తెలపలేమని, మీరు ఈ నిజాన్ని తెలుసుకుని ధైర్యంగా జీవించండని కూడా తెలిపారు. నేను ఈ వార్త విని చాలా నిరాశ చెందాను. నాకు మాటలు రాలేదు. ఆ పాప చాలా అందంగా ముద్దుగా వుంటుంది. నేను ఆమెతో అనుబంధాన్ని పెంచుకున్నాను. ఒకవేళ ఏదయినా అద్భుత శక్తి ఆ పాపకు జీవితాన్ని ప్రసాదిస్తారని తెలిస్తే నేను ఆనందంగా ఎగిరి గెంతులు వేస్తాను.

నాకంతా అంధకారంగా అనిపించింది. నాకు జీవితం చాలా కష్టమనిపించింది. మాకు అన్ని విధాల నిస్పృహ కలిగింది. మా పాపకు ఈ విషయం గురించి తెలియదు, కానీ తల్లిదండ్రులుగా మాకు, మిగతా కుటుంబ సభ్యులకు ఆమె త్వరలో మరణిస్తుందని తెలుసు. అలాంటి సమయంలో నేను ఎక్కడపడితే అక్కడికి ఎవరు నయం చేస్తారని తెలిస్తే వారి వద్దకు ఏ గురువు గురించి తెలిస్తే వారి వద్దకు వెళ్ళేవాడిని. నా చిన్నతనంలో అద్భుతాలు జరుగుతాయని విన్నాను. వారి కష్టాల సమయంలో వారికి అద్భుతమైన సంఘటనలు జరిగాయని కూడా తెలుసుకున్నాను. నేను కూడా నాకు అలాంటి అద్భుతమైన అనుభవం జరిగితే బాగుంటుందని అనుకున్నాను.

అలాగే భారంగా అక్టోబరు, నవంబరు మాసాలు గడిచాయి. ఆ సమయంలో నా స్నేహితుడు ఒక రోజు నాకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మైసూరులో వుంటారని వారిని కలవమని వారి వలన నాకు ఏమయినా సహాయం అందుతుందోమో వెళ్ళమని తెలిపాడు. డిసెంబరు నెలలో నేను వారికి నా పరిస్థితిని వివరిస్తూ ఒక ఉత్తరం వ్రాశాను. మా అమ్మాయిని ఫిబ్రవరి నెలలో శివరాత్రికి మైసూరుకు తీసుకురావలసిందని నాకు పది రోజులలోపు నా వుత్తరానికి బదులు వచ్చింది.

నేను యూనివర్సిటీలో లెక్చరరుగా పని చేస్తున్నాను. నా దగ్గర మా అమ్మాయిని విమానంలో తీసుకుని వెళ్లేంత డబ్బులు లేవు. మా అమ్మాయికి రక్తంలో 96 శాంతం లింఫోబ్లాస్ట్స్ సెల్ల్స్ వున్నాయని రక్తపరీక్షలో తెలిసింది. నేను లోన్ తీసుకుని మా అమ్మాయిని మైసూరుకు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత నాకు మళ్ళీ యింకొక ఉత్తరం అందింది. ‘‘దిగులు చెందవద్దు. శ్రీ స్వామీజీ వారు మీ రాకకై ఏర్పాట్లు చేశారు.’’ అని. నాకు విషయం అర్ధం కాలేదు. కొద్దిరోజుల అనంతరం మా డైరెక్టరు వచ్చి నన్ను బెంగుళూరులో జరిగే ఒక కాన్ఫరెన్సుకు నన్ను వెళ్ళవలసినదిగా తెలుపుతూ నాకు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీని వలన నాకు ఆర్ధిక యిబ్బంది లేకుండా నేను మా అమ్మాయిని తీసుకుని ప్రయాణం చేయగలిగాను. ఆ తరువాత నాకు స్వామీజీ వారి గురించి అర్ధమయింది.

1970లో నేను ఆశ్రమం చేరుకున్నప్పుడు కొన్ని వేలమంది స్వామీజీ వారి చుట్టూ వున్నారు. ఆయన చూస్తే చాలా చిన్నవయస్సుతో వుండి అటూ యిటూ తిరగుతున్నారు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నాకు కొన్ని ప్రతికూలమైన ఆలోచనలు కలిగాయి. నాకు మూఢనమ్మకాలతో ప్రజలు వారిని అనుసరించటం నచ్చక నాలో నేను ఈ స్వామీజీ ఆధ్యాత్మిక వ్యక్తి ఎలా అవగలరని అనుకున్నాను. నేను అక్కడ రెండు రోజులు వున్నాను. అప్పుడు నాకు వారిని కలవడానికి అవకాశం కలిగింది. నేను మా అమ్మాయిని పట్టుకుని వుండగా, వారు వారి చేతులను చాచి అమ్మాయిని వారికి యివ్వవలసినదిగా సౌంజ్ఞ చేశారు. ఆ సమయంలో నాకు దుఃఖం ఆగక నేను భోరున విలపించాను.

నేను ఏడుస్తూ వారిని మీరు ఈ అమ్మాయిని కాపాడగలరా? ఈ పాప కొద్దిరోజులలో చనిపోతుంది అని అడిగాను. నేను ఆ రోజు శ్రీ స్వామీజీ వారి సమక్షంలో ఏడ్చినంతగా నా జీవితంలో ఎన్నడు ఏడ్చి వుండను. నాకు యిప్పటికీ స్పష్టంగా గుర్తు. వారు కారుణ్యతతో నవ్వుతూ నాతోటి ‘‘ప్రయత్నిస్తాను’’ మీరు వారానికి ఒకసారి ఆరాధన చేయండి అని నాకు ఒక గణపతి విగ్రహాన్ని యిచ్చారు. వారు నన్ను వారానికి ఒకసారి అర్చన చేయమని ఎందుకు చెప్పారు? ఎందుకు ప్రతీ రోజూ ప్రతి ఉదయం చెయ్యమని అనలేదు. నా ఉద్దేశ్యంలో ఆరాధన చేయటమనే ఆలోచన నా జీవితంలో ఒక విచిత్రమైన విషయం. నాకు గుడికి వెళ్ళాలన్న ఆలోచనగాని, ప్రార్ధనచేయాలనిగానీ, మతమరమైన భావాలుగానీ, ఆధ్యాత్మిక పరమైన జీవనంగాని అలవాటు లేదు. నా జీవితమంతా హాయిగా తిని, తాగి, ఉల్లాసంగా గడపడమే. పూర్తిగా భౌతికపరమైన ఆలోచనలే, కేవలం లౌకికమైన అశాశ్వతమైన వాటిని గురించిన చింతన కలిగి వుండేవాడిని. నన్ను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి నడపడానికి వారు నన్ను వారానికి ఒకసారి ఆరాధించమని చెప్పారు.

తరువాత మేము ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయాము. నేను వారిని ఒకసారి ఆరాధించడం మొదలు పెట్టాను. ప్రతీ గురువారం నేను అభిషేకం చెయ్యడం మొదలు పెట్టాను. నాకు దాని ప్రాముఖ్యత తెలియకపోయినా, కూడా నాకు గణపతికి నీరు యివ్వాలనిపించేది. అక్కడ కాసేపు కూర్చుని శ్రీ స్వామీజీ వారి నామం చెబుతూ అతన్ని ప్రార్ధించేవాడిని. యిలా ఒక నెలరోజులు గడిచాయి. ఆ సమయంలో మా అమ్మాయిని రక్త పరీక్షలకు తీసుకుని వెళ్ళాము . ఆ పరీక్షలలో ఒక్క శాతం కూడా కాన్సర్ కణాలు అమె రక్తంలో కనబడలేదు. అది నాకు అద్భుతమైన ధైర్యాన్ని మరియు నాకు పులకరింతను కలిగించింది.

ఒక నెల తరువాత నేను మైసూరుకు వెళ్ళి, పారవశ్యంతో గంతులు వేస్తూ స్వామీజీ వారికి అద్భుతం జరిగిందని తెలిపాను. అప్పటి వరకూ నేను శ్రీ స్వామీజీ వారు సృష్టిచేయడం గురించి వినడమే తప్ప ఆ సన్నివేశాన్ని చూచి ఎరుగను. నాకు అది ఛూడాలని చాలా కోరిక కలిగింది. నేను వారికి ఒక పుష్పాన్ని యిచ్చాను. ఆ పుష్పంలో నుండి గణపతిమూర్తి ఉద్భవించింది. నేను మళ్ళీ ఉత్సాహంతో మరియు ఆనందతో గంతులు వేయడం ప్రారంభించాను. నేను ఆశ్రమంలో వుంటున్నప్పుడు, ఒక మధ్యాహ్నం శ్రీ స్వామీజీ వారు నన్ను పిలిచి, నా వైపు తీక్ష్ణంగా చూస్తూ ఏవో పదాలను ఉచ్చరిస్తున్నారు. వారు నిజానికి నా తోటి నేనెవరినో, వారితో నాకు గల సంబంధాన్ని, రాబోయే కాలంలో నేను ఏ విధంగా జన్మిస్తానో, యింకా మరికొన్ని విశేషాలను కూడా నాకు తెలిపారు. ఆ వెల్లడించిన విషయాలు ఆ సమయంలో చాలా తీవ్రంగా అనిపించాయి. వారిని చూస్తూ వారు చాలా దీర్ఘంగా నిమగ్నమయి ఎవరి చేతనో ప్రేరేపింపబడి ఈ విషయాలను చెబుతున్నారని నాకు అర్ధమయింది.

ఆ తరువాత నన్ను వారి గదిలోనికి తీసుకుని వెళ్ళి, నాకు భారతదేశపు చిత్రపటాన్ని చూపిస్తూ కొన్ని ప్రదేశాల పేర్లను చెబుతూ వారికి అక్కడికి వెళ్ళాలని వుందని, నన్ను తీసుకుని వెళతావా అని అడిగారు. అది నాకు స్వర్గంనుండి వచ్చిన సందేశంలాగా అనిపించింది. యిలా నేను ఈ మిషనరీ జీవితంలోకి ప్రవేశించి వారికి సేవ చేయడం ప్రారంభించాను. నాకు మా అమ్మాయి సంగతి మరచిపోయి వారికి సేవ చేయాలనిపించింది. నా మనసంతా వారు చెప్పిన పనులను ఆచరించి సేవ చేయడంపై కేంద్రీకృతమయింది. అది చాలా అద్భుతమైన సమయం. వారితో పాటు ఉత్తర భారత యాత్రలు చేయటం, పవిత్రమైన బదరీనాథ్, కేదార్ నాథ్, అలహాబాద్, బెనారస్, కశ్మీరు మరియు జమ్మూ వంటి పవిత్ర ప్రదేశాలు సందర్శించాను.

నేను ఈ సమయంలో మతపరమైన ఆలోచనగానీ, లౌకికపరమైన ఆలోచనలకు గాని లోనుకాకుండా, వారిపై అమితమైన ప్రేమ భావాన్ని పెంచుకున్నాను. ఈ విధమైన అప్యాయత దృఢమయ్యి అదే నా జీవితంలో ముఖ్యమైన లక్ష్యంగా అయింది. నేను కుటుంబంపై అంత శ్రధ్ధ కనబరచడం కాని, ఉద్యోగంలో కాని, అక్కడి పరిసరాలపై కాని నా శ్రద్ధను తగ్గించి పూర్తిగా వారి సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యాను. ఈ బంధం ఎంత గాఢంగా తయారయిందంటే, నేను ఢిల్లీ వదిలి వచ్చి వారికి సేవ చేయాలని నిర్ణయించేసుకున్నాను. డబ్బు సంపాదించటం ఒక్కటే ముఖ్యమైనది కాదని, నిశ్చయించుకున్నాను. అంత పవిత్రమయిన వ్యక్తిత్వంగల స్వామీజీ వారు నా జీవితంలో ప్రవేశించిన కారణం చేత నేను వారికి సదా సేవ చేయాలని సంకల్పించాను. వారికి నేను అనుకున్న విషయాన్ని తెలిపాను. కానీ దానికి వారు ఎన్నడు అంగీకరించక, కొద్దిరోజులు ఆగాలి. అలా చేయవద్దు అని చెప్పారు.

రెండు సంవత్సరాల అనంతరం స్వామీజీ వారితో పాటుగా పదిహేనుమంది భక్తులం కూర్చుని వున్న సందర్భంలో ఉత్తర భారతదేశంలో వారికి సెక్రటరీగా సేవ చేసే భాగ్యాన్ని నాకు యిచ్చారు. నేను వారి ప్రసంగాలను అనువదించేవాడిని. వారికి ఏమి కావాలంటే అది అందించేవాడిని. అలాంటి సమావేశాలలో ఒకసారి మేమిద్దరమే వున్న సందర్భంలో వారు నా చెవిలో యిప్పుడు ప్రమాదం సంభవించనుంది సిద్ధంగా వుండమని చెప్పారు. నాకు వారు మా పాప ఎక్కువకాలం జీవించదనీ, నేను దానికి సిద్ధంగా వుండాలని హెచ్చరించారని అర్ధం అయింది.

వారిని కలిసి నాలుగు సంవత్సరాల కాలం గడిచింది. నేను యిప్పుడు వేరే వ్యక్తిని. నా జీవితం యిప్పుడు వారిది. వారు హెచ్చరించిన ఒక మాసం అనంతరం మా అమ్మాయి దీప జీవిత కాలాన్ని నాలుగు సంవత్సరాలు పొడిగించిన అనంతరం మరణించింది. ఈ సంఘటన 1974లో అన్నిటిలో గొప్ప విషయమేమిటంటే మా పాప నోట వెంట వచ్చిన ఆఖరిమాట సచ్చిదానంద అని. ఆరు సంవత్సరాల వయస్సులోనే తను స్వామీజీ వారి కోసం పద్యాలు వ్రాసి వినిపించేది. దీప ద్వారా శ్రీస్వామీజీ వారు నన్ను వారితో పరిచయం పెరిగేలా చేసి ప్రేమ అనే అగ్నిని నాలో రగిల్చి వారికి సేవ చేయాలనే గాఢమైన సంకల్పాన్ని నాలో పెంపొందింప చేశారు. యిది స్వామీజీ వారితో గడిపిన నా బాల్యం.

1970 నుండి 1974 దీప మరణించే సమయానికి, వారితో ప్రేమపూర్వకమైన బంధం ఏర్పడింది. ఆ తరువాత నుండి నేను వారి వద్ద నుండి నాకు వేదనతో కూడిన వేర్పాటును అనుభవమయ్యింది. వారిని విడిచి రెండు మూడు నెలల కన్నా నేను ఢిల్లోలో వుండలేకపోయాను. వారిని చూడకుండా వుండలేక నేను తరచూ ఆశ్రమానికి వస్తూ వారితో కొద్దిరోజులు గడిపేవాడ్ని. ఆశ్రమం ఆ కాలంలో ఒక అడవి ప్రాంతంలా వుండేది. వారితో పాటు కొద్దిమంది మాత్రమే వుండేవారు. నాకు వారితో అందమైన సాహచర్యం కలిగి వుండేది. ఏ విధమయిన ప్రశ్నలు గానీ, విచారం గానీ వుండేది గాదు. కేవలం వారిని చూస్తూ వుండి వారి సాంగత్యాన్ని యిష్టపడడం, వారు నవ్వుతూ, హస్యాలాడుతూ, వారితో ప్రయాణం చేస్తూన్న సమయంలో ఎన్నడూ తీవ్రమైన చర్చలు కూడా జరిగేవి కావు, యివేవి అవసరం వుండేవి కావు.

వారితో సాంగత్యం పెరుగుతూ నన్ను వారిని, వారెవరు? వారికి గల ప్రత్యేకత ఏమిటి? అనే కోణంలోకి లాగాయి. ఒక విధమైన విచారం నాలో మొదలయింది. అప్పటి వరకు నేను ఏ విధమైన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవలేదు. నేను గొప్ప గురువులైన రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, తుకారం, మరియు అనేక మంది ఋషులను గురించిన పుస్తకాలను చదివాను. యిలా చదవడం వలన నాకు ప్రేరణ కలిగి ఒక విధమయిన పదునైన ఆలోచన, భగవంతుణ్ని గురించిన కోరిక కలిగింది. అప్పటి వరకూ నేను శ్రీ స్వామీజీ వారిని భగవంతునిగా భావించలేదు.

ఆయన దేవుడా? ఈ ప్రశ్న నన్ను ఎన్నడు బాధించలేదు. కానీ యిప్పుడు భగవంతుని గురించి ఆలోచన, ఒక అద్వితీయమైన శక్తి విశ్వాన్ని నడుపుతున్నదనీ, వారి మీద వున్న ప్రేమ కాస్తా దైవికమైన కోరిక వైపుకు లాగబడింది. ఆ శక్తి ఏమిటి? నేను వారిని ప్రశ్నించడానికి ఎన్నడూ ధైర్యం చేయలేదు. ఎందువలనంటే వారి వద్ద కూర్చున్నప్పుడు మన ప్రశ్నలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. వారు ఎవ్వరినీ ఎన్నడూ ఒక ప్రత్యేక విషయమై పని చెయ్యమని చెప్పరు. అందువలన మనుషులు అలాగే వుండిపోతారు. ఏదేమయినా నా యీ అన్వేషణ రోజు రోజుకీ అధికమవసాగింది.

నేను ఈ క్షణకాలమైన విషయాలపై తృప్తి చెందక, అదే ప్రశ్న ఎవరో చాలా ముఖ్యులుగా నా జీవితంలో మారడం, నేను యువకుడిగా వున్న సమయంలో నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఒక అభిప్రాయానకి మారాను. యిది నేను చాలా తప్పు చేశానని తెలుసుకున్నాను. ఎందుచేతనంటే ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగాను తయారవ్వకూడదు. నేను వారిలో వున్న అసాధారణ విషయము గురించి వెదకడం ప్రారంభించాను. వారి ఆలోచనలు వారి పనులు మామూలు మనుషులకన్నా భిన్నంగా వుండడాన్ని గమనించడానికి ప్రయత్నించాను.

ఆ తరువాత 1980లో చాలా విచిత్రమైన అనుభవం కలిగి నేను వారి పై దృఢమైన అనుబంధాన్ని పెంచుకున్నాను. నేను 1934లో జన్మించాను. శ్రీ స్వామీజీ వారు 1942లో జన్మించారు. మా యిద్దరికి మధ్య ఎనిమిది సంవత్సరాలు అంతరం వుంది. నాకు నాలుగు సంవత్సరాల వయస్సులో మా అమ్మగారు ఒక మహాత్ముని దర్శించడానికి వెళ్ళారు. ఆయన నన్ను చూసినప్పుడు యితను ఎవరి అబ్బాయి అని అడిగారు. మా అమ్మగారు వెంటనే తన చేతిని పైకి ఎత్తారు. ఆ మహాత్ముడు ‘‘యితను మళ్లీ ఎలా పుట్టాడు? యితనికి జన్మ లేదు. యితను తన పూర్వ జన్మలో తీవ్ర తపస్సు చేశాడు. యితను ఎక్కువ కాలం జీవించడే. మీరు గనక యితను చిరకాలం జీవించాలని అనుకుంటే ఒక నీటి చెరువును అతని పేరున తవ్వించండి’’ అని చెప్పారు.

మా అమ్మగారు తికమకచెంది యింటికి తిరిగివచ్చి మా నాన్నగారికి ఆ మహాత్ముడు చెప్పిన మాటలను తెలిపింది. మా నాన్నగారు యిలాంటి వాటని నమ్మరు. అందువలన ఆ పని చేయలేదు. యిది శ్రీ స్వామీజీ వారు పుట్టకముందు జరిగిన విషయం. తరువాత 1982లో నేను శ్రీ స్వామీజీ వారి సమీపంలో కూర్చుని వుండగా హఠాత్తుగా, వారు నా చెవిలో ‘‘నీ నీటి చెరువు తవ్వకం పూర్తవ్వలేదు. కనీసం నువ్వయినా ఒక నీటి టాంకును కట్టించి ఆ పని పూర్తి చెయ్యి’’ అని చెప్పారు. నేను వెంటనే ఆ మహాత్ముడితో మా అమ్మగారికి జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకున్నాను. శ్రీ స్వామీజీ వారికి నా గత జీవితం మరియు నా గురించిన ప్రతి విషయం తెలుసునని అప్పుడు నాకు జ్ఞానోదయమయింది. నేను కంపించిపోయాను. స్వామీజీవారితో ముఖాముఖి జరుగుతున్నప్పుడు వారికి నా గతం గురించి తెలిసి నన్ను మా తల్లిదండ్రులు చేయని పని పూర్తిచేయింది నన్ను సంపూర్ణునిగా తీర్చిదిద్దారు. నేను వెంటనే కొంత డబ్బును పంపి ఆ పనిని పూర్తి చేయించాను. యిది నా మదిలో చెరగని ముద్ర వేసింది. ఇది ఒక శ్లోకం నిజమని నిరూపించింది. శ్రీ స్వామీజీ వారిని వుద్దేశించి చదివే మంత్రం ‘‘మూడు కాలాలు గురించి తెలిసిన వారు. భూత భవిష్యత్ వర్తమాన కాలలను గురించి తెలిసిన జ్ఞాన పురుషుడు అని’’ యిది నాకు వారు ప్రత్యక్ష్యంగా తెలిపిన యదార్ధ ఘట్టం. తరువాత నాకు వారితో అనుబంధాన్ని బలీయం చేసుకోవడానికి కారణమైనది. యిది యింత బలీయంగా వారికి సేవ చేయాలనే సంకల్పము వారితో వుండడమే నా జీవితం యొక్క లక్ష్యమయింది. మిగతా విషయాలన్నీ నాకు అంత ముఖ్యమైనవిగా అనిపించలేదు.

ఈ సమయమంతా స్వామీజీ వారి భౌతిక జీవన విధానమే గాక, వారి పారవశ్యం కలిగించే భావనలు, చిన్న పిల్లల వంటి మనస్తత్వం, నన్ను ఒక ఉనికినుండి మరొక పారవశ్యం కలిగే వునికిలోనికి తీసుకుని వెళ్ళగలిగింది. నా ఆరాధనా క్రమం అంతా కూడా వారి భజనలను వినడానికి, మరియు పాడడానికి పరిమితమయ్యింది. నాకు వారిపై దైవసంబంధమైన ప్రేమ వున్నట్లే , వారి భజనలంటే అమితంగా యిష్టపడేవాడిని. వారిని భజనలు వింటుంటే నా మానసిక స్థాయిలో మార్పు కలిగేది. నేను ఎదగడం ప్రారంభించాను. ఆ స్థాయి నాకు అధికమైన ఆనందం కలిగించింది. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను వారి భజనలను పాడడం మొదలుపెట్టాను.

నా భౌతికమైన కోరికలన్నీస్వామీజీ వారిని కలిసిన అనంతరం నశించిపోయాయి. 1976వ సంవత్సరంలో నేను యు.ఎస్.లో పి.హెచ్.డి చదువులకై అప్లయ్ చేశాను. నాకు అక్కడ ఒక స్థానం లభించి, విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసే అవకాశం లభించి నేను యింకా విజ్ఞానం సంపాదించాలని ఉత్సుకత కలిగింది. నేను వెళ్లేముందు వారి వద్దకు వెళ్ళి నేను ఎన్నాళ్లు అక్కడ వుంటానని అడిగాను. అప్పుడు వారు రెండు సంవత్సరాలు రెండునెలలుగా అనిపిస్తాయి. అని చెప్పారు. వారేమన్నారో నాకు అర్ధం కాలేదు, కానీ నాకు సమయం అంత తొందరగా గడిచిపోతుందని అర్ధమయింది. నేను నా కుటుంబాన్ని విడిచి యు.ఎస్.కు వెళ్ళాను. ఒక నెల రోజుల అనంతరం అన్ని రకాల ప్రశ్నలు నాలో కలగడం మొదలయ్యాయి. నేను ఎందుకు యిక్కడి వచ్చాను. నేను భారతదేశంలో సంతోషంగా వున్నాను, నేను వారిని వదలి వుండవలసి వచ్చింది. ఏ విధమైనటువంటి జీవితం సాగించ వలసి వస్తోంది. నాకు అలాంటి జీవితం యు.ఎస్.లో దొరుకుతోందా అని అనిపించడం మొదలైంది. సరిగ్గా రెండు నెలలు మరునాటితో ముగుస్తాయనగా నేను యింటికి తిరిగి వచ్చి స్వామీజీ వారి వద్దకు వెళ్లి వారిని మీరు నన్ను ఎందుకు వెళ్ళనిచ్చారు? నన్ను వెళ్ళకుండా ఎందుకు ఆపలేదు? అని అడిగాను. నీకు వెళ్ళాలని చాలా గాఢమయిన కోరిక కలిగింది. కనుక దానిని నేను అంతం చేయాలని అనుకున్నాను. నీకు యింకా వెళ్ళాలని వుందా? అని అడిగారు. దానికి నేను ఎట్టి పరిస్థితులలోను అక్కడికి వెళ్ళనని సమాధానం చెప్పాను.

వారు నువ్వు మళ్లీ వెళతావు కానీ, వేరే విషయమై వెళతావు అని చెప్పారు. 1993వ సంవత్సరంలో వారు నన్ను వారితో పాటు నాద ప్రసార పర్యటనల నిమిత్తమై అమెరికా, వెస్టిండీస్, మరియు యితర దేశాలకు తీసుకుని వెళ్ళారు. ఈ ప్రధాన ఘట్టం నా నమ్మకాన్ని యింకా అధికం చేసింది. నన్ను ప్రాపంచిక విషయాలనుండి యింకా విడిపోకుండా వుండాలన్న విషయాన్ని తెలిపింది. నా జీవితం వారితోనే వుండాలి. కేవలం వారే వుండాలి. వారి దయ వలన నేను నా వుద్యోగంలో వున్నతంగా ఎదిగి, ఎంతో అభివృద్ధి చెంది మంచి పేరును గడించాను. నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆనందంగా సాగించి, విద్యార్ధులలో ఒక చెరగని అభిప్రాయాన్ని కలగజేసుకున్నాను. వాళ్లు నాకు నా బోధనలు చాలా ప్రత్యేకతతో కూడికుని వుండి ఆధ్యాత్మికంగా వున్నాయని తెలిపేవారు.

ఆ సమయంలో నేను స్వామీజీవారితో భౌతికంగా వుండడం కూడా తగ్గింది. అది ఏ విధమైన పొరపాట్లు జరగకపోయినా క్రమంగా దూరం పెరగసాగింది. వారిని నేను ఒక గురువుగా ఆరాధించటం క్రమంగా అధికమవసాగింది. అప్పుడు నేను నా ఉద్యోగం మానేసి ఆధ్యాత్మికత జిజ్ఞాసను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఆశ్రమంలో వారితో పాటు వుంటూ నా మొత్తం సమయాన్ని వారి సేవలో వినియోగించుకోవాలని అనుకున్నాను.

1995వ సంవత్సరం తరువాత శ్రీ స్వామీజీ వారు నన్ను ఆశ్రమానికి రావటానికి అనుమతించారు. వారికి దూరంగా వుండటం చాలా కష్టమనిపించింది. నాకు నేను వారితో చాలా సన్నిహితంగా వుంటూ వారికి దూరంగా ఎలా వుండగలుగుతున్నానని ఆశ్చర్యం కలిగింది. వారు నన్ను వారికి దూరంగా ఉంచడంనాకు ఎంతో బాధ కలిగింది. నాకు వారితో మరొక విధమైన అనుభవం కలగటం మొదలయింది. అది మునిపటిలాగా ప్రేమతో సంబంధమైనది కాదు. నేను స్వామీజీ వారిని పెద్ద టవరులాగా చూసి నేను వారి ముందు చాలా అల్పజీవిని. అని నేను యిది ఎలా భరించగలను? నేను ఆశ్రమంలో తొలి రోజులను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు యిది చాలా కష్టమనిపించింది. మరొక కోణంలో యిది నాకు అమోఘమైన దీవెన అనిపించింది. నాకు నా ప్రశ్నలను గమనించుకునేందుకు చాలా సమయం లభించింది. నేను వాటిపై దృష్టిని పెట్టి రమణ మహర్షి వారిని గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను.

నేను ఆధ్యాత్మిక జీవనం గురించి కొద్దిగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు శ్రీ స్వామీజీ వారి అరవయ్యవ జన్మదినం. 1993లో స్వామీజీ వారి పర్యటనలలో వారు నన్ను ఒక పుస్తకం వ్రాయమని తెలిపారు. నేను ఒక డైరీరాయడం వలన నేను ఆ పుస్తకాన్ని పూర్తిగా రాయగలిగాను. ‘‘నాద ప్రసార గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ టూర్ (Nada Prasara Glimpses of World Tour)’’ అందులో చాలా ఫోటోలు కలిగి ఆశ్చర్యం కలిగించే అనేక సందర్భాలను విశదీకరించడ జరిగింది. నేను వారిని చాలా వస్తువును సృష్టించడం చూశాను. అన్నిటిలోకి అబ్బురపరచిన సంఘటన వారు వారి మోచేతినుండి వజ్రాన్ని సృష్టించడం, ఆ సృష్టి చేసే ముందు వారు మాకు దానిని గురించి చెప్పడం. వారితో వెళ్లినప్పుడు నేను వారి ఫోటోలను తీస్తూండేవాడిని.

ఒక వజ్రాల వ్యాపారి ఆఫీసులో, వారు అతని వ్యాపారాన్ని చూపించమని కోరారు. ఆ భక్తుడు తన వద్దనున్న వజ్రాలను ఒక్కొక్కటిగా స్వామీజీ వారికి చూపడం మొదలు పెట్టాడు. శ్రీ స్వామీజీ వారు చిన్న పిల్లవాడి మాదిరి అవన్నీ చూడడం మొదలు పెట్టారు. ఆ భక్తుడు వాటిలో ఒకటి తీసుకోవలసినదిగా స్వామీజీ వారిని కోరాడు. దానికి శ్రీ స్వామీజీ వారు ‘‘ఒక్కటేనా! నా శరీరమంతా వజ్రాలు వున్నాయి. నేను నీకు యిస్తాను అని వారి భుజాలను రుద్దిఒక వజ్రాన్ని సృష్టించి ఆ భక్తునికి యిచ్చారు.’’ నేను భారత దేశానికి తిరిగి వచ్చాక కొద్దిగా అర్ధం చేసుకోవడం ప్రారంభించాను.

స్వామీజీ వారి అరవయ్యవ జన్మదినానికి నాకు ఒక సావనీరును వ్రాసే పని యిచ్చారు. అందులో 1966నుండి అన్ని ముఖ్యమైన సందర్భాలను, ఆశ్రమం ప్రారంభమయిన నాటినుండి వ్రాయాలి. అది చాలా కష్టమైన పని ఎందుచేతనంటే నేను సంపూర్ణంగా ఆ వ్యాసం వ్రాయాలి. అది నన్ను యింకా చదివేలా చేసింది. వారి జీవిత విశేషాలలో వారి ఆధ్యాత్మిక తత్త్వాన్ని గురించి వ్రాయాలి అని అనిపించింది. అది భగవంతుని ఆశీస్సులతో నాకు గోరక్షనాథ స్వామివారి తత్త్వం వారి ఉపదేశాలను సూచించే ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో ప్రతిపేజీలోను నేను శ్రీ స్వామీజీ వారిని చూడగలిగాను. గోరక్షనాథుడు గొప్ప అవధూత వారి గురువు మత్స్యేంద్రా నాథుడు వారి గురువు దత్తాత్రేయుడు.

నేను గోరక్షనాథుని గురించి చదివినప్పడు స్వామీజీ వారి యోగిక తత్వాన్ని గురించి నా మనస్సుకు తట్టింది. ఒక నాధునిగా నేను నాధుడు అంటే ఎవరో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. నాథుడు సామాన్య మానువులకంటే భిన్నంగా ఎలా వుంటారో, సాధువుల కన్నా భిన్నంగా, యివన్నీ చాలా విచిత్రంగా కనిపిస్తాయి. వూహించలేనంతగా, చాలా అనుహ్యంగా అంచనాలు వేయలేకుండా వుండే లక్షణాలు. నేను స్వామీజీ వారిలో చూశాను. నేను చివరకు అది స్రకమంగా వ్రాయగలిగాను. సిద్ధాంతపరంగా మాకు శ్రీస్వామీజీ వారు నాథ సంప్రదాయంలోని వారని, చెప్పబడింది. అందుచేతనే వారు నవనాథుల ఆలయాలను నిర్మించారు. మొట్టమొదటి నవనాథ ఆలయం దం దత్తనాథ ఆలయం ఢిల్లిలో నిర్మించారు. అప్పుడు నేను శ్రీ స్వామీజీ వారే స్వయంగా నాథులని గ్రహించాను. ఈ ఆధ్యాత్మిక సూత్రం నాకు తెలియదు. కానీ నేను వారి వ్యక్తిత్వాన్ని నిజంగా తెలుసుకోగలిగాను. వారి ప్రవర్తనలో నిజాన్ని గ్రహించగలిగాను.

శ్రీ స్వామీజీ వారిని గురించి ఇరవైపేజీల వ్యాసాన్ని వ్రాయడానికి నాకు దాదాపు అయిదు నెలలు పట్టింది. నాకు అంతకన్నా మంచి వ్యాసాన్ని వారి అరవయ్యవ జన్మదినం సందర్భంగా నేను యింక వేరే వ్రాయలేననిపించింది. ఆ తరువాత నేను మరొక విధమైన మెట్లు ఎక్కగలిగాను. అది ఆధ్యాత్మికంగా శ్రీ స్వామీజీ వారిని అర్ధం చేసుకోవటం నాకు వారిని భగవంతునిలాగా చూడాలనే కోరిక నాలో లేదు. నాకు అసలు ఏ కోరికలు లేవు. నాకు మొట్టమొదటిగా వారితో అంత సన్నిహితంగా వుండేందుకు గల కారణం అర్ధమయింది. అది యింక అవసరం లేదనిపించింది. నేను వారిని పరిశుద్ధ స్వరూపులను అవగతం చేసుకున్నాను. మనమంతా అలాంటి స్వరూపులమే కానీ మనని మనం పవిత్రమైన పద్ధతిలో నడిపించము. ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని చూపుతూ మనం కాలం గడిపేస్తాము. గురువును గానీ భగవతుడ్ని గానీ కేవలం మనం కాలక్షేపం కోసం వినియోగిస్తాము. నేను వినయంతో శ్రీస్వామీజీ వారే నాలో ఈ మార్పును, చైతన్యాన్ని కలిగించారనీ, వారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ముంచి, ఈ మార్గంలోకి నన్ను అనుసంధానం అయ్యేలా చేశారని చెపుతాను.

యిన్ని సంవత్సరాలుగా ఒక పిల్లవాడు తన తల్లి సంరక్షణలో క్రమంగా జాగ్రత్తగా ఎదిగినట్లు, తల్లి గారాబంగా చూసినట్లు, శ్రీ స్వామీజీ వారు తమ ప్రేమను నాపై కురిపించారు. మేము చాలా వారకు స్నేహితులలాగా మెలిగాము. వారితో నాకు భక్తి పలు రకాలుగా కలిగింది. సాక్యభక్తి లేక స్నేహంతో కూడిన భక్తి, దాస్య భక్తి, ప్రేమతో సేవ చేయడం మరియు ప్రేమ భక్తి మొత్తమంతా ప్రేమతో కూడుకుని వుండటం. నాతోటి స్వామీజీ వారికి గల సంబంధమంతా ప్రేమతో కూడినదై స్నేహమయము మరియు ప్రేమమయమైనది.

నా జీవితంలోని చాలా భాగం వారితో గడిపాను. భౌతికంగా, భావపరంగా, నేను వారితో ఒక చిన్న పిల్లవాడు నడచినట్లుగా నడిచాను. వారు నన్ను నడిపించారు. నేను ఎదిగానని చెప్పను, ఎందుచేతనంటే అది శ్రీ స్వామీజీ వారే చెప్పాలి. నాకు భగవంతునిపై గల ఆసక్తి. ప్రేమ కేవలం వారి ద్వారా పెరిగి ప్రస్ఫుటమయింది. నేను ఆ మహోన్నతమైన పరమానందంలో వుండడానికి యిష్టపడుతున్నాను. వారి ద్వారా భౌతికంగా గానీ, విశ్వవ్యాప్తంగా గాని, నేనే ప్రకృతిలో ప్రతి అణువును ప్రేమిస్తాను. భగవంతుడు అన్నిటికీ అతీతంగా వుంటూ, వృక్షాలలో, నీటిలో, అగ్నిలో, భూమిలో, నీరు, వాయువులోనూ నిండి వుంటాడు. శ్రీ స్వామీజీ వారి అనుగ్రహం వలన నేను భగవంతుణ్ని అన్ని చోట్లా చూడగలిగాను.

తల్లిదండ్రులు భౌతిక జన్మనిస్తే, గురువు ఆధ్యాత్మిక జన్మనిస్తారని చెప్పబడింది. యిది అక్షరాల సత్యము.

జయ గురు దత్త

Tags: