శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే 1990వ సంవత్సరంలో ఆశ్రమంలో నా వినయపూర్వక సేవను అందజేయడానికి ఆశ్రమానికి వచ్చాను. సిద్దార్ధగా వారిచే పిలవబడ్డాను. నేను పరమ పూజ్య శ్రీ స్వామీజీ వారి భక్తునిగా మే 1976 నుండి వుంటూ ఇండియన్ ఇనిస్టుట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ప్రఖ్యాతిగల అడ్మినిస్ట్రేటివ్ ఇనిస్ట్యూట్లో పనిచేస్తూండేవాడిని. నేను వివిధ పదవులలో పనిచేస్తూ, నా అంకితభావం మరియు రోజువారీ వ్యవహారాలలో నా నిష్పాక్షిక నిర్వహణకు విద్యాసంస్థవారు మరియు విద్యార్థి సంఘ సంస్థలవారూ ఇష్టపడ్డారు.
నేను నాలుగు సంవత్సరాల వయసులో వున్నప్పుడు మా తండ్రిగారు మరణించడంతో నా తల్లే నా గురువు, మరియు నా రక్షణ బాధ్యతలను చూసుకున్నారు. ఆమె ప్రేమ మరియు శ్రద్ధతో నేను ఆమె ఆదర్శాలకు అనుగుణంగా పెరిగాను. నా తల్లి నుండి నాకు పూర్తి మద్దతు లభించింది. కొన్నిసార్లు నా జీవితంలో ఏదో కోల్పోయాననే భయం నాలో కలిగేది. నేను తరచూ ఆలయాలను సందర్శించేవాడిని. మతపరమైన చర్యలకు అనుగుణంగా నా మనసు అలవాటు పడలేదు. ఎందుచేతనో మతం అనే భావన నా మనస్సనే అద్దం ముందర భాగంలో లేదు.
యిటువంటి యిబ్బందుల మధ్యన 1976 మే నెలలో, నా సహోద్యోగి శ్రీ కుమారు గారు నన్ను శ్రీ ఆర్. ఆర్. భూపతిగారి నివాసంలో జరిగే ఒక భజన (గురువారాలలో జరిగేది) కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు. శ్రీ భూపతి గారు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క గొప్ప భక్తుడు. ఈ భజన కార్యక్రమాన్ని మైసూరు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం బెంగుళూరు శాఖ వారు నిర్వహించారు. నాకు తెలిసిన సాంప్రదాయ భజనల కన్న ఈ భజనలు భిన్నంగా వున్నాయి. ఈ భజనలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ భజనలన్నీ కూడా పూజ్య శ్రీ స్వామీజీ వారి చేత రచించబడి, స్వరం కూర్చబడినవని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. నేను వారి ఛాయాచిత్రంలో వారి కళ్లలో తేరిపార చూసినప్పుడు, ఒక నిర్మలమైన మరియు షరతులు లేని ప్రేమ నా శరీరం మొత్తం విస్తరించింది.
భజనలు ముగిసిన తరువాత భూపతి గారి భార్య శ్రీమతి శకుంతలమ్మగారు పూజ్య శ్రీ స్వామీజీ వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరు కావడానికి ఆసక్తి కల భక్తులు మైసూరు ఆశ్రమాన్ని సందర్శించడానికి రావలసినదని ఆహ్వానించారు. తెలియకుండానే నేను పూజ్య శ్రీ స్వామీజీ వారిని మైసూరు ఆశ్రమంలో దర్శించుకోవాలని నిర్ణయించుకుని, నేను తొలిసారిగా శ్రీ స్వామీజీ వారి పుట్టిన రోజు వేడుకలకు మైసూరు ఆశ్రమానికి అతనితో కలిసి వస్తానని తెలిపాను. అక్కడ నేను వారి పవిత్ర రూపాన్ని దర్శనం చేసుకున్నాను. అది ఎంతో మనోహరమయిన దృశ్యం. నేను నిజానికి వ్యక్తమయిన దైవత్వం ముందు నిలిచాను. ఆ సమయంలో నా భావోద్వేగాలకు భౌతిక వివరణ లేదు. నేను చాలా ప్రశాంతంగా, విస్మయం మరియు ఆశ్చర్యం కలిగి వున్నాను.
కొన్ని నెలలలోపే నేను మొదటిసారిగా పూజ్య స్వామీజీ వారు బెంగుళూరు సమీపంలోని టుముకూర్లోని గణపతి దేవాలయం ప్రతిష్ఠ సందర్భంగా అద్భుత సృష్టి చేయడం చూశాను. అది ద్విముఖి రుద్రాక్షకు బంగారు తొడుగు వుంది. నా అస్పష్ట మనసుకు వాస్తవితక నిరూపణ అయింది. పూజ్య శ్రీ స్వామీజీ వారు నిజంగా భగవంతుని అవతారమేనని నేను నిశ్చయించుకున్నాను.
ఫిబ్రవరి 1977లో మైసూరు ఆశ్రమంలో మహాశివరాత్రి ఉత్సవానికి హజరయ్యాను. ఈ ఉత్సవాలలో నేను అజ్ఞానంతో మరియు సగౌరవంగా సద్గురువును శివుని యొక్క శాశ్వతరూపంలో గమనించగలిగాను. వారు అగ్నికుండంలో దిగి అగ్ని పూజ నిర్వహించారు.
ఈ సందర్భంలో అక్కడి భక్తులు శ్రీ స్వామీజీ వారు మహాశివరాత్రి సమయంలోనూ నవరాత్రి ఉత్సవాలలోనూ ఈ అగ్ని పూజ చేస్తారని నాకు తెలిపారు. అక్కడ ఓం నమఃశివాయ అనే నామం చేస్తూ ప్రేక్షకులు కదలకుండా వుద్వేగభరితంగా పూజించారు. ఆ సాయంత్రం భక్తులు అందరూ సచ్చిదానందేశ్వరునికి వ్యక్తిగతంగా అభిషేకం నిర్వహించడానికి అనుమతించారు. నేను నా జీవితంలో తొలిసారిగా రాత్రంతా మరుసటి వుదయం వరకు వేడుకల్లో నిమగ్నమయ్యాను. ప్రఖ్యాత కళాకారులచే సంగీత కచేరీలు, రాత్రి పూట చేయవలసిన పూజాది క్రతువులు నిరంతరాయంగా నిర్వహించబడ్డాయి. పూజ్య శ్రీ స్వామీజీ వారి చేత ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మరియు దీవెనలు నా జీవితంలో మరపురాని అనుభూతులయ్యాయి.
నా విశ్వాసం మరియు నా స్పృహ వేగంగా పెరిగిపోయింది. ఈ ప్రాపంచిక ఆలోచనలు స్మృతిలోనుండి తొలగిపోయి స్వామీజీ వారిపై కేంద్రీకృతమయి నాకు పనిచేయగల సామర్ధ్యం సులభమయింది. దీని వలన నేను మెరుగయిన జీవనం సాగించగలిగాను. నాకు యిప్పుడు ఒత్తిడిలేని తనానికి మరియు పని ఒత్తిడికి గల పరిమితులను గ్రహించగలిగాను.
1981లో శ్రీ కృష్ణభట్ గారు బెంగుళూరులోని గిరినగర్లో భూమిని జ్ఞానబోధ సభ కార్యకలాపాలు నిర్మహించాడానికి శ్రీ స్వామీజీ వారికి బహూకరించారు. నేను స్వచ్ఛంద సేవలను మరియు ఇతర సేవలను అందించడంలో చురుకుగా పాల్గొన్నాను. నేను చేసిన చిన్న చిన్న సేవలకు గాను శ్రీ స్వామీజీ వారు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించిన సంఘటలను నాకు జ్ఞాపకం వున్నాయి. నేను కొన్ని సంఘటనలు యిక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఫిబ్రవరి 1982లో నాకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వలన నాకు ఛాతీలో ఎడమవైపు పక్కటెముకలు విరిగి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆలోపతి, ఆయుర్వేదం మరియు దేశవాళీ ఎముకల అమరిక లాంటి రకరకాల వైద్యాలు చేసినా నాకు ఛాతీలో ఎముకల నెప్పి తగ్గలేదు. 1983 మే నెలలో శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి ఉత్సవాలు మైసూరులో ఘనంగా నిర్వహించబడ్డాయి. నేను నా సోదరి (శ్రీమతి పార్వతమ్మ) మరియు నా మేనల్లుళ్లతో చెప్పుల స్టాండు వద్ద నా సేవను చేశాను. కార్యక్రమం చివరన నేను శ్రీ స్వామీజీ వారి దివ్య హస్తముల ద్వారా లక్ష్మీ నృసింహుని ప్రసాదం అందుకున్నాను. నేను ఆ ప్రసాదం తిన్నాను. ఆ మరునాడు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ నా పక్కటెముకలు సాధారణ స్థితి చేరుకున్నాయి. నేను వారి దయ ద్వారా మానసికంగా చలించిపోయాను. నాకు ఈ ఆనందం వర్ణించడానికి వారికి కృతజ్ఞతలను తెలపడానికి పదాలు చాలవు.
నేను జ్ఞాపకం చేసుకుంటున్న మరొక సంఘటన 1978నుండి నాకు స్పాండిలైటిస్ చాలా బాధాకరంగా వుండేది. 1989లో ఒకరోజు ఉదయం పూజ్య శ్రీ స్వామీజీ వారు నా కలలో కనిపించారు. ఆ కలలో వారు నా భుజం మీద వారి కుడిచేతిని వేసి నాతోపాటు నడిచారు. వారు నాపై కురిపించన దయకు పులకరించిపోయాను. నా మనస్సు వారి పవిత్రమైన పాదాలకు ప్రణామాలను సమర్పించాలని కోరుకుంది. ఆకస్మాత్తుగా శ్రీ స్వామీజీ వారి నడక ఆగిపోయింది. నేను వారి పాదాలను తాకి ప్రణామం చేసాను. శ్రీ స్వామీజీ వారు తమ పవిత్ర హస్తాలను నా వెన్నపూసపై కదుపుతు నాకు నొప్పి వున్న భాగంలో వారి చేతిని ఆపివేసి ఈ రోజున నేను నిన్నుఅమితంగా ఆశీర్వదిస్తున్నాను అని తెలిపారు. వారి చేతుల నుండి ప్రసారమయిన శక్తి, హై వోల్టేజి విద్యుత్తు షాక్ లాగా కొద్ది క్షణాలు అనిపించి నా నొప్పి మటుమయామయి నా జీవితకాల బాధ అదృశ్యమయిపోయింది. ఈ సంఘటన సద్గురువుపై నా విశ్వాసం పెరిగి నేను బెంగుళూరు ఆశ్రమం కార్యకలాపాల్లో చురుకుగ్గా పాల్గొన్నాను. 1990లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో వుద్యోగం నుండి విరమించుకుని నా రాజీనామా సమర్పించి ఆశ్రమంలో చేరాలని నిశ్చయించుకున్నాను. నా పై అధికారులు, నిర్వాహకులు మరియు సహోద్యోగులు నా ఈ నిర్ణయాన్ని విఫలం చేయాలని ప్రయత్నించారు. కానీ నేను నా పిలుపును విన్నాననీ, నా సద్గురువునకు మాత్రమే సేవ చేయాలని నిర్ణయించుకున్నాను.
చివరగా నేను మైసూరు ఆశ్రమానికి మే 27న 1990లో వచ్చేసాను. నా మొట్టమొదటి సేవ ఒక టెలిఫోన్ అటెండరు. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క కృపతో నేను పరిపాలన విభాగంతో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగా వ్యవహరిస్తూ, భక్తిమాల ట్రస్ట్ మేనేజర్ మరియు ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నాను. అంతేకాక 1987 నుండి రెండు ఆశ్రమ శాఖలలో అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతను కూడా వహిస్తున్నాను. నా గురువు తన అవతార రూపాన్ని పొందిన పవిత్ర సంగమం అయిన మేకేదాటు (సంగమం)లో సహజమైన స్వభావం కలిగిన గురునిలయం, ఆలయ సముదాయం, ఆధ్యాత్మిక/ సాంస్కృతిక మరియు సాంఘిక కార్యకలాపాలు, అన్నదానం కోసం వంటగది మరియు భోజనశాలలు మరియు సందర్శకులకు వసతి వంటివి.
సంగమం వద్ద గల సంగమేశ్వర ఆలయానికి జయలక్ష్మీ మాత విచ్చేసి అక్కడ ప్రార్ధనలు మరియు విగ్రహానాకి అలంకారాలు జరిపిన ప్రాంతంగా కూడా పునర్నిర్మింపబడింది. రెండవ ప్రదేశం సోగాల. శ్రీ జయలక్ష్మీ మాత జన్మించిన యిల్లు. గ్రామస్తుల ప్రయోజనం కోసం ఈ యిల్లు ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలకు ఉద్దేశించబడింది. ఈ గ్రామంలో, మాతా జయలక్ష్మీ ముత్తాతగారైన శ్రీ యోగి సుబ్బయ్య గారి అధిష్ఠానంకూడా వుంది. ప్రజలు తమపై గల దుష్ట ప్రభావాలను వదిలించుకోవడానికి విశ్వాసంతో వచ్చి ఈ స్థలాన్ని పూజిస్తారు. ఈ పవిత్ర స్థలాల అభివృద్ధితో సంబంధం కలిగివుండడం నాకు గొప్ప అదృష్టం. నా జీవితంలో అతి గొప్ప అద్భుతం పూజ్య శ్రీ స్వామీజీ వారు నా మానసిక ప్రవర్తనను దుర్వాసుని స్థాయి నుండి సిద్దార్ధ స్థాయికి మారేలా చేశారు. బెంగుళూరులో వున్నప్పుడు నేను స్వభావరీత్యా అధికంగా దూకుడు గల వ్యక్తిని.
దీని అర్ధం పూజ్య శ్రీ స్వామీజీ వారు వారి పరోక్ష బోధనల ద్వారా నాక ప్రశాంతత మరియు నిశ్శబ్ద వ్యక్తి గా మార్చారు. దీని ద్వారా నా ఉగ్ర స్వభావం కారణంగా ఉత్పన్నమయ్యే తప్పుల వల్ల నేను మళ్లీ జన్మలను తీసుకోకుండా, నా తప్పులను దిద్దివేసారని నేను భావిస్తున్నాను. యిది కేవలం నా సద్గురు దేవులయిన పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి వల్లనే సాధ్యమయింది.
జయ గురు దత్త