SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019
కళ్యాణి నాన్సీ ముర్రే, పిట్స్బర్గ్ (Kalyani Nancy Murray, Pittsburgh,USA)

వారిని భౌతికంగా కలుసుకునే ముందు తరచుగా వారితో భక్తులు సంబంధం పెట్టుకుంటారు. నా సద్గురు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో నా అనుభవమే ఈ కథ. నేను 1984లో మొదటిసారిగా వారిని కలిశాను, కానీ 1982 మరియు 1983 మధ్య ఆయనను నేను నా కలలలో ఛూశాను. ఆ ప్రారంభ సంవత్సరాలలో వారి భక్తులలో ఒకరయిన పద్మా ఫిల్లిస్ టర్క్ దత్తా రిట్రీట్ సెంటర్లో మేనేజర్, మహిళలు సాంప్రదాయేతర ఉద్యోగాలు చేయడానికై నేను నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొన్నారు. ఆమె తన గురువుతో గడపడానికి భారతదేశానికి వెళ్లటానికి డబ్బు సంపాదించడానికై ఉద్యోగం పొందడానికి ఈ శిక్షణ తీసుకున్నది. ఆమె యింతకు ముందు అక్కడకు వెళ్లి ఎంతో ఆనందించింది.

పద్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వారి గురువు మరియు వారి ధ్యానం గురించి మాట్లాడారు. మా బృందం అంతా కలిసి ఆమెతో ధ్యానం చేయడం ప్రారంభించింది. శ్రీ స్వామీజి సంగీతం, మరియు వారు చేసే శ్వాస ప్రక్రియలను, ప్రాణాయామాలని పిలిచే పద్ధతులను ఈ సెషన్లలో ఉపయోగించారు. నాకు కొన్ని కలలు వచ్చేవి. అన్ని రకాల అంతర్గత విషయాలు జరుగుతుండేవి. ఆ సందర్భంలో నేను నా ఆధ్యాత్మిక ఉన్నతికై మరియు రోగాలను నయం చేసే ప్ర్రక్రియలను అభ్యసించాలని తగిన గురువు కోసం నా జీవితంలో నిరీక్షించే సమయం. ఒక రోజు రాత్రి నేను చాలా నిరాశ చెంది, ఆర్తితో విశ్వం నుండి చేసిన నా అభ్యర్ధన నాకు స్పష్టంగా గుర్తుకు వున్నది. నా యీ అభ్యర్ధన ఆరు నెలలు కూడా తిరగకుండానే, నేను పద్మతో ధ్యానం చేసే అవకాశం కలిగి శ్రీ స్వామీజీ వారిని సంవత్సరం తిరిగేలోపు పిట్స్ బర్గ్ లో సందర్శంచుకునే గొప్ప అదృష్టం కలిగింది.

1984-1985 సమయంలో ఒక సాయంత్రం శ్రీ స్వామీజీ వారి భక్తి కార్యక్రమాలకై పద్మ వాళ్ళ యింటికి ఆహ్వానించబడ్డాము. ఆమె శ్రీ స్వామీజీ వారిని పరిచయం చేసింది. నేను, ‘ఓహ్ యిది బాగుంది!‘ అని అనుకుని వారి వద్దనుండి ఏమి ఆశించాలో తెలియక, అక్కడ అనుసరించవలసిన నియమాలు కూడా తెలియక, పాశ్చాత్య జీవన విధానానికి అలవడ్డ రీతిలో, ఉన్నత హోదాలో వున్న ఒకరిని కలిసినప్పుడు అనుసరించ వలసిన పద్ధతి ప్రకారము నేను వారికి నమస్కరించి నా చేతిని కరచాలనమునకై వారివైపుకు చాపాను, ఏం జరిగిందో గ్రహించేలోపుననే నేను నేల మీద పడి వారి ఎదురుగా ఏడుస్తూండడం మాత్రం తెలిసింది.

ఆ తరువాత ‘ఇక్కడ ఏమి జరగబోతోంది? ఏం జరిగింది?’ అని నాలో నేను అనుకుంటున్నాను అంతకు మించి నాకు ఏమీ గుర్తుకు లేదు.యింతలో స్వామీజీ వారు వచ్చి నన్ను చరచినట్లు తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఏదో జరిగిందని నాకు అర్ధం అయింది. కానీ అది చాలా వరకు నేను నిజంగా కొట్టుకుపోయి, వెచ్చదనం యొక్క అనుభూతి శరీమంతా ప్రవహించింది. నేను వారి ఉనికిలో ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. వారి క్షణకాల దృష్టి నా మీద పడడం చేత నేను వారి ఆశీర్వాదాన్ని పొందగలిగాను. సమయం గడిచే కొద్ది వారు నా జీవితంలో వుండడం జరిగింది.

1985లో ఎరీలేక్ ఎయిరే తీరాల వద్ద ఒక మఠంలో, ఏడు రోజుల పాటు క్రియాయోగ నిర్వహించారు. ఆ సమయంలో వారితో గడిపేందుకు నాకు అవకాశం వచ్చింది. ప్రాధమికంగా క్రియాయోగ అనేది ఆధ్యాత్మిక అభివృద్దిని పెంచటానికి మరియి దైవత్వాన్ని అనుసంధానించడానికి ఒక యోగమార్గం. అది ఒక అద్భుతమైన పరివర్తన అనుభవం. మేము వారి మార్గదర్శకత్వంలో ఆరుగంటల పాటు ధ్యానం చేశాము. నిశ్శబ్దంలో అన్ని వ్యాయామాలు చేయడం, దాదాపు ఆ వారంలో శక్తి ప్రసారాన్ని అనుభవించాము.

ఒక వ్యక్తిని వారు చేరటానికి వివిధ మార్గలు వున్నాయి. క్రియాయోగ కార్యక్రమానికి నాకు హాజరు కావాలనే ఉద్దేశ్యం లేదు. అయినప్పటికీ నమోదు చేసుకున్న ఒక వ్యక్తికి రావడానికి తగిన రవణా లేనందున రాలేదు. ఒకరికి అవకాశం మిగిలి వుంది. నేను ఈ ఖాళీనీ పూరించగలనని అనుకున్నాను. నేను ఆమెను నా కారులో తీసుకుని రావడానికి సిద్ధమయ్యాను. నేను ఈ యోగాభ్యాసాన్ని తెలుసుకోవడానికి చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. ఈ స్నేహితురాలికి ఒక రైడ్ అవసరమని, నేను భావించాను. ‘‘ఓహ్ నాకు వారం పాలటు సెలవు దొరికింది. నా పుట్టిన రోజుకు ఒక మంచి స్నేహితుడు డబ్బును యిచ్చాడు.’’ ప్రయత్నం చేయకపోయినా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఈ సమయములో కొన్ని అద్భుతమైన విషయాలు నా వాస్తవపరిధి ఆవల జరుగుతున్నాయి. అక్కడ ఉన్న ఒక యువతి కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. స్వామీజీ వారు తన సహాయకులను దగ్గరలో వున్న చెట్టునుండి కొన్ని ఆకులు తీసుకురమ్మని అడిగారు, వాటిని ఆమెకు కాన్సర్ వున్న శరీర భాగంలో కొన్ని క్షణాలపాటు వుంచారు. ఆకులు తొలగించి వారి సహాయకులను వాటిని పాతిపెట్టమని తెలిపారు. తరువాత ఆమెకు కాన్సర్ వ్యాధి నయమయిందని మేము కనుగొన్నాము.

ఏడురోజుల ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కార్యక్రమ ముగింపు సందర్భంలో స్వామీజీ వారు కూర్చుని మమ్మల్ని మాట్లడానికి అనుమతినిచ్చేవారు. మేము స్కిట్ ప్రదర్శించేవాళ్లము. స్వామీజీ వారు చాలా ఆనందించేవారు. ఎక్కువగా హాస్యభరితమైన ప్రదర్శనలు చేసేవాళ్లము. వారు నవ్వడం మాకు హుషారు కలిగించేది. ఒకసారి ఎవరో ఒక గులాబీ పువ్వును వారికి అందజేశారు. ఆ గులాబీను తీసుకుని వారి చేతిలో ఆ రేకులు రుద్దడం ప్రారంభించారు. విభూతి వెల్లువలా బయటకు వచ్చింది. వారి చుట్టూ ఒక సన్నని పొగతో కూడి వున్న మబ్బు వారిని చుట్టి వుండగా, వారు ప్రజలమీదికి ఊదడం మొదలు పెట్టారు. గులాబీలు మరియు మల్లెల యొక్క అద్భుతమైన సువాసనతో గాలి నిండిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ విభూతిని కొంచెం పొందారు, కొందరు విశ్వవ్యాపకతను గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఆనందానుభూతి చాలా అద్భుతంగా వుంది.

చాలామంది వారిని కలుసుకునే ముందు దర్శించారు. వారిని మేము యిదివరకు వేరొక సందర్భంలో కలుసుకుని వున్నందున తరచూ మాతో మాట్లాడతానని చెప్పారు. ఇక్కడ వున్న చిన్న సమూహం, తిరిగి 1980లో, సెంటర్ ప్రారంభమైనపుడు ఎవరైనా వారిని మీరు వెస్ట్రన్ పెన్సిల్వేనియాకు ఎందుకు వచ్చారు? అని అడిగినపుడు వారు కొన్ని మంచి ఆత్మల కోసం చూస్తున్నానని చెప్పారు. వారికి సహాయం అవసరం కలగటం వలన మరియు వారికి మునుపటి జన్మల నుండి తెలిసిన ప్రజలు యిక్కడ వున్నారని తెలిపారు. ఆ భావన నాకు ఖచ్చితంగా యిరవై సంవత్సరాలుగా వారి చుట్టూ వున్న ఆ పాశ్చాత్యులలో మేము ఒకరమని స్ఫురించింది. మేము మా జీవితాల్లో చేసిన వాటిని డి.ఆర్.సి. వద్ద సిద్ధం చేసే అవకాశము మాకు కలిగినది.

నేను వారిని పలు విధాలైన మార్గాలలో దర్శిస్తాను. చాలా ప్రియమైన స్నేహితుడు, బ్రహ్మాండమైన గురువు, మరియు నా ఆద్యాత్మిక మార్గదర్శిగా వేర్వేరు సమయాల్లో వారు వివిధ పాత్రలను నెరవేరుస్తారు. అనేకమంది భారతీయులకు డి.ఆర్.సి. తో అనుససంధానించబడినవారు, వారి కుటుంబాల కోసం ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉంటారు. బహుశః తరతరాలుగా వుండవచ్చు. వారు చాలా మాధ్యమాల ద్వారా వస్తారు; వారి సంగీతం,వారి స్వస్థత చికిత్స మరియు సామాజిక మరియు వైద్య కార్యక్రమాలు వంటి మద్దతునందచేయటం, వారు భారీ సామాజిక సంక్షేమ సంస్థ వంటివారు.

నా జీవితంలో ప్రతిదీ మారడం జరిగింది. నా ఆలోచనా విధానానికి మరింత మార్గనిర్దేశకత లభించింది. నా ఆలోచనా పరిధికి అందని అనుకోని సంఘటనలు సంభవించాయి. వారు నిజానికి గాలిలో నుండి సృష్టి చేస్తున్నప్పుడు నేను చాలా సార్లు వారి సమీపంలో వుండడం జరిగింది. కొందరు శివరాత్రి ఉత్సవాల్లో భారతదేశంలో వుండడం గురించి మాట్లడతారు. వారు వారి తలను దాటి వెళ్తున్న అగ్నిజ్వాలలు గల అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ జ్వాలలు వారిని తాకేవికావు.

నాకు వారితో వున్న అనుబంధం మరియు చాలామందితో పరిచయాలువంటివన్నీ కూడా హృదయాల యొక్క భావనలని నాకు తెలుసు. యిది హేతుబద్ధమయినది కాదని నేను ఆలోచిస్తున్నాను. యిదంతా భావోద్వేగంతో కూడుకుని వున్నది. ఎలాగంటే ఎవరో నా లోపలికి చేరుకుని నన్ను పట్టుకుని నా హృదయాన్ని లాలనగా చూస్తున్నట్లనిపించింది. ఆ క్షణాలలో నేను భావోద్వేగంలో తేలియాడాను. దానిని వర్ణించడానికి నాకు మాటలు చాలవు.

చాలా సందర్భాలలో ప్రార్ధనలో కూర్చొని లేదా స్వామీజీ వారి సంగీతం వింటూన్నప్పుడు నాకు ఈ భావాలు అనుభవంలోకి వస్తాయి. వారితో వుండడం, వారి రక్షణ అనే అనుభూతిని చెందటం, ఒక విధమయిన మార్గం కనబడుతూంటుంది. ఎవరికో ఈ విషయాలు తెలుసు, మరియు వాస్తవానికి నా ఆలోచనా పరిధికి మించిన సమాచారం వుంటుంది. వారు మన విషయాల మీద దృష్టి పెట్టడం నేనే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి దైవిక అంతర్లిన జ్ఞానం వుందని….. మనలని గురించి ఈ విశ్వములో శ్రద్ధ తీసుకొని మార్గనిర్దేశం చేయబడుతున్నామని నేను ఊహిస్తున్నాను.

1990ల నాటికి దత్తా యోగా కేంద్రం నా జీవితంలో ఒక భాగంగా మారింది. వాషింగ్టన్ స్టేట్ న్యూ ఇంగ్లాండు స్టేట్సుకు చాలా దూరంగా వున్న భక్తులు ప్రధానంగా వారి ప్రాజెక్టు నిర్మాణం మరియు సంరక్షణలో పాటుపడ్డారు. 1993లో మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ వారు ఆ సెంటర్ మూసివేస్తామని మాకు చెప్పారు. కేంద్రం యొక్క ప్రయోజనం సాధించబడినదని వారు ఒకరికి తెలిపారు. అప్పుడు ఎవరో స్వామీజీ వారిని ‘దీని అర్ధం ఏమిటి? మేము మీరు చెప్పిన ప్రకారంగా యిక్కడ నిర్మించాము కదా’’ అని అడిగారు. పెన్సిల్వేనియాలో మూడు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోకుండా భూకంపాలను నివారించడానికి కేంద్రం స్థాపించిన ప్రయోజనాల్లో ఒకటి అని ఆయన చెప్పారు. అప్పుడు వారు సెంటరును మిసిసిపి డెల్టాకు సమీపానికి భవిష్యత్తులో సంభవించే విపత్తుల నుండి నివారించే నిమిత్తం తరలిస్తున్నారని మాకు అర్ధమయింది. అది ఖచ్చితంగా కత్రినా మరియు మిసిసిపీకు వరదలు సంభవించే ముందుగానే తరలిచండం జరిగింది.

శ్రీ స్వామీజీ ప్రారంభ సందర్శనల సమయంలో ఈ స్థలం అందరికీ. ప్రతి మతం, రంగు, తెగ మరియు అన్ని మతాలకు సంబంధించిన వారికి తెరచి వుంటుందని తెలిపారు. ప్రజలు వారి సొంత ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు వ్యక్తిగత వైద్యం కోసం యిక్కడకు వచ్చి పరిష్కారాలను కనుగొనేందుకు ఉండాలని సంకల్పించారు. దీని యొక్క సూచన ధ్యాన భవన నిర్మాణం జరిగిటేప్పుడు ప్రపంచంలోని ప్రధాన మతాల చిహ్నాలు అక్కడ వుంచాలని స్వామీజీ కోరారు. యేసు, మేరీ, యూదు-క్రైస్తవ మతాలకు సంబంధించిన కొన్ని విగ్రహాలు అక్కడ వున్నాయి. బౌద్ధమతం మరియు హిందూమతాల ప్రాతినిధ్యం వహించే విగ్రహాలు కూడా స్థాపించబడినాయి.

ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు జ్యూడో క్రిస్టియన్ సంస్కృతికి చెందినవారు. దత్త పేరుతో కనెక్ట్ కాలేదు. యేసు యిక్కడ ఒక ముఖ్యమయిన ఆధ్యాత్మిక వునికి అని స్వామీజీ గుర్తించారు కాబట్టి అక్కడ వివిధ విగ్రహాలు మరియు విషయాలు, మెడిటేషన్ హాల్లో యేసు యొక్క చిత్రం ప్రతిరూపంగా వుచండటం జరిగింది. అయితే స్థానిక ప్రజలు వారు మొదట వచ్చినప్పుడు అది ఏదో ఒక రకమైన అసహజ ప్రదేశం లేదా యిక్కడకు వచ్చే ప్రజలు వేరొక రకమైన సంప్రదాయం గలవారని భావించారు.

మేము విధ్వంసకతతో కూడిన ఒక చిన్న సమస్యను ఎదుర్కొనవలసి వచ్చింది. వారు నిర్మాణాలను కాకుండా అక్కడు వున్న మా సంకేతాలను తొలగించారు మరియు యిక్కడకు వచ్చిన ఆ వ్యక్తులు మాకు దొరకలేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సమస్యను స్వామీజీ వారి వద్ద వుంచాము. స్వామీజీ వారు మాట్లాడుతూ ‘‘సరే కేవలం సంకేతాలను మార్చండి, వాటిపై యేసు డిఆర్సిని వుంచండి’ అని అన్నారు. మేము అలాగే చేశాము అప్పటి నుండి మాకు ఎటువంటి యిబ్బందులు కలగలేదు.

స్వామీజీ వారు మాట్లాడేటప్పుడు బహుళస్థాయిలలో మాట్లాడతారు. ప్రాక్టికాలిటీ నుండి యూనివర్సల్ డివినిటీకి మీరు మీ దైవత్వాన్ని పిలుస్తారా; యేసు, అల్లాహ్, బుద్దుడూ లేదా కృష్ణ అనేది నిజంగా ముఖ్యమైనది కాదు యిది మీ హృదయంతో మీకు గల సంబంధం అనే ముఖ్య విషయము.

చాలా అసాధారణమైన వాటిలో ఒకటి, యిది నిజంగా నాకు మరింత వ్యక్తిగత కథగా వుంది. కేంద్రం ప్రారంభమై భూమిని చదును చేశాక, శ్రీ స్వామీజీ కొద్దికాలం పాటు మాతో వుండడానికి తిరిగి వచ్చారు. మేము కొన్ని భవనాలను అద్దెకు తీసుకున్నాము. స్వామీజీ వారు అందులో బస చేశారు. వేరు ప్రాంతాలనుండి ప్రయాణాలు సాగిస్తున్న వారు వేరే ట్రైలర్లో వుండడానికి, మేము ఆ శిబిరంలో వుండాలని అనుకున్నాము. ఉదయం వారు శివుని శిల వద్ద పూజలు చేస్తారని మేమే మరికొంత అటవీ ప్రాంతాలను శుభ్రం చేశాము. ప్రతి ఉదయము మేము కొద్ది ప్రాంతాన్ని శుభ్రం చేసేవారము. అక్కడ నేను కాంపింగ్ చేశాను. నాకు అక్కడ జరిగే వాటికి సంబంధించిన స్పష్టమైన కలలు కలిగేవి.

ఈ నిర్మాణ కార్యక్రమంలో నేను పాల్గొనటం చేత, కొన్ని భవనాల డ్రాయింగులు వారి వద్దకు తీసుకువెళ్లాను. వారు ఆమోదించకపోతే వారు నాతోటి యింకా కలలను కనమని చెప్పేవారు. ఒకరోజు శివుని చుట్టూ తిరుగుతూ, కొంత దూరం నడిచిన తరువాత జోష్, కాఫీ మరియు నేను ఆయనతో వున్నాము. వారు ఏమి చేస్తున్నారో అని అడిగాము. దానికి వారు ప్రశాంతంగా యిలా తెలిపారు. ‘‘యిది భవనం యొక్క పరిమాణం, నేను భవనం యిలా వుండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నేను ఆ ప్రకారంగా వారికి డ్రాయింగ్ మరుసటి రోజు యిచ్చాను. అప్పుడు వారు ‘‘యివి కొద్దిగా సరిపోయేలా వున్నాయి మీరు మరిన్ని పొందుతారు’’ అని అన్నారు. మరి కొంత సమాచారం అందుతుంది, కానీ మీరు యిప్పుడు తగినంత సంపాదించారు. వాటిని ఒక వాస్తుశిల్పి లేదా నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగులను గీయగల వ్యక్తి వద్దకు తీసుకువెళ్లవచ్చు’’ అని అనుమతినిచ్చారు.

మేము ఒక వాస్తు శిల్పిని కనుగొనగలిగాము. అతడు ఒక యువకుడు ఎల్లప్పుడూ ఒక చర్చిని రూపకల్పన చేయాలని కోరిక కలిగినవాడు. యూనివర్సల్ టెంపుల్ యొక్క డిజైన్ చేశాడు. నిజానికి ఒక పూజారిగా చదువుకుని భవనం డ్రాయింగును చాలా సమంజసంగా ఖరారు చేశాడు. దురదృష్టవశాత్తు అతను భవనం పూర్తవకుండానే మరణించాడు. స్వామీజీ వారు అతని కోరికను నేరవేర్చారు. అది పూర్తయినప్పుడు భవనం యొక్క ప్రతిష్ఠాపన సమయంలో అతని భాగస్వాములు కూడా వచ్చారు. యిది నాకు చాలా అసాధారణమైన పురోగతి. మనము కోరుకున్నదానికి మార్గాన్ని కనుగొనగలమనీ, ఆ విషయాలు మన అంతర్గత సత్యాలని నేను భావిస్తున్నాను.

ప్రజలకు చేసే సామర్ధ్యం ద్వారా నాకు గొప్ప పురోగతి వుంది. నేను ఎవరికీ తెలియదు లేదా వారు నాకు తెలియరు. స్వామీజీ మమ్మల్ని అందరిని ఒక ప్రయోజనం మరియు బంధం కోసం యిక్కడకు తెచ్చారు. అందరూ కలిసి ఎలా జీవించవచ్చు మాకు చూపించడానికి ఆయన యిక్కడకు వచ్చారు. యిది ఒక ‘‘కర్మ ఫార్మ్’’ వారు చాలా రకాల ఆత్మలతో ఒక సంబంధాన్ని ప్రోత్సహించడము ఎంతో అద్భుతంగా వుంది. వారు గట్టిగా మరియు కంటిచూపుతో ఒక ప్రాజెక్టును నిర్ణయించుకుని దానిని సులభంగా నిర్వహించడానికి ఒక ప్రణాళిక చేసారు. వారు అణగద్రొక్కబడిన జీవులమీద శ్రద్ధ తీసుకుంటూ, వారిని దైవత్వం వైపు ఎదిగేలా చేయటం నేను చూశాను. నేను యింకా యింతకంటే ఏమి చెప్పగలను. వారి దత్త కుటుంబంలో వుంటూ నేను సంతోషంగా వున్నాను. నా మనస్సులో శాంతిని కలిగి వున్నాను.

జయ గురు దత్త

Tags: